ఆరోగ్యం / జీవన విధానం

Taro Root Health Benefits: చామదుంపలతో ఇక మీ చింతలన్నీ దూరం.!

2
Taro Root
Taro Root

Taro Root Health Benefits: మనం తీసుకునే ఆహారాలలో కూరగాయలు, ఆకుకూరలతో పాటు దుంపలు కూడా ఉంటాయి. ఈ దుంపలలో ఎక్కువగా చామదుంప, చిలగడ దుంప వంటివాటిని ఎక్కువగా చూస్తాం. ఇందులో చామదుంపల యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా దుంపలు అంటే భూమి లోపల పెరుగుతాయి, ఈ చామదుంపలను తవ్వి తీసుకొని మంచి పులుసుగా వండుకొని తింటే ఆ టేస్టే వేరు. అయితే రుచి పరంగానే కాకుండా ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా అందిస్తాయి. పురాతన కాలం నుండి సాగు చేస్తున్న మొక్కల్లో చామదుంప కూడా ఒకటి. చామదుంపలు ఫైబర్ మరియు ఇతర పోషకాలకు గొప్ప మూలం మరియు మెరుగైన బ్లడ్ షుగర్ మేనేజ్‌మెంట్, జీర్ణక్రియ మరియు గుండె ఆరోగ్యంతో సహా అనేక రకాల సంభావ్య ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో ముందుంటుంది.

ఒక కప్పు (132 గ్రాములు) వండిన చామదుంపలలో 187 కేలరీలు, ఎక్కువగా పిండి పదార్థాలు అలాగే ఒక గ్రాము కంటే తక్కువ ప్రోటీన్ మరియు కొవ్వు లభిస్తాయి. వీటితో పాటు ఫైబర్: 6.7 గ్రాములు, మాంగనీస్: రోజువారీ విలువలో 30%, విటమిన్ B6: 22%, విటమిన్ E: 19%, పొటాషియం: 18%, రాగి: 13%, విటమిన్ సి: 11%, భాస్వరం: 10%, మెగ్నీషియం: 10% లభిస్తాయి. చామదుంపలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల అథ్లెట్లకు మేలు జరుగుతుంది, కావున దీర్ఘకాలిక శక్తి కోసం అథ్లెట్లు ప్రధానంగా దీనిని వినియోగిస్తారు.

Also Read: Yellow Watermelon Benefits: పసుపు పుచ్చకాయలతో పుష్కలమైన లాభాలు.!

Taro Root Health Benefits

Taro Root Health Benefits

వీటిలో తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆహరం అని చెప్పవచ్చు. ఇందులో లభించే ఫైబర్ జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి తోడ్పడుతుంది. చామదుంపలలో లభించే పోషకాలు అధిక రక్తపోటు రాకుండా నివారించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కిడ్నీ సంబంధిత సమస్యలను నివారించడంలో కూడా ఇవి సహాయపడతాయి.

చామదుంపలలో లభించే విటమిన్ సి మరియు ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో అద్భుతంగా సహాయపడతాయి. ఈ దుంపలలో లభించే యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలు త్వరగా వృద్ధాప్యం రాకుండా నివారిస్తాయి. చామదుంపలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొన్ని రకాల కాన్సర్ కణాలను నివారించడంలో తోడ్పడుతాయని పరిశోధనలు వెల్లడించాయి. వీటిలో ఉండే మెగ్నీషియం మరియు విటమిన్ ఇ రెండూ, మీ ఎముకలు అలాగే దంతాల నిర్మాణ సమగ్రతను కాపాడుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. చామదుంపలు బీటా-కెరోటిన్ మరియు క్రిప్టోక్సాంటిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి మీ కంటి చూపును మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడతాయి. వీటితోపాటు చామదుంపలు మెరుగైన రక్తసరఫరాకు మరియు జుట్టుపెరుగుదలకు కూడా తోడ్పడతాయి.

Also Read: Peepal Tree Health Benefits: ఒక్క రావి చెట్టుతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు!

Leave Your Comments

Minister Niranjan Reddy: పత్తి, కంది సాగును మరింత ప్రోత్సహించాలి – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Previous article

Ponnaganti leaves Health Benefits: పొన్నగంటి కూరతో పుష్కలమైన లాభాలు మీ సొంతం!

Next article

You may also like