Rambutan Fruit: ఒక ప్రత్యేకమైన పండు అందరినీ ఆకర్షించింది. అది కూడా ఒక తోపుడు బండిపైన ఆ పండును కొనడం కన్నా చూడటానికి ఎక్కువ మంది వస్తున్నారు. అదే రాంభూటన్ ఎరుపు, పసుపు మరియు ఆకుపచ్చ రంగులలో మృదువైన ముళ్ళతో కనిపించే పండు. ధాయ్ లాండ్ మలేషియాలో ఎక్కువగా ఈ పంటను సాగు చేస్తారు. ఈ మధ్యకాలంలో భారత్ కు ఈ పండు పంట విస్తరించింది. ఎక్కువగా తేమతో కూడిన వాతావరణంలోనే ఈపంటను సాగు చేస్తారు. అయితే ఈ పండు గురించి మన రాష్ట్రంలో చాలా మందికి తెలియదు. దీనిలో అద్భుతమైన ఔషధ గుణాలున్న ఈ పండుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు ఇచ్చి రాంభూటన్ సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నాయి. తెలంగాణలో కొంతమంది రైతులు ఈపంట వేసిన సరైన అవగాహన, ప్రోత్సాహం లేక ముందుకు సాగలేక పోతున్నారు.
ఆర్యోగ ప్రయోజనాలు ఉన్న పండు
రాంభూటన్ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది దోహదపడుతుంది. రాంభూటన్ పండు అనేది ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఈ పండులో పుష్కలంగా ఉన్నాయి. ఇది క్యాన్సర్, వాపు మరియు గుండె జబ్బులకు తగ్గించడానికి ఈ పండు ఉపయోగపడుతుంది. తినడానికి చాలా రుచిగా ఉంటాయి. రాంభూటన్ ఆహార జీవక్రియకు కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా మలబద్దకాన్ని కూడా నివారిస్తుంది. మరియు బరువు తగ్గడానికి ఈ పండు సహాయకారిగా పనిచేస్తాయి. ఇది చర్మ వ్యాధులను, రక్తహీనతను కూడా నివారిస్తుంది.
Also Read: Mountain Goats: పర్వత మేకలను ఎప్పుడైనా చూశారా.!
ఉద్యానశాఖ ప్రోత్సహించాలి..
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రాంభూటన్ పండును మన దేశంలో సాగు చేయక పోవడం విడ్డూరం. ధాయలాండ్ మలేషియా తో పాటు మన దేశంలో కూడా ఈ పండు పంట సాగుకు తగిన చర్యలు తీసుకోవాలి. మన ప్రభుత్వాలు కూడా వీటిపై దృష్టి పెట్టాలి. రాయితీలు, ప్రోత్సాహం తో పాటు అవగాహన కల్పిస్తే ఈ పంట వేయడానికి రైతులు ముందుకు వస్తారు. ఉద్యానశాఖ రామ్ భూటాన్ పై దృష్టి సారించాలి. ఒక వ్యాపారి కేరళ నుంచి రెండు టన్నులు తెచ్చి నగరంలో విక్రయిస్తున్నారు. ఎందుకంటే ఈపండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కాబట్టి.
Also Read: International Tiger Day 2023: నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం.. వీటి గురించి కొన్ని నిజాలు!