ఆరోగ్యం / జీవన విధానం

Silver Date Palm: వేసవి కాలంలో ఈత పళ్ళను అస్సలు మిస్ కాకూడదు! ఎందుకో తెలుసా?

2
unknown facts about silver date palm
unknown facts about silver date palm

Silver Date Palm: ప్రస్తుత కాలంలో కనుమరుగవుతున్న పండ్లు ఎన్నో ఉన్నాయి. దీనికి కారణం ఆ పండ్ల యొక్క ఉనికి తగ్గిపోవడం లేదా ఆ పండ్ల యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన లేకపోవడమూ కావచ్చు. అందులో ఒకటే ఈ ఈత పళ్ళు. ఈత పళ్ళు వేసవి కాలంలో లభిస్తాయి, ఇవి గెలల్లాగా పెరుగుతాయి. ఈ ఈత చెట్టు నుండి వచ్చే కల్లు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. రుచి పరంగా ఈత పళ్ళు తియ్యగా ఉంటాయి, అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా అందరు వీటిని తినడానికి ఇష్టపడతారు. ఈత పళ్ళను వైన్ తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఈత పళ్లలో లభ్యమయ్యే అనేక రకాల పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జ్వరాన్ని తగ్గించడంలో, శ్వాస సమస్యలను నివారించడం వంటి అనేక రకాల సమస్యలను తగ్గిచడంలో తోడ్పడతాయి.

Silver Date Palm

Silver Date Palm

Also Read: Minister Niranjan Reddy: తెలంగాణ మొక్కజొన్న రైతులకు శుభవార్త.!

100 గ్రాముల ఈత పండ్లలో పిండిపదార్థాలు 65 గ్రాములు, చక్కెరలు 53 గ్రాములు, పీచుపదార్థాలు 6 గ్రాములు, కొవ్వు పదార్థాలు 0.4 గ్రాములు, మాంసకృత్తులు 2.5 గ్రాములు, నీరు 21 గ్రాములు, విటమిన్ సి 0.4 మిల్లీగ్రాములు లభిస్తాయి. వీటితో పాటు ఈ పళ్లలో ప్రోటీన్స్‌, విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ఎంజైమ్స్, ఫైబ‌ర్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి ఎన్నో లభిస్తాయి. వీటి పుప్పొడిలో ఉండే రసాయనాలు హార్మోన్స్ వలె పని చేస్తాయి. రక్త హీనత సమస్యతో బాధ పడుతున్న వారికీ ఈత పళ్ళు చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఈత పళ్లలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది కనుక ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో తోడ్పడి రక్త హీనతను తగ్గిస్తుంది. కావున రక్త హీనతతో బాధపడే వారికి ఈత పళ్ళు మంచి ఆహారంగా పని చేస్తాయి. వేసవి కాలంలో మనం చాలా నీరసానికి, అలసటకు గురవుతూ ఉంటాం, అలాంటప్పుడు ఈత పళ్ళను తీసుకుంటే వీటిలో ఉండే గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ శరీరానికి తక్షణ శక్తిని అందించి మనల్ని ఆక్టివ్ గా ఉంచడంలో సహాయపడతాయి.

Silver Date Palm Tree

Silver Date Palm Tree

ఈత పళ్లలో ఉండే విటమిన్ సి మరియు ఐరన్ కంటెంట్ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో అద్భుతంగా పని చేస్తుంది. నోటిలో సంక్రమించే పుండ్లను నివారించడంలో కూడా ఈత పళ్ళు ప్రయోజకరంగా ఉంటాయి. మతిమరుపు సమస్యను తగ్గించడంలో మరియు మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఈత పళ్ళు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం మగవారిలో సంతానోత్పత్తిని పెంపొందించడానికి ఈత పళ్ళు తోడ్పడతాయని తేలింది. దగ్గు మరియు ఇతర శ్వాస సమస్యలను నివారించడంలో కూడా ఈత పళ్ళు సహాయపడతాయి.

Also Read: Biogas Production: వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీ.!

Leave Your Comments

Minister Niranjan Reddy: తెలంగాణ మొక్కజొన్న రైతులకు శుభవార్త.!

Previous article

Spinach Health Benefits: బచ్చలి కూరతో బోలెడన్ని లాభాలు మీ సొంతం!

Next article

You may also like