పశుపోషణ

Chicken Price: కొండెక్కిన కోడి! తాళలేక చనిపోతున్న కోళ్లు.. తగ్గిన కోళ్ల పెంపకం

1
Chicken Price
Chicken Price

Chicken Price: కోడి ధర కొండెక్కింది. ఎండలు ముదరడంతో చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయి. 15రోజులుగా చికెన్‌ ధర రోజూ పెరుగుతూనే ఉంది. పెరుగుతున్న రేట్లతో చికెన్‌ కొనలేక.. తినకుండా ఉండలేక మాంసాహార ప్రియులు సతమతం అవుతున్నారు. గత నెల చివరి వారంలో కిలో 203 రూపాయలున్న చికెన్‌ ధర ఈ నెలా చివరి వారానికి రూ.261కి చేరింది. అంటే 28 రోజుల్లో కిలోపై 58 రూపాయలు పెరిగింది. ఎంత తీవ్రత ఇలాగే ఉంటే.. మరింతగా పెరిగే అవకాశాలున్నాయని పౌల్ర్టీరంగ నిపుణులు చెబుతున్నారు. మండుతున్న ఎండలకు కోడి పిల్లలు చనిపోతాయని పౌల్ర్టీషెడ్ల నిర్వాహకులు బ్యాచ్‌లను తగ్గించారు. దీంతో ఉత్పత్తి తగ్గి చికెన్‌ ధర నిత్యం పెరుగుతూనే ఉంది.

తీవ్ర ఎండలు, వడ గాలులకు పౌల్ర్టీల్లో కోల్లు చనిపోతున్నాయి. ఎండల్లో షెడ్ల నిర్వాహకులు కోళ్లను పెంచడం ఆపేశారు. ఇదే సమయంలో చికెన్‌కు డిమాండ్‌ పెరగడంతో ధరలూ పెరిగాయి. ఎండలకు కోడి మాంసం కోనుగోళ్లు తగ్గి ధరలూ పడిపోతాయని భావిస్తే అందుకు భిన్నంగా పరిస్థితి నెలకొంది. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో చికెన్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. అదివారం చికెన్‌ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. అయితే పెరిగిన చికెన్‌ ధరలతో మాంసం ప్రియులు దిగులు చెందుతున్నారు.

Also Read: Fake Seeds: రైతును ముంచేందుకు నకిలీ సీడ్స్‌ సిద్ధం.. నకిలీ రాయుళ్లపై సర్కార్‌ ఉక్కు పాదం.. ఎనిమిది మంది అరెస్ట్

Chicken Price

Chicken Price

ఊహించని విధంగా పెరుగుతున్న రేటు

గతేడాది కంటే చికెన్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. అప్పట్లో కిలో కోడి మాంసం ధర రూ.150 నుంచి 180 వరకు ఉండేది. ఈ ఏడాది రేటు రూ.261 వరకు చేరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా చికెన్‌ ధరలు పెరిగాయని వ్యాపారులు సైతం చెబుతున్నారు. సాధారణంగా కోళ్లు 40డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే తట్టుకోలేవు. షెడ్లను స్ర్పింకర్లతో నీరుపెట్టి చల్లబర్చడం, కూలర్లు వంటివి పెట్టకుంటే వేడికి చనిపోతాయి. ప్రస్తుతం 40 డ్రిగీల నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదువుతోంది. పెద్ద పెద్ద పౌల్ర్టీషెడ్ల యజమానులు కూలర్లు పెట్టో, మరో రకంగానో కోల్లను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు.

Also Read: PJTSAU: అటవి జీవ వైవిధ్య సంస్థతో PJTSAU ఒప్పందం

Leave Your Comments

Fake Seeds: రైతును ముంచేందుకు నకిలీ సీడ్స్‌ సిద్ధం.. నకిలీ రాయుళ్లపై సర్కార్‌ ఉక్కు పాదం.. ఎనిమిది మంది అరెస్ట్

Previous article

Minister Niranjan Reddy: విజయ బ్రాండ్ ఉత్పత్తులను అందరూ ఆదరించాలి – మంత్రి నిరంజన్ రెడ్డి

Next article

You may also like