ఉద్యానశోభ

Jasmine Cultivation: మల్లెతోటల్లో మంచి దిగుబడి రావాలంటే ఇలా చెయ్యండి.!

0
Jasmine
Jasmine

Jasmine Cultivation: బహువార్షిక పంటైన మల్లె ఆంధ్రప్రదేశ్. తెలంగాణాలోని అనేక ప్రాంతాల్లో సాగుచేస్తున్నారు. మల్లెలో ప్రధానంగా మూడు రకాలున్నాయి.. అవి

1) గుండుమల్లె: ఈ రకం మార్చి నుంచి సెప్టెంబరు వరకు పూలని స్తుంది. వీటిని సుమారు 75శాతం వరకు సాగు చేస్తారు.

2) జాజిమల్లె: ఈ రకం మార్చి నుంచి అక్టోబరు వరకు పూలనిస్తుంది.

3) కాగడమల్లె: ఈ రకం జూన్ నుంచి ఫిబ్రవరి వరకు పూలు పూస్తుంది. ఈ పూలకు సువాసన ఉండదు.

సాగులో మార్పుతోనే అధిక దిగుబడి:

మల్లెపూలను పూలదండల తయారీలో స్త్రీల సౌందర్యానికి, పూజలకు, పరిమళ ద్రవ్యాల తయారీకి, నూనెల తయారీకి విరివిరిగా వాడుతారు. ప్రస్తుత సాగుపద్ధ తిలో మల్లె రకాల్లో నాణ్యమైన అధిక దిగుబడులు రాక రైతులకు రావాల్సినంత ఆదాయం లభించడం లేదు. మల్లెసాగులో శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే అధిక నాణ్యమైన అధిక దిగుబడులు పొందే అవకాశం ఏర్పడుతుంది.

నాటిన మూడో సంవత్సరం నుంచి వ్యాపారసరళిలో దిగుబడి ప్రారంభమై 12-15 సంవత్సరాల వరకు మల్లె పూల తోటల నుంచి దిగుబడులు పొందవచ్చు. ఆ తర్వాత పూల దిగుబడి, నాణ్యత తగ్గుతాయి.

గుండుమల్లె, జాజిమల్లె తోటలకు జనవరి నుంచి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడితో పాటు నాణ్యమైన పూల దిగుబడి పొందవచ్చు. మేలైన యాజమాన్యంలో ప్రధానంగా చేయాల్సినవి.

Also Read: Jasmine Essential Oil: మల్లెపూల నుండి సుగంధ తైలం తీయటం

కొమ్మల కత్తిరింపులు:

మల్లెలో కొత్తగా పుట్టిన రెమ్మల చివరిభాగం నుంచి, పక్కల నుంచి పూలు వస్తాయి. కాబట్టి పూలు పూసే కొమ్మలు, రెమ్మలు ఎక్కువ సంఖ్యలో పొందడానికి తద్వారా అధిక పూల దిగుబడి పొందేందుకు ఖచ్చితంగా కత్తిరింపులు చేయాలి. కత్తిరింపులు చేసేముందు మల్లె తోటలకు నవంబరు నుంచి నీరు పెట్టకుండా చెట్లను నీటిఎద్దడికి (బెట్టకు) గురిచేసి, వాడ బెట్టి ఆకులు రాలేలా చేయాలి.జనవరి నెలాఖరుకు సహజంగా చలికి ఆకులు రాలుతాయి.

Jasmine Cultivation

Jasmine Cultivation

కొమ్మలన్నింటిని దగ్గరకు చేర్చి తాడుతో కడితే ఆకులు తొందరగా రాలుతాయి.మేకల మందలను మల్లెతోటల్లో వదిలితే అవి ఆకులను తింటాయి.  కొన్ని సందర్భాల్లో వాతావరణ పరిస్థితుల వల్ల చెట్లు ఆకుల్ని రాల్చవు. ఇలాంటి సందర్భాల్లో ఆకులను మనుషులతో దూయించాలి. ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కావున రసాయన మందులను వాడి ఆకుల్ని త్వరగా రాల్చవచ్చు.

ఒక లీటరు నీటికి 3గ్రా. పెంటాక్లోరోఫినాల్ లేదా 3గ్రా. పొటా షియం అయోడైడ్ కలిపి చెట్లపై పిచికారి చేస్తే ఆకులన్నీ రాలుతాయి.ఆకులు రాలిన 5 సంవత్సరాల్లోపు వయసున్న తోటల్లో కొమ్మలు భూమి నుంచి రెండు అడుగులు, 5 సంవత్సరాలపైన వయసున్న తోటల్లో మూడు అడుగులు ఉంచి మిగిలిన పైభాగాన్ని కత్తిరించాలి.ఎండు కొమ్మలను, బలహీనంగా ఉండే కొమ్మలను పూర్తిగా తొలగించాలి.నీరు పారించిన తర్వాత పుట్టే నీట కొమ్మలను కూడా కత్తి రించాలి.

తవ్వకాలు:

కొమ్మల కత్తిరింపుల తర్వాత తేలికపాటి తడిస్తే నేల మెత్తబడుతుంది. నేల ఆరిన తర్వాత చెట్టు మొదలు చుట్టూ 30 సెం.మీ. వదిలి నేలను 15 సెం.మీ. లోతువరకు తవ్వి వారంరోజులు ఎండనివ్వాలి.

పూలు పూసే సమయం పూర్తయ్యే లోపు కనీసం నాలుగు సార్లు తవ్వకాలు చేయాలి.

Also Read: Jasmine Cultivation: మల్లె సాగులో సస్యరక్షణ

నీటి యాజమాన్యం:

నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లో తోటలకు నీరు పారిం చకుండా చెట్లను నీటిఎద్దడికి గురిచేసి వాడబెట్టాలి. దీనివల్ల కత్తిరింపులు చేసిన తర్వాత ఎరువులు వేసి నీరు పారిస్తే కొత్త చిగుర్లు ఎక్కువగా పుట్టి, పూలదిగుబడి అధికంగా ఉంటుంది. ఒకసారి పూలు కోసిన తర్వాత 7-10 రోజులు నీరు పారిం చకుండా చెట్లు కొద్దిగా వాడేలాచేసి ఆ తర్వాత నీరు పారిస్తే పూల దిగుబడి ఎక్కువగా ఉంటుంది.పూత సమయంలో చెట్లు నీటి ఎద్దడికి గురికాకూడదు.నేల స్వభావాన్ని బట్టి 5-6 రోజులకొకసారిపూలు పూసే సమయంలో నీరు పారించాలి.

Also Watch:

Must Watch:

Leave Your Comments

AP Higher Education Planning: కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ ద్వారా సామాజిక బాధ్యతను పెంపొందించడం.!

Previous article

Gardening and Fish Cultivation: టెర్రస్ పై కూరగాయలు, చేపల పెంపకం.!

Next article

You may also like