Nematodes in Commercial Vegetables: కూరగాయ పంటలలో సాధారణ, చీడపీడలతో పాటు నులిపురుగులు కూడా ఆశించిన అధిక నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా ఇవి హరితగృహంలో పండిరచే వివిధ రకాల పూలు మరియు కూరగాయ పంటలను పండిస్తున్నాయి. నులిపురుగులు చిన్నవిగా కంటికి కనపడని పరిమాణంలో ఉంటాయి. ఇవి ఆకారంలో సన్నటి దారంలాగా ఉండి ముక్కు ద్వారా చెట్ల రసాన్నిపీలుస్తూ ఉంటాయి. వీటి పరిమాణం సుమారు 0.5 నుండి 2 మి.మీ వరకు అంటుంది. నులిపురుగులు చెట్లవేర్లను, కొమ్మలను, ఆకులు మరియు పూలను ఆశించి నష్టం కలుగజేస్తాయి.
తల్లిపురుగులు దాదాపు 400 500 గ్రుడ్లను పెట్టి జిగురు పదార్థంతో కప్పి ఉంచుతుంది. గ్రుడ్లు నుండి వచ్చిన పిల్లపురుగులు మొక్కల వేర్ల నుండి రసాన్ని పీలుస్తాయి. ఈ విధంగా రసాన్ని పీల్చడం వలన వేరు భాగంలో కణాలు పక్కువగా ఉత్పత్తి చెంది బుడిపెలుగా మారతాయి. నులిపురుగుల జీవిత చక్రం 3 నుండి 4 వారాలలో పూర్తవుతుంది. కూరగాయ పంటలలో ముఖ్యంగా మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిటం, రోటిలెంకిన్ మరియు హెటిరోలెంకస్ అను రకాలు ఎక్కువగా ఆశిస్తున్నాయి.
నులిపురుగులు ఆశించిన కూరగాయ పంటల లక్షణాలు :
1. నులిపురుగులు టమాట, వంగ, మిరప, కీరదోస, పొట్ల, గుమ్మడి, కాకర, క్యారెట్, బీట్‌రూట్ మరియు ముల్లంగి వంటి పంటలలో పక్కువగా ఆశిస్తున్నాయి.
2. నులిపురుగులు నారుమడిలో గాని, ప్రథాన పొలంలో గాని ఆశించినప్పుడు ముందుగా మనకు మొక్కను గమనించినట్లైతే ధాతువుల లోహం లాగా కనపడుతుంది. ఆకుల ఈనెల మధ్య పసుపు రంగుకు మారడం, మొక్క ఎండిపోవడం, మొక్కలు కురసగా మారిపోవడం గమనించవచ్చు. ధాతువులు మొక్కలకు లభించవు
. నులిపురుగులు ఆశించాయా లేదా అనేది మొక్కల వేర్లపై బుడిపెలను బట్టి నిర్థారించుకోవాలి.
. వేర్ల పై ఉండే ఈ బుడిపెల పరిమాణం పంట రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. టమాట మరియు వంగ పంటల్లో బుడిపెల పరిమాణం పెద్దవిగా ఉంటాయి. మిరపలో బుడిపెల పరిమాణం చిన్నగా ఉండి వేర్లు సరిగ్గా పదగవు.
. తీగ జాతి కూరగాయలైనటువంటి కీరదోస, పొట్ల, కాకర, గుమ్మడి పంటలో నులిపురుగులు ఆశించడం వలన మొక్క కురుసగా ఉండి, పదుగుదల ఆగిపోతుంది. ఆకులు చిన్నవిగా ఉండి పసుపు రంగుకు మారతాయి. కాయలు సరిగ్గా పదగవు. వేర్లలో బుడిపెలు పెద్దవిగా ఉండి వేర్లు సరిగ్గా పదగవు.
దుంప జాతి కూరగాయలలో దుంపలలో చీలిక, దుంపసరిగ్గా పదగకపోవడం, బుడిపెలు చాలా పెద్దవిగా ఉంటాయి.
