ఉద్యానశోభ

Petunia Cultivation: పెటునియా పూల సాగు.!

2
Petunia
Petunia

Petunia Cultivation: పెటునియా ఎండాకాలంలో మాత్రమే పూసే వార్షిక మొక్క. కొన్ని రకాల పెటునియాలు బహు వార్షిక మొక్కలు. ఇది సొలనేసియా కుటుంబంలో చెందిన మొక్క. పెటునియా పూలు గరాటు ఆకారంలో ఉంటాయి. సంకరణ పద్ధతి ద్వారా వివిధ రకాల పూలు తయారు చేస్తారు. పెటునియా మొక్కలు బోర్డర్‌ మొక్కగా, కుండీలలో పెంచటానికి, వేలాడే పూల కుండీలలో వివిధ రకాలుగా పెంచవచ్చును. ట్రంపెట్‌ ఆకారంలో ఉన్న పెటునియా పూలు ఎండాకాలంలో ఫ్లవర్‌ బెడ్‌లలో, కిటికీలలో అలంకరణకు పెట్టి కుండీలలో పెంచుకోవచ్చు.

రకాలు :
లైమ్‌ లైట్‌, రోజ్‌ స్టార్‌, షుగర్‌ డాడీ, కార్పెట్‌ సిరీస్‌, వేవ్‌ బ్లూ, ఫాంటసీ, మొదలగు రకాలు వివిధ రంగులలో, ఆకృతులలో పూలు వస్తాయి.

వాతావరణం :
పెటానియా మొక్కలు సూర్యకాంతి చానా అవసరం, సుమారుగా 5-6 గంటలు సూర్యకాంతి పడితే ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. నీడ ప్రాంతంలో పెంచితే తక్కువుగా పూలు వస్తాయి.

Also Read: Soil Testing Significance: భూసార పరీక్ష- ఆవశ్యకత.!

Petunia Cultivation

Petunia Cultivation

నేలలు :
మంచి సారవంతమైన ఎర్ర నేలలు, ఇసుక నేలలు సాగుకు అనుకూలం, నేల ఉదజని సూచిక 6-7 ఉంటే మొక్క బాగా పెరుగుతుంది. ఉదజని సూచిక 7 కన్నా తక్కువుగా ఉంటే మొక్కలో ఇనుము లోపం తలెత్తుతుంది.

ప్రవర్ధనము :
విత్తనం ద్వారా ప్రవర్ధనము : గ్రాండిఫ్లోర్‌ రకానికి చెందిన పెటానియా మొక్కలను విత్తనం ద్వారా సాగుచేయవచ్చు. విత్తనం నాటడానికి ముందు నేలను బాగా దున్ను కోవాలి. దానికి కుళ్ళిన పశువుల ఎరువును కలుపుకొని నాటడానికి ఒక రోజు ముందు బాగా నీరు పెట్టాలి. 20-22%ూజ% ఉష్ణోగ్రత వద్ద విత్తనం బాగా మొలకెత్తుతుంది. మొక్క వారం రోజుల వయసులో వేరు కుళ్ళు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
లేత కాండం మొక్కల ద్వారా ప్రవర్ధనము : సుమారు 3 ఇంచెస్‌ పొడవుగల లేత కాండం మొక్కలు కాండం చివర కొన నుండి తీసుకోవాలి. సగం పొడవున వరకు ఆకులను తీసివేయాలి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మట్టి మిశ్రమంలో నాటుకోవాలి.

నాటడం :
ఎప్పుడు అయితే కొమ్మకు 3 – 4 వరుసల ఆకులు వస్తాయో అప్పుడు వాటిని తీసి కుండీలలో నాటుకోవాలి. నాటడానికి ముందు కుండీలోని మట్టి మిశ్రమాన్ని పూర్తిగా తడిచేయాలి లేదా వివిధ ప్రదేశాలలో అలంకారం కోసం బెడ్డింగ్స్‌గా, బోర్డర్స్‌గా, గుంపులుగా ఈ మొక్కలను నాటుకోవచ్చు. ఎరువులు నాటడానికి ముందు నేలలో కుళ్ళిన పశువుల ఎరువును వేసుకోవాలి. నాటిన తరువాత 450 గ్రా. 10-10-10 ఎరువును చదరపు మీటరు వైశాల్యంలో ఉన్న నేలకి వేయాలి.

Petunia Flowers

Petunia Flowers

నీటియాజమాన్యం :
పెటునియా మొక్క కొంత వరకు ఎండను తట్టుకుంటుంది. కానీ నేల రకాన్ని బట్టి, నేలలోని తేమ శాతాన్ని బట్టి వారానికి ఒక్క సారి కానీ, రెండు సార్లు కానీ నీటిని ఇవ్వాలి.

తలలు తుంచడం :
మొక్క 15 సెంటీ మీటరు పొడవు పెరిగిన తరువాత తలలు తుంచడం చేయాలి. పెటునియాలలో తలలు తీయడం వల్ల శాఖీదు పెరుగుదల తగ్గి, పక్క కొమ్మలు ఎక్కువుగా వచ్చి పూలు ఎక్కువుగా వస్తాయి. ఎండిపోయిన పూలను తుంచివేయడం వలన కూడా కొత్త పూలు ఎక్కువుగా వచ్చే అవకాశం ఉంది.

ప్రూనింగ్‌ :
ఎండాకాలం బాగా ముదిరిన తరువాత పెటునియా మొక్క కాండం బాగా పెరిగి వాటి చివరన పూలు వస్తాయి. ఇలాంటి సందర్భం లో కాండను ప్రూనింగ్‌ చేయడం ద్వారా ఎ క్కువుగా పక్క కొమ్మలు వచ్చి ఎక్కువ పూలు పూస్తాయి.

Also Read: Asparagus Benefits: వేసవి కాలంలో మంచి ఆరోగ్యం మీ సొంతం కావాలనుకుంటే ఇది తప్పక తినాల్సిందే!

Leave Your Comments

Soil Testing Significance: భూసార పరీక్ష- ఆవశ్యకత.!

Previous article

Minimum Support Price: 40 కోట్ల మంది రైతులకు కనీస మద్దతు ధర పెంచనున్న కేంద్ర ప్రభుత్వం

Next article

You may also like