ఉద్యానశోభ

Mulching Technique in Chilli Crop: మల్చింగ్‌ పద్ధతిలో మిరపసాగు లాభదాయకం.!

0
Chillis
Chillis

Mulching Technique in Chilli Crop: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పండిరచే వాణిజ్యపంటలలో మిరప ముఖ్యమైన పంట. గుంటూరు, ప్రకాశం, కృష్ణ, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో ఈ మిరప పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. మేలైన యాజమాన్య పద్ధతులతో పాటు, పరువులను, నీటిని బిందు సేద్యం ద్వారా అందిస్తే పంటకు సరైన పాళ్ళలో నీరు, పరువులు నేరుగా వేరు వ్యవస్థకు అందించబడి పంట పెరుగదల బాగా ఉండి అధిక దిగుబడులు పొందవచ్చు.

Mulching Technique in Chilli Crop

Mulching Technique in Chilli Crop

ప్రధాన పొలం తయారీ :
మిరప పంటకు మెత్తటి దుక్కి అవసరం. భూమిని 3`4 సార్లు బాగా దున్ని, ఆఖరిగా రోటావేటర్‌తో చదను చేయాలి. ఆఖరి దుక్కిలో పకరానికి 10 టన్నుల పశువుల పరువు వేయాలి. బిందు సేద్య, ద్వారా నీరందించే రైతులు ప్రథాన పొలంలో 4 లేదా 5 అడుగుల వెడల్పు గల పత్తైన బోదెలను తయారు చేసుకోవాలి. బిందు సేద్యంలో గల నల్లటి లేటరల్‌ పైపులను బోదెలపై పరుచుకోవాలి. తర్వాత మల్చింగ్‌ షీటును పరిచి బోదెకు ఇరువైపులా మట్టి వేసి మల్చింగ్‌ షీటు గాలికి లేవకుండా చేయాలి. తర్వాత లేటరల్‌ పైపుకు రెండు వైపులా 30 సెం.మీ దూరంలో షీటుకు రంధ్రం చేయాలి. అంటే ఒక బోదెమీద జంట సాళ్ళు వస్తాయి. మొక్కకు మొక్కకు మధ్య దూరం 2 అడుగులు, సాలుకు సాలుకు మధ్యదూరం 30 సెం.మీ. చొప్పున ప్రతి బోదె మీద జంటసాళ్ళ పద్ధతిలో మిరపను నాటినట్లవుతుంది. మల్చింగ్‌ షీట్‌ కింద లేటరల్‌ పైపుద్వారా విడుదలైన నీటి బిందువులు బోదె మొత్తం పదును చేస్తుంది. కేవలం 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు మాత్రమే రోజు డ్రిప్‌ ద్వారా నీరు అందించాలి.
ప్లాస్టిక్‌ మల్చింగ్‌ షీట్‌ వాడటం వల్ల లాభాలు :
. మల్చింగ్‌ షీటు బోదెలపై కప్పడం వలన మొక్క చుట్టూ ఉండే తేమను ఆవిరి కాకుండా నివారించడం ద్వారా 30`60% వరకు నీరు ఆదా అవుతుంది.
. సూర్యరశ్మి నేరుగా భూమిపై పడినందున 70`80% వరకు కలుపు నివారించవచ్చు. దీని ద్వారా కలుపుపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. అదే విధంగా మొక్కలపైన రసం పీల్చే పురుగు ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది.
. సాంప్రదాయ పద్ధతిలో పరువులు వేయడం వలన మొక్కకు కేవలం 30`40% మాత్రమే అందుతుంది. మల్చింగ్‌ షీటు వేసిన పొలంలో డ్రిప్‌ ద్వారా పరువులను అందించడం వలన 80`90% వరకు నేరుగా వేరు వ్యవస్థకు పరువులు అందుతాయి.
. భూమి కోతకు గురికాదు.
. వేళ్ళ చుట్టూ సానుకూల వాతావరణ పరిస్థితులు కలుగజేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రించే అవకాశం ఉంది.
. వేసవిలో మల్చింగ్‌ షీట్‌ పరచడం వలన భూమిలోని క్రిమి, కీటకాలు, తెగుళ్ళను నివారించవచ్చును.
అనేక కంపనీల వారు వివిధ రకాల మందం (మైక్రాన్స్‌)లో వివిధ రంగులలో మల్చింగ్‌షీట్‌లను తయారు చేస్తున్నారు. మిరపలో 25 మైక్రాన్‌ల మందం గల మల్చింగ్‌ షీట్‌ను వాడుకోవచ్చు. ఒక ఎకరానిక 3200`3600 చ.మీ. షీట్‌ అవసరమవుతుంది. ఇటీవలి కాలంలో నిర్దేశించిన దూరంలో రంథ్రాలు చేసిన మల్చింగ్‌ షీట్‌ పేపర్లు మార్కెట్‌లోకి అందుబాటులో వచ్చాయి. ఇవి కూడా మిరప సాగులో వాడుకోవచ్చును.