. వీటితో పాటు రక్షిత గృహాలలో ఒకే రకం కూరగాయ పంటలు పదే పదే వేయడం, నులిపురుగులను ఆశించిన మొక్కలను పెట్టుకోవడం అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ శాతం, పరువులు పక్కువగా నాటడం వలన బయట పండిరచిన కూరగాలలో కంటే రక్షిత గృహాల్లో నులిపురుగులు 10 నుండి 30 రెట్లు పక్కువగా ఉంటాయి.
. ఈ విధంగా రక్షిత గృహాలలో నులిపురుగుల సాంద్రత 18 నెలలో దాదాపు 5`6 రెట్లు పక్కువయ్యే అవకాశం ఉంటుంది.
Also Read:New Agriculture Technology: ప్రస్తుతం తెలుగు రాష్ట్రలలో అవలంబిస్తున్ననూతన వ్యవసాయ విధానాలు.!
నులిపురుగుల యాజమాన్యం –
1. సాగువిధానాలు : పంట మార్పిడి చేయడం, వేసవిలో లోతుగా దుక్కలు చేయడం, పరపంటలు వేయడం, సేంద్రియ పరువులను ఉపయోగించడం మరియు నులిపురుగులను తట్టుకొనే రకాలను సాగుచేయడం
2. కలుపు మొక్కలను కూడా నులిపురుగులను ఆశిస్తాయి కావున వాటిని లేకుండా చేసుకోవాలి.
3. బంతి పంటను వేయడం వలన నులిపురుగుల ఉధృతి తక్కువగా ఉంటుంది. బంతి పంట నులిపురుగులను చంపే విష పదార్థాన్ని వేర్ల ద్వారా విడుదల చేస్తుంది.
4. ఆవ పంటను కూడా వేయడం వలన మరియు దున్నడం వలన ఐసోటిక్లోనటిస్‌ని విడుదల చేయడం వలన నులిపురుగులు చనిపోతాయి.
5. వేప పిండి, వేపచెక్క వేయడం వలన కూడా నులిపురుగులు చనిపోతాయి.
6. జీవనియంత్రణ పద్ధతుల వాడకం : పర్‌ప్యూరియంసీలియం లేదా పెసిలోమైసిస్, పోటానియా, లాంటి శిలీంధ్రాల వాడకం వలన నులిపురుగుల గ్రుడ్లు మరియు తల్లి పురుగులు తగ్గుతాయి. ఆస్ఫర్జిల్లస్ నైజర్, ట్రైకోపెర్మా, ట్రైహార్జియానం లాంటి శిలీంధ్రాలతో కూడా నులిపురుగుల ఉధృతి తగ్గుతుంది.
ఒక టన్ను బాగా చిలికిన పశువుల పరువును 2`3 కిలోల సూడోమోనాస్ G 2 కిలోల (ట్రైకోపెర్మా G 2 కి. పెసిలోమైసిస్ (పరేషకీర్తిమో హిలీయం) కలిపి నీటిలో పెట్టుకోవాలి. 25`30 % తేమ ఉండేలాగా చూసుకొని ఒక గోనె పట్టాతో 15 రోజుల వరకు కప్పి ఉంచాలి. వారానికి ఒకసారి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రధాన పొలంలో చల్లుకోవాలి.
. జీవనాశినులను పశువుల పరువుతో లేదా 250 గ్రా. వేప చెక్కను లేదా 500 గ్రా. వర్మికంపోస్టుకి కలిపి ఒక్కో మొక్కను నాటే సమయంలో మరియు నాటిన ఆరునెలల తర్వాత మళ్లీ వేసుకోవాలి.
. మట్టిని ప్లాస్టిక్ మల్చితో కప్పితే భూమిలో వేడి ఉత్పతై నులిపురుగలు చనిపోతాయి.
పై విధంగా వివిధ రకాల సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టి కూరగాయ పంటలను ఆశించు నులిపురుగులను నివారించుకోవచ్చు.
Also Read: Pest in Tobacco Crop: బీడి పొగాకు పంటను ఆశించే చీడపీడలు, తెగుళ్ళు – యాజమాన్యం
Also watch: