Trellis Method: ప్రపంచం మొత్తంలో కూరగాయల సాగు ఎక్కువ మన భారత దేశంలో చేస్తారు. వర్షాలు లేక లేదా అధిక వర్షాల కారణంగా కూరగాయల దిగుబడి తగ్గిపోతుంది. కూరగాయల దిగుబడి పెంచాలి అని రైతులు తీగ పంటలతో పాటు అంతర పంటలు వేస్తున్నారు. దాని ద్వారా ఒక పంటతో వచ్చిన నష్టాన్ని ఇంకో పంటలో లాభాలు పొందుతున్నారు. ఈ తీగ పంటలో ఎక్కువగా కాకరకాయని సాగు చేస్తున్నారు.
ఈ కాకరకాయలో కొత్త జాతి కాకరకాయలతో పాటు వేరే కూరగాయలు రైతులకి సాగుకు సులువుగా ఉండేలా సాగు చేస్తున్నారు. ఈ పందిరి కూరగాయాలని ఒక స్థలం నుంచి ఇంకో స్థలం తీసుకొని వెళ్ళడానికి వీలుగా ఉండే పంటలని సాగు చేస్తున్నారు. ఈ రకమైన సాగునీ ట్రెల్లిస్ విధానం అని అంటారు.
ఈ ట్రెల్లిస్ విధానంగా కాకరకాయని సాగు చెయ్యడం ద్వారా చీడపీడల, బూడిద తెగులు సమస్య తగ్గింది. కాకపోతే గాలిలో తేమ, మంచు ఎక్కువగా ఉన్నపుడు బూడిద తెగులు పంటకి వస్తుంది. ఈ తీగ జాతి కూరగాయలు ట్రెల్లిస్ విధానంగా సాగు చేయడం ద్వారా రైతులకి సాగు పద్దతి సులువుగా మారింది.
Also Read: Sesame Harvester Machine: నువ్వుల పంట కోతలకు కొత్త యంత్రం..
ఈ విధానంలో పందిరిని ఒకచోట నుంచి మరో చోటికి తీసుకొని వెళ్లడం వీలుగా ఉంటడం వాళ్ళ ఎక్కువ వర్షాలు లేదా గాలులు ఉన్నపుడు పంట దెబ్బ తిన్నకుండా కాపాడుకోవచ్చు. పందిరి పంటతో పాటు వరుసలుగా అంతర పంటలు సాగు చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ రెండు విధాలా సాగుతో రైతులు మంచి లాభాలు పొందవచ్చు.
కాకరకాయలో ఔషధ విలువల ఎక్కువగా ఉంటాయి. వీటిని చెక్కర వ్యాధి ఉన్న వారు తింటే, ఆ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. కాకరకాయకి దేశం మొత్తం మంచి డిమాండ్ ఉంటుంది. వీటితో ఊరగాయలు కూడా తయారు చేసి విదేశాలకి ఎగుమతి చేస్తున్నారు. ఈ విధానంలో చీడపీడల సమస్య తగ్గడం ద్వారా రైతులకి ఖర్చు కూడా భారీగా తగ్గుతుంది, రైతులు మంచి దిగుబడి పొంది, బారి లాభాలు పొందవచ్చు.
Also Read: Water Bubble Gate Valve: ఈ పరికరం ద్వారా ఎరువులు సులువుగా వేసుకోవచ్చు…