Saline Soils Management: భూసార పరీక్ష చేయిస్తే నేలలోని వివిధ పోషకాలు స్థాయి నేల ఉదజని సూచిక (పి. హెచ్) సేంద్రియ కర్బనం కలిగే లవణాలు (ఇ. సి) మార్పిడి చెందే సోడియం శాతం (ఇ.ఎస్. పి) ఇల్లు మొదలగునవి తెలుస్తాయి వీటి ఆధారంగా నేలలోని చౌడు సమస్య తెలుసుకోవచ్చు నేలలో ఉండే ఉదజని సూచిక లవణాల స్థాయి మార్పిడి చెందే సోడియం శాతాలను బట్టి చౌడు నేలను నేలను 3 రకాలుగా (ఉప్పు నేలలు, క్షార నేలలు, లవణీయ నేలలు) విభజించవచ్చు.
చౌడు భూముల్లో రకాలు – లక్షణాలు :
నేల రకాలు పి. హెచ్ ఇ. సి (డెస్పీ సైమన్స్/మీ) ఇ. ఎస్. పి (శాతం)
ఉప్పు నేలలు 8.5 కన్న తక్కువ 4కన్నా ఎక్కువ 15 కన్న తక్కువ
క్షార నేలలు 8.5 కన్న ఎక్కువ 4 కన్న తక్కువ 15 కన్న ఎక్కువ
లవణీయ క్షార నేలలు 8.5 లేదా, అంత కన్న తక్కువ 4 కన్న ఎక్కువ 15 కన్న ఎక్కువ
చౌడు నేలల రకాలు :
1. తెల్లచౌడు (ఉప్పు నేలలు) :
ముఖ్యంగా వేసవికాలంలో కొన్ని నేలల ఉపరితలం పైన తెల్లటి నీటిలో కలిగే లవణాలను పేర్కొని ఉంటుంది భూములలో విత్తిన గింజలు సరిగా మొలకెత్తవు ఉప్పును తట్టుకొని మొక్కలు వేపుగా పెరగవు పొలంలో మొక్కల సాంద్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది.
2. కారు చౌడు (క్షార) నేలలు :
ఈ కారు చౌడు నేలల్లో వేసవి కాలంలో పైన నలుపు లేదా బూడిద రంగు పొరలు చూడవచ్చు వీటిలో మార్పిడి జరిగే సోడియం శాతం 15 కన్నా ఎక్కువగా ఉంటుంది అందువల్ల కొద్దిపాటి వర్షం వచ్చిన నీరు త్వరగా భూమిలోనికి ఇంకదు ఎండినప్పుడు నేల చాలా గట్టిగా ఉంటుంది సేద్యానికి అనుకూలంగా ఉండదు.
3. లవణీయ క్షార నేలలు :
ఈ నేలలు తెల్లచౌడు మరియు కారు చూడు నేలల మిశ్రమ రంగులో ఉంటాయి. ఈ నేలలు కలిగే లవణాలు మరియు మార్పిడి సోడియం రెండిరటిని కలిగి ఉంటాయి వల్ల క్షార స్వభావం కూడా కలిగి ఉంటాయి. ఈ నేలలో కూడా మొక్కలు వేపుగా పెరగవు.
చౌడు భూములు ఎందుకు ఏర్పడతాయి :
చౌడు భూములు ముఖ్యంగా సోడియం క్లోరైడ్ సోడియం కార్బోనేట్ వంటి కలిగి లవణాలు అధికంగా ఉండే శిలల నుంచి తయారై ఉండవచ్చు.
. తగినంత వర్షపాతం లేదా నీటిపారుదల లేకపోతే ఆ నేలలోని లవణాలు తొలగిపోవు.
. గతంలో సాగునీటి సదుపాయాలు లేని ప్రాంతాలలో నీటిపారుదల సదుపాయాలను అభివృద్ధి చేసినప్పుడు దిగువ మట్టి పొరల్లోని నీరు ఉపరితలానికి హావిరిగా వచ్చినప్పుడు నీటితోపాటు లవణాలు కూడా ఉపరితలానికి వస్తాయి.
. సాధారణంగా వర్షపాతం లో లేదా గతంలో సాగునీటి సదుపాయాలు లేని ప్రాంతాల్లో నీటి పారుదల సదుపాయాలను కాలుల ద్వారా అభివృద్ధి చేసినప్పుడు ఎగువ ప్రాంతంలోని లవణాలు కొట్టుకుపోయి క్రింది ప్రాంతంలో స్థిరపడి ఉండవచ్చు.
. తక్కువ వర్షపాత ప్రాంతంలో బావులు బోరు బావుల ద్వారా నీరు పెట్టినప్పుడు ఆ నీటిలోని లవణాలు నేలలో చేరి ఉండవచ్చు.
చౌడు భూముల్ని పంటల సాగుకు అనువుగా మార్చాలంటే…
ఎక్కువగా ఉన్న లవణాల తొలగింపు :
. ఎక్కువగా ఉన్న లవణాలను తొలగించాలి కాలువ ద్వారా చెరువుల నుంచి మంచినీటిని పెట్టి నేను బాగా దున్ని రెండు అంగుళాలు.
