Bottle Gourd Cultivation Income: రైతులు ఈ మధ్య కాలంలో సాంప్రదాయ వ్యవసాయ పంటలని వదిలి ఆధునిక పద్ధతులని వాడుకుంటూ వ్యవసాయం చేస్తున్నారు. వరి, గోధుమ పంటలే కాకుండా వాణిజ్య పంటలు కూడా పండిస్తూ మంచి లాభాలు సంపాదిస్తున్నారు. పంటలో అనేక మార్పులతో సాగు చేస్తున్నారు. ఆధునిక వ్యవసాయ పద్దతిలో కూరగాయాలని సాగు చేస్తూ మంచి లాభాలు తీసుకుంటూ, రైతుల ఆర్థిక పరిస్థితి ముందు కంటే ఇప్పుడు మంచి స్థాయిలో ఉంటున్నారు.
బీహార్లోని రైతులు వారు చేసిన వ్యవసాయానికి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతున్నారు. ఎక్కడి రైతులు మామిడి, లిచ్చి పండ్లతో పాటు కూరగాయాలని పండిస్తూ పక్కన రాష్ట్రాలకి ఎగుమతి చేస్తున్నారు. ఈ రాష్ట్ర రైతులు కూరగాయాలని సాగు చేస్తూ ఇతర రాష్ట్ర రైతులకి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Also Read: Prime Minister’s Employment Generation Programme: PMEGP పథకానికి అర్హులు ఎవరు..?

Bottle Gourd Cultivation Income
ఎక్కడ రైతులు కూరగాయాలని సాగు చేస్తూ నెలకి 2 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నారు. ఒక ఎకరంలో సొర కాయలు సాగు చేస్తూ మంచి లాభాలని పొందుతున్నారు. సొరకాయ పంటతో పాటు అంతర పంటలతో కూడా మంచి లాభాలు పొందుతున్నారు.
ఎక్కడి రైతులకి ఒక వారంలో ఒక ఎకరంలో 1500-1600 సొరకాయలు దిగుబడి వస్తున్నాయి. ఒక కాయ 40 రూపాయలు అమ్ముతున్నారు. వేళ్ళు కేవలం పశువుల వ్యర్థాలని ఎరువులుగా వాడుతున్నారు. దాని వల్ల మంచి దిగుబడి వస్తుంది ఈ రాష్ట్ర రైతులకి. ఒక నెలలో దాదాపు 6400 సొరకాయలు దిగుబడి వచ్చి, 2 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నారు.
Also Read: French Beans Farming: అధిక లాభాలు తెచ్చిపెడుతున్న ఫ్రెంచ్ బీన్ సాగు విధానం..