Farmer Success Story: వ్యవసాయరంగం సంక్షోభంలో ఉంది. సాగు దండగ అనే వారికి బీహార్లో పిప్రా కోఠిలోని సూర్యపూర్వ గ్రామానికి చెందిన మాజీ సైనికుడు పరిష్కార మార్గం చూపుతున్నారు. అర ఎకరంలో అన్ని రకాల కూరగాయలు సాగు చేసి లక్షలు ఆర్జిస్తున్నారు. సైనికుడిగా విధులు నిర్వహించి రిటైర్మెంట్ తీసుకున్న రాజేష్ కుమార్, తన గ్రామంలో అతనికున్న అర ఎకరం పొలంలో వ్యవసాయ చేయడం మొదలు పెట్టారు. మొదట గ్రామస్థులంతా ఎగతాళి చేశారు. ఎవరేమనుకున్నా తాను చేయాలనుకున్న పని పూర్తి చేసుకుని వెళ్లారు రాజేష్. ప్రస్తుతం నెలకు 2 లక్షలు ఆర్జిస్తూ నవ్విన వారికి శభాష్ అనిపించుకుంటున్నారు.
ఉద్యోగం నుంచి రిటైరయ్యాక చాలా మంది విశ్రాంతి కోరుకుంటారు. కానీ సైన్యంలో పనిచేసి మాజీ అయిన రాజేష్ కుమార్ ఏదైనా చేయాలని సంకల్పించారు. అతనికున్న అర ఎకరం పొలంలో సాగు మొదలు పెట్టారు. మొదట్లో అందరూ జవాను వ్యవసాయం చేయడం అంటే ఎగతాళి చేశారు.
ఎప్పటి నుంచో సాగు చేస్తున్న వారికి నష్టాలు వచ్చి సాగుకు దూరం జరుగుతుంటే సైనికుడు వ్యవసాయం చేయడం ఏంటి అని అందరూ ముక్కున వేలేసుకున్నారు. అయినా రాజేష్ ఎవరి మాట వినలేదు… సరి కదా తాను పండించిన సొరకాయలు, కాకర, టమాటా, బెండ, దొండ, బంగాళాదుంపలు తానే పంటను పొలం వద్దే వ్యాపారులకు విక్రయించడం ప్రారంభించారు. ఇక నెలకు రూ.2 లక్షల ఆదాయం సంపాదిస్తున్నారు. ఉద్యోగం చేసినప్పుడు కంటే నేడు నాలుగు రెట్లు అధిక ఆదాయం సాధిస్తున్నాడు. దీంతో ఊరి జనం కథలు కథలుగా చెప్పుకోవడంతో చివరకు మీడియాకు సమాచారం అందింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా రాజేష్ కథనం వైరల్ అయింది.
Also Read: Agricultural Change: క్షేత్రస్థాయిలో పలు వ్యవసాయ విధానంలో మార్పులు.!
పండ్లు, కూరగాయల సాగు
రాజేష్ కూరగాయలతో పాటు, పండ్ల మొక్కలు కూడా పెంచారు. పైకి ఎదిగే పండ్ల మొక్కల కింద నేలకు పాకే కూరగాయలు సాగు చేశారు. ఇలా రెండంచెల వ్యవసాయం చేయడంతో అటు బొప్పాయి. అరటి దిగుబడితో పాటు, అన్ని రకాల కూరగాయలు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఎవరూ చేయని ప్రయోగం చేశారు రాజేష్. సొర సాగుకు పెద్దగా రైతులు ఆసక్తి చూపరు. దీన్ని ఎంచుకున్నారు రాజేష్. రోజుకు రూ.300 సొరకాయలు అమ్ముతున్నాడు. దీని ద్వారా నెలకు రూ.1.50 ఆదాయం వస్తుందని గర్వంగా చెబుతున్నారు.
పొలం వద్దే విక్రయం
రాజేష్ కుమార్ పండించిన కూరగాయలుకొనుగోలు చేసేందుకు మార్కెట్కు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. పొలం వద్దకు వ్యాపారులు తండోప తండాలుగా వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. గోపాల్గంజ్,సివాన్, సీతతామర్హి, శివహర్ మార్కెట్ల నుంచి కూరగాయలు కొనడానికి వ్యాపారులు వస్తున్నట్టు రాజేష్ మీడియాకు తెలిపారు. సొరకాయ సాగు ద్వారా రాజేష్ ఖర్చులన్నీ పోయాక నెలకు రూ.1.20వేలు సంపాదిస్తున్నాడు. ఇలా అన్ని కూరగాయలు, పండ్లు అమ్మకం ద్వారా నెలకు లక్షల్లో సంపాదిస్తున్నట్టు ఆయన తెలిపారు.
Also Read: Modern Agricultural Equipments: వ్యవసాయ పనులకు కావలసిన ఆధునిక వ్యవసాయ పరికరాలు.!