Mulching Technique

Mulching Technique

పరువుల యాజమాన్యం :
సేంద్రియ, రసాయన పరువులను సమన్వయంతో వాడితే, భూసారం క్షీణించకుండా అధికోత్పత్తిని సాధించవచ్చును. అందుకని సేంద్రియ పరువులు, రసాయనిక పరువులు సమీకృతంగా వాడాలి. సేంద్రియ పరువులలో పశువుల పరువు అతి ముఖ్యమైనది. ఈ పరువు ప్రతి సంవత్సరం పకరానికి 10 టన్నులు వేయాలి. సేంద్రియ పరువు అందుబాటులో లేనప్పుడు పచ్చి రొట్ట పైరుని పెంచి, పూత దశలో భూమిలో కలియదున్నాలి. జనుము, పిల్లి పెసర, అలసంద, పెసర వంటివి పచ్చిరొట్టపైర్లకు అనుకూలం.
వీటితో పాటు ఎకరానికి ఒక క్వింటా వేపపిండిని వేయడం ద్వారా మంచి నాణ్యతతో కూడిన ఉత్పత్తిని సాధించడమే కాక వేరు పురుగులను కూడా నివారించవచ్చును.
ఆఖరి దుక్కిలో హెక్టారుకు 75 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్‌ నిచ్చే పరువులు అంటే 165 కిలోల యూరియా, 375 కిలోల సూపర్‌, 50 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేయాలి.
డ్రిప్‌ ద్వారా పరువులను పంపటాన్ని ‘ఫెర్టిగేషన్‌’ అంటారు. ఫెర్టిగేషన్‌ ద్వారా కేవలం నీటిలో కరిగే పరువులను (యూరియా, ఫాస్పారిక్‌ యాసిడ్‌, అమ్మోనియం సల్ఫేట్‌, పొటాషియం నైట్రేట్‌ మొదలైనవి) మాత్రమే పంపాలి. నీటిలో కరగని పరువులను కొంత మంది రైతులు ఒక రోజు ముందుగా నానబెట్టి మరుసటి రోజు డ్రిప్‌ ద్వారా పంపించే పద్ధతిని అవలంబిస్తున్నారు. దీని వలన డ్రిప్పర్లు మూసుకొనిపొయి, వారి డ్రిప్‌ సిస్టమ్‌ త్వరగా పాడైపోతుంది. మల్చింగ్‌ విధానంతో పాటు, డ్రిప్‌ ద్వారా నీరు, పరువులను అందించి, సరైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే సగటున ఎకరానికి 35`40 క్వింటాళ్ళ ఎండు మిరప దిగుబడిని సాధించవచ్చు.

Also Read: High Yield Chilli Varieties: మిరపలో అధిక దిగుబడికి అనువైన రకాలు మరియు వాటి లక్షణాలు.!

Also Watch:

Leave Your Comments

Flower Tea: నయా ట్రెండీ ఫ్లవర్ ‘టీ’.!

Previous article

Pachagavya: మొక్కలకు పంచామృతం ఈ ‘పంచగవ్య’

Next article

You may also like