Pregnancy Tests in Cattle: రైతు సోదరులు వ్యవసాయంతో పాటు పాడి పశువులను పెంచి పోషించడం ఆనవాయితీ గా వస్తున్న అంశం. పాడి పశువుల ద్వారా వచ్చే ఉత్పత్తులలో పాల పదార్ధాలు అనేవి ముఖ్యమైనవి. రోజు రోజుకు పాలు, పాల పదార్థాలకు గిరాకీ పెరుగుతుంది.పశువులు ఏడాదికో ఈత సాలుకో దూడను ఈనినప్పుడే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న ఆడ పశువు ఈనిన తరువాత మళ్ళీ 30 రోజులలో ఎదకు వస్తోంది.పశువులు ఎదకు వచ్చినప్పుడు అధిక శాతం కృత్రిమ గర్బోత్పత్తి ద్వారా గర్భధారణ చేయిస్తారు. చూలు నిలిచిన తరువాత ఆవులు సుమారుగా 280 రోజులకు,గేదెలు 310రోజులకు ఈనుతాయి . పశువులకు గర్భధారణ చేయించిన తర్వాత 2-3 నెలలకు చూడి పరీక్ష చేయించి నిర్ధారణ చేసుకోవాలి . లేదంటే విలువైన కాలంతో పాటు పోషణ ఖర్చు పెరిగి నష్ట పోవాల్సి ఉంటుంది.కాబట్టి పశువులలో చూడి పరీక్ష చేయించి తదనుగుణంగా పోషణ చేపట్టాలి.
పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే , మేలైన యాజమాన్య పద్ధతులు, మెలకువలు పాటించాలి. అందులో భాగంగా చూడి పరీక్ష సకాలంలో చేసినట్లైతే రైతుకు ఖర్చులు తగ్గి ఈతలకు, ఈతలకు మధ్య ఎడమ తగ్గి దాని జీవిత కాలంలో ఎక్కువ దూడలను ఉత్పత్తి చేసి,ఎక్కువ పాల దిగబడి పొందే అవకాశం కలదు. కృత్రిమ గర్భధారణ చేసిన లేదా సహజ సంపర్కం చేసిన తరువాత 2-3 నెలలలో లోపు పశువులలో చూడు పరీక్షలు చేయించి చూడు నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటె రైతులు ఒకసారి చూడు కట్టించిన తరువాత అంటే కృత్రిమ గర్భధారణ ద్వారా గాని, సహజ సంపర్కం ద్వారా గాని, రైతులు ఇక ఈ గేదె చూడిదే అని చూడి పరీక్ష చేయించకుండానే నిర్ణయించుకుంటారు.
ఒక 5 నెలలకో, 7నెలలకో చూస్తే చూడిదిలే మన గేదె అనే అపోహలో ఉంటారు. తీరా 10 నెలలకు రైతుకు అనుమానం వస్తది. ఈ గేదె చూడిదా? కాదా అని, అప్పుడు చూడి పరీక్ష చేయిస్తే అది ఒట్టి పోయి వుంటుంది. ఒక ఎదకు ఇంకో ఎదకు 21 రోజులు గాప్ ఉంటుంది. 21 రోజుల వ్యవధిలోనే రైతుకు పాల ద్వారా గాని ,మేత ఖర్చులు గాని, కూలీ ఖర్చులు గాని కలిపి దగ్గర దగ్గరగా 1500- 2000 రూపాయలు ఒక నెలకు రైతు నష్టపోతున్నాడు. ఈ విధంగా 10 నెలలు అంటే 15000-20000 వరకు రైతు నష్టపోతున్నాడు. ఈ విధంగా రైతు నష్టపోతున్నాడు కాబట్టీ సకాలంలో చూడు పరీక్షలు చేయించుకోవాలి.
Also Read: Role of Fertilizers in Agriculture: నేల జీవం పెంచే జీవన ఎరువుల వాడకం – వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత
• ఇందులో మొదటిది కృత్రిమ గర్భధారణ చేసిన తరువాత 45 -90 లోపు అనుభవజ్ఞులైన పశు వైద్యుని దగ్గర చూడి పరీక్షలు చేయించాలి. పశు వైద్యులు గేదె ఆకారం, సైజ్ ను బట్టి ఎన్ని నెలలో చెప్పగలరు . చూడి కట్టిన 3 నెలల లోపు ఒకసారి నట్టల నివారణ అలాగే 6 నెలల లోపు మరోసారి నట్టల నివారణ చేసినట్లైతే గర్భంలో ఉన్న పిండం బాగా ఎదిగే అవకాశం కలదు.ఆవు అయితే 7 వ నెల చూడి కాలంలో , గేదె అయితే 8 వ నెల చూడి కాలం పూర్తీ అయిన తరువాత పాలు పితకడం ఆపివేయాలి.
