Safflower Cultivation: పెద్ద పెద్ద చదువులు చదివి, మంచి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు అందరూ ఈ మధ్య కాలంలో వ్వవసాయం చేస్తున్నారు. ఉద్యోగాలు చేస్తూ వ్వవసాయం చేస్తున్నారు కొందరు, ఉద్యోగాలు చేస్తూ వీక్ ఎండ్ ఫార్మింగ్ అన్ని వేరే వల్ల పొలంలో లేదా వారి సొంత పొలంలో పని చేస్తున్నారు. మరి కొందరు వ్వవసాయం ఫై ఇష్టంతో ఉద్యోగాలు వదిలేసి సొంత ఊరిలో వ్వవసాయం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళలాగానే కరీంనగ్ జిల్లా జంగపల్లి గ్రామంలో ఉండే కర్ర శ్రీకాంత్ రెడ్డి, అనూష దంపతులు ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేస్తున్న వ్వవసాయం అంటే ఇష్టంతో ఉద్యోగాలకి రాజీనామా చేసి ఉన్న 5 ఎకరాలో ఆధునిక పద్ధతిలో పూల తోటని సాగు చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నపుడు కరోనా కాలంలో వర్క్ ఫ్రం హోం చేస్తున్నపుడు, వారి పొలంలో వ్యవసాయం చేయాలి అన్ని అనుకున్నారు.
ఇంటర్నెట్ సహాయంతో ఆధునిక పద్ధతులని వాడుతూ పంటలు సాగు చేస్తున్నారు. ఉన్న 5 ఎకరాలలో గులాబీ తోట, చామంతి తోట, లిల్లీ తోట, బంతి తోట, కుసుమ పంటను సాగు చేస్తున్నారు. కర్ర శ్రీకాంత్ రెడ్డి, అనూష వాళ్ళ పొలంలో పని చేస్తూ వేరే కూలీలకు పని కల్పిస్తున్నారు. పూల తోటలతో రోజు 3000-5000 వరకి లాభాలు వస్తున్నాయి. వ్వవసాయం మొదలు పెట్టిన కొత్తలోనే మంచి లాభాలు వచ్చి ఆదర్శ రైతులుగా కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఉత్తమ రైతు దంపతులుగా అవార్డు తీసుకున్నారు.
Also Read: Papaya Farming: బొప్పాయి పంట సాగు.. రైతులకి మంచి లాభాలు.!
మల్చింగ్, డ్రిప్ పద్దతిలో గులాబీ ,చామంతి, బంతి సాగు చేయడం వల్ల నీటిని వృధా జరగదు. మల్చింగ్ వాడటం వల్ల నీళ్లు ఆవిరవ్వటం, ఎక్కువ సూర్య కాంతికి మొక్కకి హాని చేయకుండా ఉంటుంది. విద్యుత్ బల్బులు ఏర్పాటు చేయడం వల్ల చలి కాలంలో చామంతి తోటను చలి తగ్గిస్తుంది. శాస్త్రవేత్తలు, హార్టికల్చర్ అధికారుల సలహాలు తీసుకుంటూ మంచి లాభాలను అందుకుంటున్నాము.
జిల్లాలోనే ప్రయోగాత్మకంగా కుసుమ పంటను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సాగు చేస్తున్నారు. కుసుమ పంటతో మంచి లాభాలు వస్తున్నాయి. పంట సాగుకి చాలా తక్కువ పెట్టుబడి, చీడపీడల పశువులు, పందులు, కోతుల బెడద ఉండదు. ఒక ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఒక క్వింటాలు కుసుమలు 5000-6000 వేలు వరకి మార్కెట్లో ధర ఉంది.
కుసుమ పూవుతో కుసుమ నూనె తయారు చేసుకోవచ్చు. నూనె తయారు చేసిన తర్వాత పిప్పిని పశువుల దాణాగా వాడుకోవచ్చు. కుసుమ నూనె ఆరోగ్యానికి చాలా మంచిది. పూల తోటతో పాటు తేనెటీగల పెంపకం చేస్తే తేనె ద్వారా అదనపు లాభాలు వస్తాయి. తేనెటీగల ద్వారా పూలు పండ్ల తోటల్లో పరపరాగ సంపర్కం జరిగి పండ్ల తోటల్లో ఎక్కువ దిగుబడి వస్తుంది.
Also Read: Elephant Foot Yam: ఈ పంటను అరటి తోటలో అంతర పంటగా సాగు చేస్తే లాభాలు గ్యారెంటీ.!