Flowers in Gardening: వార్షిక పూలలో అనేక రకాల జాతులు ఉండటంతోపాటు వివిధ రకాల రంగులో ఉండటం వల్ల ప్రతి పువ్వుకు మరియు ప్రతి రంగుకు ఒక విశిష్టత ఉంటుంది. ఈ వార్షిక పూలు సౌందర్యం గానూ మరియు సువాసనభరితంగా ఉండటం వల్ల మన యొక్క మానసిక స్థితిని ఉత్తేజపరుస్తాయి. పుష్పించే కాలాన్ని బట్టి ఈ పూలను మూడు రకాలుగా విభజించవచ్చు.
శీతాకాల వార్షిక పూలు : స్నాప్ డ్రాగన్, అజిరేటమ్, క్యారెండులా, పాన్సీ, పెట్యూనియం, సాల్వియా.
వేసవి వార్షిక పూలు : కాస్మస్, కొరియాప్సిస్, గైలార్డియా, జిన్నియా
వర్షాకాల వార్షిక పూలు : బాల్సిమ్, గాంఫరీనా, బంతి
విత్తే కాలం : వేసవి పూలైతే జనవరిలో వర్షాకాల పూలైతే జూన్, జూలైలో మరియు శీతాకాల పూలైతే సెప్టెంబర్ నుండి అక్టోబర్ మాసంలో విత్తుకోవాలి. కుండీలలో పెంచే విధానం : కుండీలు 15`35 సెం.మీ. వ్యాసం కలిగి ఉండాలి. కుండీ మిశ్రమం కొరకు ఎర్రమట్టి, పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు ఇసుక వాడవచ్చు.
గార్డెన్లో పెంచే విధానం : నాటే ముందు భూమిని 30 సెం.మీ.లోతు దున్నుకోవాలి. తేలికైన రోలర్‌తో నేలను సమానంగా ఎత్తుపల్లాలు లేకుండా చదును చేసుకోవాలి. సాధారణంగా వార్షిక పూలు సూర్యరశ్మి మరియు వెలుతురు ఉండే ప్రదేశాలలో ఎక్కువగా పుష్పిస్తాయి. కానీ అజిరేటమ్ క్యాలెండులా మరియు సాల్వియా పాక్షికంగా ఉండే నీడలో కూడా పూస్తాయి. ఒకవేళ ఈ వార్షిక పూలు బోర్డర్ లేదా రెండు బెడ్స్ మధ్య వేసుకున్నట్లయితే లాన్‌మూవర్ తిప్పుకోవడానికి కొద్దిగా స్థలం వదులుకోవాలి. చిన్న బెడ్స్ అయితే ఒకే రకమైన వార్షిక పూలు వేసుకోవాలి. పెద్ద బెడ్స్ అయితే అనేక రకాల వార్షిక పూలను ఎంచుకోవాలి.
పొడవైనవి : టైథోనియా, హాలీహాక్ మరియు సన్ ఫ్లవర్లను బోర్డర్‌కు వెనుక భాగంలో వేసుకోవాలి.
మధ్యస్థంగా పెరిగేవి : అన్టిరైనమ్, సాల్వయా పూలను మధ్య వరుసలలో వేసుకోవాలి.
పొట్టిగా పెరిగేవి : ఆస్టర్, క్యాలెండులా మరియు అల్లిసమ్ పూలను ముందు వరుసలో వేసుకోవాలి.
Also Read: Vegetable Gardening: 30 రోజుల్లో ఇంట్లో కంటైనర్‌లో పెరిగే రుచికరమైన కూరగాయలు
విత్తు కోవడం : సాధారణంగా వార్షిక పూలను నర్సరీలలో పెంచి మొక్కలను వేసుకుంటారు. కానీ కొన్ని పూల మొక్కలు నారుమడిని తట్టుకోలేవు. అలాంటి వాటిని లైనేరియా, హాలిహాక్ మొదలగు వాటిని నేరుగా నేలలో విత్తుకుంటారు. అలంకరణ కోసం వాటిని కుండీల్లో గాని, పాన్లలో గాని విత్తన ఫ్రేమ్‌లో పెంచుతారు. పెంటానియా విత్తనాలు చాలా చిన్నవిగా ఉండటం వల్ల వీటిని ఇసుకతో కలిపి వేసుకోవాలి. ట్రేలను నీడలో ఉంచుకొని మొలకెత్తిన తర్వాత సూర్యరశ్మి అందేలా చూసుకోవాలి.
పిన్ కింగ్ : మొలకెత్తిన లేత మొక్కలను వేరొక ప్లాస్టిక్ ట్రేలలో లేదా పాన్‌లో వేసుకోవాలి. ఈ మొక్కలను తరలించేటప్పుడు కొంచెం పెద్దవిగా చేతిలో పట్టుకొని విధంగా ఉండాలి. చిన్న చిన్న కుండీల్లో వేసుకున్నట్లయితే మొక్కలకు నాలుగు నుండి ఆరు ఆకులు కలిగి ఉండాలి.
నారు మొక్కలు నాటడం : ఒక నెల వయసు గల లేత మొక్కలను వేళ్ళతో సహా 4 నుండి 6 ఆకులు ఉన్నప్పుడు నెమ్మదిగా తీసి గార్డెన్లో నాటుకోవాలి. ఈ నారు మొక్కలు నాటుకునేంతవరకూ మరియు భూమిలో గట్టిపడేవరకు నీటిని అందించాలి.
ఎరువుల యాజమాన్యం : నాలుగు కిలోల ఆయిల్ కేక్ లేదా ఆవుపేడ మరియు అమ్మోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్పేట్ మిశ్రమాన్ని 5 లీటర్ల నీటిలో కలిపి పులియబెట్టాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని వడగట్టి, నీరు కలిపి 15 రోజుల కొకసారి చదరపు మీటరుకు 3`4 లీటర్లు పిచికారీ చేయాలి. అలా కుదరని పక్షంలో అమ్మోనియా ఫాస్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, పొటాషియం సల్ఫేట్ 2:1:1 నిష్పత్తిలో చదరపు మీటరుకు 60 గ్రా. ఇవ్వాలి.
-డా. ఎమ్. విజయలక్ష్మి, ఎఐసిఆర్ఐపి`డబ్ల్యుఐఎ, రాజేంద్రనగర్
డా. ఎ. నిర్మల, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్
డా. డి. రజని, వ్యవసాయ కళాశాల, పాలెం. ఫోన్ : 8330940330
Also Read: Sujani’s Eden Garden: అద్దె ఇంటిపై మిద్దె గార్డెనింగ్ చేస్తున్న సుజనీరెడ్డి
Must Watch: