క్యాలీఫ్లవర్ ను తెలుపు రంగులో తప్ప మరో రంగులో ఊహించుకోలేం .. మరి మార్కెట్ కి వెళ్ళినప్పుడు తెలుపు రంగుకి బదులు రంగు రంగుల క్యాలీఫ్లవర్లు దర్శనమిస్తే ఆశ్చర్య పోకుండా ఉండలేం కదా.. ఆ పంటను చూడాలంటే బీహార్ లోని పూర్ణియా జిల్లాకు వెళ్లాల్సిందే.. పూర్ణియా జిల్లా చంఢీ పరిధిలోని లోహియానగర్ గ్రామానికి చెందిన రైతు శశిభూషణ్ సింగ్ ఆకర్షియమైన నీలం, పసుపు, ఎరుపు రంగు క్యాలీఫ్లవరులను పండిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. పొలంలోనే ఒక్కో క్యాలీఫ్లవరుని రూ. 30 వరకు విక్రయిస్తున్నారు. ఒక ప్రయోగంలో భాగంగా కేవలం వెయ్యి క్యాలీఫ్లవర్ లను మాత్రమే ఉత్పత్తి చేసారు. వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. రాబోయే సీజన్ లో ఉత్పత్తిని పెంచాలనుకుంటున్నారు. మార్కెట్ లో వీటికి డిమాండ్ అధికంగా వుంది.