Cotton Crop: గత వారం నుండి కురుస్తున్న వర్షాలు సాగురంగానికి ఊపిరిపోసాయి. చాలా ప్రాంతాళలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇలాంటి చోట్ల వాగులు పొంగడం తో పంటలు నీట మునుగుతున్నాయి. ముఖ్యం గా తెలంగాణలో వర్షాధారంగా సాగు ఐయ్యే పత్తి పస్తుతం 30 నుండి 40 రోజుల దశలో ఉంది. పత్తి బెట్ట నైనా తట్టుకుంటుంది కానీ నీటి నిల్వ ను తట్టుకోలేదు. అందువల్ల చెళ్లలో నిలిచి పోయిన నీటిని వెంటనే బయటకు పంపే ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే మొక్కలలో పోషక లోపాలు తలెత్తడం, ఎదుగుదళ తగ్గడం, వడలిపోవడం, కలుపు పెరిగి చీడ పీడలు వ్యాప్తి చెందడం వంటి ప్రమాదలు పొంచి ఉన్నాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ముఖ్యంగా ఎక్కడైతే బాగా నీరు నిలిచి ఉన్నదో, అక్కడ వెంటనే కాలువల ద్వారా నీటిని బయటకు పంపించాలి.
ఎక్కడైతే మొక్కలు వదలి పోతున్న, కుళ్ళి పోతున్న ప్రాంతాలలో 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనే మందును లీటర్ నీటికి కలిపి, మొక్క వేరు వ్యవస్థ అంతా బాగా తడిచే లాగా పిచకారి చేసుకోవాలి.
అదే విధంగా పై పాటుగా 5-10 గ్రా. 19:19:19/13:00:45 ను లీటర్ నీటికి కలిపి పిచకారి చేసుకోవడం వలన మొక్కలు తొందరగా పునరుద్దరిచబడుతాయి.
ఈ వర్షాల వల్ల పోషకాలు కొట్టుకొని పోవడం వలన ఆకులు పండు పరినట్టు కనబట్టినట్లు, ఎర్ర పడినట్లు అయితే దీనికి గాను 5-10 గ్రా. యూరియాను లీటర్ నీటికి కలిపి పిచకారి చేసుకోవచ్చు.
Also Read: Poultry Farm Loans: కోళ్ల ఫారం ఏర్పాటుకు రూ.50 లక్షలు ఇస్తున్న కేంద్రం.!
ఒక వేళ ఆకుల ఈనెల మద్యలో పసుపు రంగులో మారినట్లు అయితే, అదే విదంగా మొక్క ఎదుగుదళ కుంటూ పట్టినట్లు అయితే జింకు ధాతు లోపంగా గుర్తించి, 2 గ్రా. జింక్ సల్ఫేట్ ను లీటర్ నీటికి కలుపుకొని 2-3 సార్లు పిచకారి చేసుకున్నట్లు అయితే ఈ పోషక లోపాలను సరి దిద్దుకునే అవకాశం ఉంది.
ఈ అధిక వర్షాల వలన కలుపు సమస్య అధికంగా ఐయ్యే అవకాశం ఉంది కాబట్టి, కేవలం గడ్డి జాతి కలుపు నివారణకు 2 మి. లీ క్విజలోపాప్ ఇతైల్ / 1.25 మి. లీ ప్రోపాక్విజాపాప్ ను లీటర్ నీటికి కలిపి పిచకారి చేసుకోవాలి.
కేవలం వేడల్పాకు కలుపు నివారణకు 1.25 మి. లీ బిస్పైరిబాక్ సోడియం అనే మందును లీటర్ నీటికి కలిపి పిచకారి చేసుకోవాలి.
గడ్డి జాతి కలుపు మరియు వేడల్పాకు కలుపు నివారణకు 2 మి.లీ. క్వెజిలో పాప్ ఇథైల్ / 1.25 మి.లీ. ప్రొపాక్విజాపాప్ + 1.25 మి.లీ. బిసైరిబాక్ సోడియం లీ. నీటికి కలిపి పిచకారి చేసుకోవాలి.
కలుపు మందులు పిచకారి చేసుకునే సమయంలో స్యండోవిట్/ ధనోవిట్ అనే సర్ఫేక్టంట్ ను కలిపి పిచకారి చేసుకోవడం వలన కలుపును సమర్థవంతంగా నిర్మూలించడం జరుగుతుంది.
వర్షాలు తగ్గినక, కొంచెం బెట్ట వాతావరణం ఏర్పడినపుడు 2-3 గుంటుక తో అంతర కృషి చేసుకోవాలి, దాని వలన వేరు వ్యవస్థకు మంచిగా గాలి సోకుతుంది , అంతర కృషి చేసినక ఎకరాకు 25-30కి. యూరియా, 10-15కి. పొటాష్ నిచ్చే ఎరువులు వేసుకోవడం వలన పంట పెరుగుదలకి అనువుగా ఉంటుంది
ఈ యాజమాన్య పద్దతులు చేపట్టడం వలన ఎటువంటి ఇబద్ధులు లేకుండా పత్తి పంటను కాపాడుకోవచ్చు.
Also Read: Bharathi Completed Phd in Chemistry: పీహెచ్ డి ముందు చిన్నబోయిన పేదరికం.!