Ragi Laddu Health Benefits: మన శరీరానికి అవసరమైన ముఖ్య ఖనిజాలలో ఇనుము ప్రధానమైనది. ఇది రక్తమును పెంపొందించుటకు ఉపయోగపడుతుంది మరియు ధాతువులకు ఆమ్లజనిని తీసుకువెళ్ళే రక్తంలోని ఎర్ర కణాలైన హిమోగ్లోబిన్ ఇందులో ఉంది. మనం తీసుకునే ఆహారంలో హిమోగ్లోబిన్ లోపించటం వలన రక్తహీనత ఏర్పడుతుంది.
రక్తహీనత :
రక్తములో వున్న హిమోగ్లోబిన్ మోతాదు ఉండవలసిన పరిమాణం కన్నా తక్కువగా వుంటే దానిని రక్తహీనత అంటారు.
రక్తహీనత వల్ల కలిగే దుష్ఫరిణామాలు :
* పనిచేసే సామర్థ్యం తగ్గుదల, ఎక్కువ సేపు పని చేయలేకపోవడం.
* శిశువులలో మెదడు పెరుగుదల సరిగ్గా లేకపోవటం మరియు పిల్లల యొక్క మేథాశక్తి తగ్గటం వలన చదువులో వెనుకబడటం.
* రోగనిరోధక శక్తి తగ్గటం వలన రోగాలు తేలికగా వెంట వెంటనే రావటం.
* గర్భస్రావం, పుట్టిన బిడ్డ లేదా తల్లి చనిపోవడం.
* తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం.
ఒక రాగి లడ్డు (33 గ్రా. బరువు) లో గల పోషక విలువలు :
కేలరీలు – 23.46 kcal
ప్రోటీన్లు – 1.05 గ్రా.
ఐరన్ – 1.425 మి.గ్రా.
బీటా కెరోటిన్ – 7.0
కాల్షియం – 57.4
మొత్తం పోలిక్ యాసిడ్ – 3.05 మి. గ్రా
కొవ్వు – 1.67 గ్రాములు
Also Read: Moringa Powder Health Benefits: హిమోగ్లోబిన్ పెంపొందిస్తున్న మునగాకు పొడి.!
రాగి లడ్డు వల్ల కలిగే ఉపయోగాలు :
• పోషకాహార లోపం మరియు రక్తహీనతను
నివారించడం.
• ఎముక సాంద్రత మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం.
• మధు మేహం నివారించడం
• యాంటీ సూక్ష్మజీవులుగా పని చేస్తుంది అనగా క్యాన్సర్ వ్యతిరేక సంభావ్యత,
వృద్ధాప్యమును అడ్డుకోవడం.
• డయాబెటిస్ వ్యాప్తి నివారించడం.
• చెడు కొలస్ట్రాల్ని తగ్గిస్తుంది. కార్డియోవాస్కులర్ వ్యాధిని
నిరోధిస్తుంది.
రాగి లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు
రాగులు – 1 కి. గ్రా.
బెల్లం – 750 గ్రాములు
పల్లీలు – 250 గ్రా.
యాలకులు – 2
రాగి లడ్డు తయారు చేసే విధానము:
• రాగులను పేలాలు అయ్యే విధంగా వేయించాలి. మర పట్టించి చేసుకోవాలి.
• పల్లీలు వేయించి పొట్టు తీసి కొంచెం మర పట్టి పప్పులుగా చేయాలి. ఈ పప్పులను పిండిలో కలుపు కోవాలి.
• బెల్లం దంచి అందులో కొంచెం నీరు పోసి బెల్లం కరిగే దాక పొయ్యి మీద వుంచాలి.
బెల్లం కరిగిన తరువాత అందులో రెండు యాలకు పొడి చేసి వేయాలి.
పిండిని బెల్లం పాకంలో వేసి ఉండలు చేయాలి.
Also Read: Turmeric Crop: పసుపులో ఎరువుల యాజమాన్యం.!