Cauliflower Cultivation: మీరు ఎప్పుడైనా తెల్ల కాలీఫ్లవర్ కాకుండా రంగు రంగుల కాలీఫ్లవర్ చూసారా…? ఇప్పటి వరకి మనం చూసిన కాలీఫ్లవర్ పువ్వులు తెల్లగానే ఉన్నాయి. ఈ కాలీఫ్లవర్ని పచ్చిగాను, ఉడకబెట్టుకుని, ఊరుగాయగా తింటారు. ఇప్పుడు కాలీప్లవర్ తెల్లగానే కాదు రంగు రంగులుగా దొరుకుతున్నాయి. గులాబీ, ఆకుపచ్చ, పసుపు, నారింజ రంగులో కాలీఫ్లవర్ ఉంటున్నాయి. ఈ రంగుల కాలీఫ్లవర్ మార్కెట్లో కూడా లభిస్తాయి. ఈ రంగుల కాలీఫ్లవర్ ధర తెల్ల కాలీఫ్లవర్ ధర కంటే ఎక్కువ.
ఈ రంగురంగుల కాలీఫ్లవర్ మన దేశంలో బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ప్రాంతాల్లో సాగు చేసి రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. ఈ రంగురంగుల కాలీఫ్లవర్లో విటమిన్లు, పోషకాలు తెల్ల కాలీఫ్లవర్ కంటే 25 శాతం ఎక్కువగా ఉంటాయి. ఈ కాలీఫ్లవర్లో పిండి పదార్ధాలు తక్కువ ఉంటడం ద్వారా బంగాళా దుంప తినని వాళ్ళు కాలీఫ్లవర్ తిన్నవచ్చు. పెద్ద నగరాల్లో ఈ రంగురంగుల కాలీఫ్లవర్కు మంచి డిమాండ్ ఉంది. ఈ కాలీఫ్లవర్ని స్టార్ హోటల్స్, రెస్టారెంట్లలో వెజిటబుల్ సూప్ తయారీలో ఎక్కువగా వాడుతారు. ముంబై, ఢిల్లీ, కలకత్తా, పాట్నా, లక్నో, చెన్నై నగరాల్లో ఈ కాలీఫ్లవర్కు చాలా మంది కస్టమర్లు ఉండటంతో రైతులు కాంట్రాక్టు పద్దతిలో ఈ కాలీఫ్లవర్ సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయి.
Also Read: Seed Conservation: అంతరించిపోయే పంట విత్తనాలు దాచుకోవడం ఎలా.!
ఈ రంగురంగుల కాలీఫ్లవర్ సాగుకు 20-25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటూ, పంట పొలం నేల pH 6.5 వరకు ఉంటే పంట మంచి సాగు వస్తుంది. ఈ కాలీఫ్లవర్ సాగుకు లోవామ్ నేలలో సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది. వర్మీకంపోస్టు, ఆవు పేడను ఎరువులుగా వాడితే భూసారంతో పాటు దిగుబడి కూడా పెరుగుతుంది.
ఈ కాలీఫ్లవర్ సాగుకు ఒక నర్సరీని సిద్ధం చేసుకుంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఈ పంట సాగు మొదలు పెట్టవచ్చు. ఈ కాలీఫ్లవర్ పంటకి నీళ్లు కొంచం ఎక్కువ అవసరం అవుతుంది. పంట పొలం ఎప్పుడూ తేమగా ఉండాలి. పంట వేసిన 100 రోజులో కాలీఫ్లవర్ పంట కోతకి వస్తుంది. ఒక ఎకరా పొలంలో సాగు చేస్తే 150 క్వింటాళ్ల వరకి దిగుబడి వస్తుంది. ఈ కాలీఫ్లవర్ అమ్ముకోవడం వల్ల పెట్టుబడి పోను 4 లక్షల వరకి లాభాలు వస్తాయి. రైతులు హోటల్స్, రెస్టారెంట్ వాళ్లతో కాంట్రాక్టు పద్దతిలో ఈ కాలీఫ్లవర్ సాగు చేస్తే ఇంకా మంచి లాభాలు వస్తాయి.
Also Read: Livestock Management: వర్షాకాలంలో పాడి పశువుల ఆరోగ్య పరిరక్షణలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!