• రెండవది రైతులకు కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. అదేమిటంటే పశువు పరిమాణం పెరిగింది, నున్నగా వుంది పశువు అనుకోవడం, వెంట్రుకలు రాలిపోతున్నాయి,పొట్ట పెరుగుతుంది కాబట్టి ఈ గేదె చూడిదే అనే అపోహతో కొందరు రైతులు నష్టోతున్నారు. కాబట్టీ ఈ అపోహలను పక్కన పెట్టి చూడి నిర్ధారణ తప్పని సరిగా చేయించాలి.
• మూడోవది ఇప్పుడు అల్ట్రా సౌండ్, x- ray లు పెద్ద పశువులలో అంత ఉపయోగం కాదు.ఇంకో పద్దతి ఏమిటంటే పాలల్లో పోజిస్త్రొన్ ఎస్టిమేషన్ , కేరళ రాష్టరంలోని ఎక్కువ మంది రైతులు ఈ పద్ధతిని పాటిస్తున్నారు.20-24 రోజుల లోపు ఈ పాడి పశువుల పాలల్లో పోజిస్ట్రొన్ ఎస్టిమేట్ చేయడం ద్వారా చూడి నిర్థారణ ఒక 80% వరకు నమ్మకంగా తెలుసుకోవచ్చు. చూడిది కాదు అనేది మాత్రం 97% వరకు తెలుసుకోవచ్చు. పశు వైద్య శాఖ, పశు గణాభివృద్ధి సంస్థలు ఎన్నో కార్య్రమాలు, క్యాంప్ లు పెట్టీ ఉచితంగా శిబిరాలు పెట్టీ ఈ చూడి పరీక్షలు నిర్వహించి రైతులకు ఎన్నో సలహాలు, సందేహాలు తీరుస్తున్నారు. అలాంటి సమయాల్లోనే పశువులకు చూడి పరీక్ష చేయించాలి.
• పశు వైద్యులు అందుబాటులో లేని సమయంలో కర్ణాటక రాష్ట్రం లో ఎక్కువగా ఈ పద్ధతిని ఆచరిస్తున్నారు. అదే కుండి పరీక్ష. ఇందులో మనం ఎదైతే పశువు చూడి నిర్ధారణ చేసుకోవాలో కృత్రిమ గర్భధారణ చేసిన తరువాత 19-24 రోజుల లోపు పశువు మూత్రం తీసుకొని దానికి 4 రేట్లు నీళ్ళు కలిపి మొలకెత్తే సామర్ధ్యం గల విత్తనాలు పెసలు,ఉలవలు,శెనగలు ఇలాంటివి ఒక మట్టి పాత్రలో తీసుకొని , నీళ్ళు కలిపిన మూత్రాన్ని ఆ మట్టి పాత్రలో పొయాలి.ఒక 4-5 రోజుల తర్వాత ఆ విత్తనాలు మొలకేత్తకుండ , నల్లగా మారితే ఆ పశువు చూడి పశువు అని నిర్ధారించ్చుకోవచ్చు. ఇందులో 80-90. % వరకు ఆ పశువు చూడిది అని నిర్ధారించ్చుకోవచ్చు.
• హార్మోన్లు, బ్లడ్,మూత్రం పరీక్ష చేయడం ద్వారా కూడా చూడి నిర్ధారణ తెలుసుకోవచ్చు. కాని ఇది ఖర్చు తో కూడుకున్న పని. కాబట్టి అన్నిటికంటేఅన్నిటికంటే ఖర్చు లేనిది, శ్రేష్ఠమైనది, ఖచ్చితమైనది పశు వైద్యుని ద్వారా చూడి నిర్థారణ పరీక్షలు చేయించుకోవడం.
చూలు నిర్ధారణలో ఒక్కోసారి చూలు నిర్ధారణ చేసి డాక్టర్ గారు చెప్పిన తరువాత పొరపాటున అభార్షన్ అయ్యే అవకాశం కలదు కొంతకాలం తరువాత డాక్టర్ గారు చూడిది అని చెప్పారు కదా అనే అపోహలో ఉంటారు. గర్భాశయం సైజ్ సరిగ్గా లేనప్పుడు మరోసారి చూడి నిర్ధారణ పరీక్ష చేయించాలి. ఈ విధంగా సకాలంలో చూడి నిర్ధారణ చేయిచాలి. చూడిది అంటే ఆ పశువుకు వాల్యు పెరుగుతుంది. ఆ పశువు వాల్యు రెట్టింపు అవుతుంది.
ఈ విధంగా రైతు ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలంటే సకాలంలో చూడి నిర్ధారణ పరీక్ష చేయించాలి.
Also Read: Dates Health Secrets: ఒంటికి రక్తాన్ని ఇచ్చే ఐరన్ పండు – ఖర్జూరం ఆరోగ్య రహస్యాలు