Black Rice: పాత కాలంలో ఇంటిలో అందరూ తిన్నాడనికి వ్యవసాయం చేసే వాళ్ళు. ఏ ఉద్యోగం లేని వాళ్ళు, బతకడానికి ఆ ఆధారం లేని వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళు. రైతులు పండించిన పంట వారి ఇంటిలో వాళ్ళ కడుపు నిండితే చాలు అనుకునే వారు. కాలం మారి ఉద్యోగం ఉన్న వాళ్ళు కూడా వ్యవసాయం మొదలు పెట్టారు. సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటలు వేయడం మొదలు పెట్టారు. మీరు ఉద్యోగం చేస్తూ వ్యవసాయం చేసుకునే ఒక మంచి ఐడియా. ప్రజల్లో బీపీ, షుగర్ రోగాలు ఎక్కువ అవడంతో చాల మంది అన్నం తిన్నడం మానివేశారు. ఇప్పుడు చైనా నుంచి వచ్చిన కొత్త వరి రకం బీపీ, షుగర్ రోగాలు ఉన్న వారికే కాకుండా అందరి ఆరోగ్యం పెంపొందిస్తుంది అదే బ్లాక్ రైస్. ఈ బ్లాక్ రైస్ మంచి లక్షణాల వల్ల మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది.
ఈ నల్ల బియ్యంలో పోషకాలు మాములు బియ్యంతో కంటే ఎక్కువగా ఉండటం వల్ల మార్కెట్లో రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుంది. ఈ నల్ల బియ్యం షుగర్, బీపీ రోగాల ఫై మంచిగా పని చేయడం వల్ల ఈ షుగర్, బీపీ రోగాలు అదుపులో ఉంటున్నాయి. దీని కారణంగా చాల మంది నల్ల బియ్యం తింటున్నారు.
ఈ బియ్యంలో ఆరోగ్య ప్రయోజనాలు ద్వారా బియ్యం ఖరీదు ఎక్కువ ఉన్నా అందరూ కొంటున్నారు. డిమాండ్ పెరగడంతో ఎక్కువ మంది రైతులు ఈ బియ్యాన్ని పండించడానికి ఇష్టపడుతున్నారు. మన దేశంలో ఎక్కువగా ఈ బియ్యాన్ని సిక్కిం, మణిపూర్ , అసోం, మధ్యప్రదేశ్ , మహారాష్ట్రలో పండిస్తున్నారు. ఈ బ్లాక్ రైస్ బియ్యంగా ఉన్నపుడు నల్లగా ఉండి, అన్నం వండిన తర్వాత నీలం రంగుగా మారుతుంది. ఈ బ్లాక్ రైస్ ని ఉత్తర భారత్లో నీలా భాట్ అంటారు.
Also Read: Garlic Cultivation: మార్కెట్లో కొత్త వెల్లుల్లి రకం.. ఒక పంటకాలంలో 10 లక్షల లాభాలు.!
ఈ బ్లాక్ రైస్ పంట కాలం 4 నెలలు. 100-120 రోజులో పండుతుంది. తెల బియ్యం వరి మొక్క కంటే నల్ల బియ్యం వరి మొక్క పొడవుగా పరుగుతుంది. తెల బియ్యం కంటే నల్ల బియాంతో 5 శాతం ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ నల్ల బియ్యం మార్కెట్లో కిలో 250-500 ఉంది. సేంద్రీయ పద్దతిలో పండించిన నల్ల బియ్యానికి మార్కెట్లో ఇంకా రేట్ ఎక్కువ ఉంది.
నల్ల బియ్యం తినడం వల్ల గుండె పోటు, కాన్సర్ రోగాలకి ముప్పుతగ్గుతుంది. నల్ల బియ్యంలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ ఎక్కువ ఉంటుంది. 10 గ్రాముల నల్ల బియ్యంలో 9 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. షుగర్, బీపీ రోగులకు మేలు చేయడంతో మార్కెట్లో డిమాండ్ మంచి ఉంది.
Also Read: Aeroponics Saffron Farming: మట్టి లేకుండా కుంకుమ పువ్వు సాగు చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్