వేసవిలో రసం పీల్చే పురుగుల ఉదృతి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తెల్లదోమ, పేనుబంక, పిండిపురుగు, నల్లి పొడి వాతావరణంలో ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. రసంపీల్చే పురుగుల వల్ల వైరస్ తెగులు వ్యాప్తి జరుగుతుంది. రసం పీల్చే పురుగుల నివారణ కోసం సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి.
- కిలో విత్తనానికి ముందుగా 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్ తో విత్తన శుద్ధి చేయాలి.
- పొలం చుట్టు జొన్న లేదా సజ్జ పంటను అడ్డు పంటగా వేయడం వల్ల రసం పీల్చే పురుగులు ఉధృతిని కొంతవరుకు తగ్గించవచ్చు.
- పొలంలో అక్కడక్కడ ఎకరాకు 4 చొప్పున పసుపు రంగు పూసిన రేకులు ఆముద/గ్రీజు పెట్టాలి. తెల్ల దోమలు దీనికి ఆకర్షిస్తాయి.
- మొక్క పెరుగుదల దశలో నాటిన 30 రోజుల నుంచి పూత వరుకు 5 శాతం వేప కషాయాన్ని 15 రోజుల తేడాతో పిచికారి చేయాలి.
- రసం పీల్చే పురుగుల నివారణ కొరకు డైమిథోయేట్ లేదా మెటాసిస్టాక్స్ లేదా ఫిప్రొనిల్ 2 మి.లీ. లేదా అసిఫేట్ 5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తీగజాతి కూరగాయల్లో పండు ఈగ బెడద నుంచి నివారణ కొరకు మలాథియాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Leave Your Comments