. ఆ పైగా మీరు నిలబడేలా చేయాలి.
. రెండు మూడు రోజులపాటు నీటిని మల్లన్న నిల్వ ఉంచి మురుగు కాలువల ద్వారా తీసివేయాలి.
. ఉప్పు శాతం తక్కువ ఉన్న నెలలో రెండు మూడుసార్లు ఎక్కువ ఉన్న నెలలో నాలుగు ఐదు సార్లు ఈ ప్రక్రియ చేయాలి.
2. జిప్సం వాడకం :
. నేలలో చౌడు సమస్య తీవ్రంగా ఉండే నాలుగైదు టన్నులు సమస్య మద్యస్థం లేదా తక్కువగా ఉంటే రెండు మూడు టన్నుల చొప్పున జిప్సంను ఎకరాకు వేయాలి.
. పొలంలో రెండు అంగుళాల మేర నాలుగైదు రోజులపాటు నీరు నిలబడేలా చేయాలి.
. అవసరమైతే ఈ ప్రక్రియను రెండు మూడు సార్లు చేయాలి.
. మధ్యలో ఒకటి రెండు సార్లు నేలను దున్నితే మంచిది.
3. జీలుగా పచ్చిరొట్ట పైరు :
. జీలుగా పచ్చిరొట్ట పైరు పెంచి నేలలో కలియదున్నాలి.
. లవణ క్షార భూములకు జీలుగా దయించ అనువైన పచ్చిరొట్ట పైరు.
. ఎకరాకు 10 కిలోల విత్తనాన్ని పొలమంతా పడేలా చల్లి అడపాదడప నీళ్లు కట్టాలి 8 10 వారాలపాటు జీలుగును పెంచి పూతకు ముందే ట్రాక్టర్‌తో నేలలో కలియదున్నాలి.
. 10 -15 రోజులపాటు రెండు అంగుళాల నీటిని నిలబెట్టితే పచ్చి రొట్టె మురికి వరి నాటుకు నేల సిద్ధమవుతుంది.
Also Read: Coconut – Cocoa Crops: కొబ్బరి – కోకో పంటలలో చేపట్టవలసిన పనులు.!
పచ్చి రొట్ట ఎరువుల ప్రయోజనాలు :
. ఎకరాకు 35 – 40 కిలోల నత్రజనిని నేలలో చేరుతుంది.
. నేలలో ఉదజని సూచికను తగ్గించి మెరుగైన పోషకాలను లభించేలా చేస్తుంది. నెలలో సేంద్రియ పదార్థాన్ని పెంపొందించి పైరుకు అన్ని పోషకాలు లభించేలా చేస్తుంది.
. పైరుకు అవసరమయ్యే మాంగనీస్, మాలిబ్డ్డినం, జింకు, బోరాన్, ఇనుము వంటి సూక్ష్మ పోషకాలను సరఫరా చేస్తుంది నేలలో నీటిని పట్టి ఉంచే గుణం పెంపొందుతుంది.
అనువైన పంటల ఎంపిక :
. నేలలో చౌడు శాతం తగ్గించే మెళకువలను పాటిస్తూ వరి పంట సాగు చేయవచ్చు వరి సాగు చేయడానికి వీలు లేనప్పుడు చౌడును తట్టుకునే చెరకు, రాగి, జొన్న, మొక్కజొన్న, సజ్జ పైర్ల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి
. ఆముదం, పత్తి పంటలు మద్యస్థంగా చౌడును తట్టుకుంటాయి. పెసర, మినుము, సోయాచికుడు, వేరుశనగ వంటి పౖౖెర్లు చౌడును తట్టుకోలేవు వీటిని సాగు చేయకపోవడం మంచిది.
ముఖ్య సూచనలు :
. భూసార పరీక్ష ద్వారా లవణీయక్షార నేలలను గుర్తించాలి.
. ఉప్పులేని మంచినీటితో నేలలో అధికంగా ఉన్న లవణాలను కడిగేయాలి.
. చౌడు తీవ్రంగా ఉంటే ఎకరాకు 5 టన్నులు, తీవ్రత తక్కువగా ఉంటే 2-3 టన్నుల జిప్సం వేయాలి.
. జీలుగా వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి నేలలో కలియదున్నాలి.
. చౌడు నేలలో సాధ్యమైనంత వరకు వరి లేదా చెరకు, రాగి, జొన్న, సజ్జ మరియు పత్తి వంటి పంటలు సాగు చేయాలి.
. పెసర, మినుము, సోయాచికుడు మరియు వేరుశెనగ వంటిపైర్లను సాగు చేయరాదు.
శ్రీ. బి. చంద్రశేఖర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సాయిల్ సైన్స్, ఉద్యాన కళాశాల మోజర్ల, వనపర్తి జిల్లా.
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం.
Also Read: Fowl Pox Disease: ఫౌల్ పాక్స్ వ్యాధి – నివారణా చర్యలు.!