Tippa Teega: మానవాళికి ఉపయోగపడే మొక్కలు అనేకం ఉన్నాయి కానీ చాలా వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి మనకు తెలియవు. అందులో టీనోస్పోరా కార్డిఫోలియా అనబడే మొక్క ప్రధానమైనది. తిప్పతీగను మన పరిసరాలలో తీగలాగా పాకే పిచ్చి మొక్కగాను లేదా అలంకరణ మొక్కగానో చూస్తాము కానీ దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే! ఆయర్వేద శాస్త్రంలో ప్రస్తావించిన అద్భుతమైన ఔషధ మొక్క. దీనిని సాధారణంగా గుడూచి, అమృత, గిలోయ్ లేదా తిప్పతీగ అని మొదలగు పేర్లతో పిలుస్తారు. ఇది భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఢల్లీి, గుజరాత్, గోవా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, సిక్కిం, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో పెరుగుతుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు కరోనావైరస్ మరియు ఇతర వైరల్ వ్యాధులతో తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది, కావున రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి తిప్పతీగ యొక్క కషాయాన్ని తీసుకోవడం మేలని అధ్యయనాలు చెప్తున్నాయి.
ఉపఉష్ణమండల మరియు ఉష్ణమండల వాతావరణంలో పెరిగే ఈ మొక్క యొక్క ఆకులు, కాండం, అలాగే వేర్లలో కూడా అనేక రకాల పోషకాలు లభిస్తాయి. దీని ఆకులలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో క్యాల్షియం, ఐరన్ మరియు విటమిన్ సి కూడా కొద్ది మొత్తంలో ఉంటాయి. టినోస్పోరా కార్డిఫోలియా యొక్క ఆకుల సారంలో స్టెరాయిడ్లు, ఆల్కలాయిడ్లు, టానిన్లు మరియు సపోనిన్లు, విటమిన్లు, కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు మరియు ఫినోలిక్ సమ్మేళనాలు ఉన్నట్టు పరిశోధనలో తేలింది. అలాగే ఈ మొక్క యొక్క కాండంలో టినోస్పోరాన్, టినోస్పోరిక్ ఆమ్లం, సిరంగెన్, బెర్బెరిన్, గిలెనిన్, పిక్రోటీన్, బెర్గెనిన్, గిలోస్టెరాల్, గ్లూకాన్ పాలీసాకరైడ్, కార్డిఫోల్, సిటోస్టెరాల్, మాగ్నోఫ్లోరిన్, టెంబెటరిన్ మరియు ఐసోకోలమ్బిన్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇవేకాక రాగి, ఇనుము, భాస్వరం, జింక్, కాల్షియం, మాంగనీస్ కూడా ఈ మొక్కలో పుష్కలంగా లభిస్తాయి. కావున ఈ మొక్క యొక్క ఏ భాగం అయినా కూడా మన ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది.
తిప్పతీగలో పెద్ద సంఖ్యలో యాంటీఆక్సిడెంట్లు అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నందున ఇది జ్వరం, కామెర్లు, ఆర్థరైటిస్, మధుమేహం, మలబద్ధకం, అసిడిటీ, అజీర్ణం, మూత్ర సంబంధ వ్యాధులు మొదలైన వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. డయాబెటిస్, మలబద్ధకం మరియు కామెర్లతో సహా అనేక తీవ్రమైన వ్యాధుల చికిత్సలో ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, జీర్ణ వ్యాధులతో పాటు, ఆస్తమా మరియు దగ్గు వంటి శ్వాసకోశ వ్యాధుల నుండి ఉపశమనం పొందడంలో కూడా ఇది చాలా ప్రయోజకరంగా ఉంటుందని పరిశోధనలు చెపుతున్నాయి. అలాగే తిప్పతీగ టైప్-2 మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మలేరియా, స్వైన్ ఫ్లూ, డెంగ్యూ సమయంలో రోగికి వచ్చే అధిక జ్వరం తగ్గించి, రోగనిరోధక శక్తి సమకూరేలా ఈ మొక్క సమర్థవంతంగా పనిచేస్తుంది. మలబద్ధకం, అసిడిటీ లేదా అజీర్ణం వంటి జీర్ణ సమస్యలతో మీరు ఇబ్బంది పడుతుంటే, తిప్పతీగ మీకు చాలా ప్రయోజకరంగా ఉంటుంది. గిలోయ్ జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఇది అనేక అంటువ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది.
కామెర్ల రోగులకు తిప్పతీగ యొక్క తాజా ఆకుల రసాన్ని ఇవ్వడం ద్వారా కామెర్లు, కామెర్ల వల్ల కలిగే నొప్పి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. సాధారణంగా రక్తహీనతతో బాధపడే మహిళలకు దీని జ్యూస్ ఇవ్వడం వల్ల రక్త నష్టం తొలగించి మంచి ఆరోగ్యం చేకూరుస్తుంది. ఉర్టికేరియా, చర్మంపై దద్దుర్లు లేదా ముఖంపై మొటిమలు ఉన్నప్పుడు, ఇది వాటన్నింటిపై ప్రభావం చూపిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు టినోస్పోరా తీసుకోవడం చాలా మేలని నిపుణులు చెప్తున్నారు. గుడుచి కఫాన్ని, దగ్గు వంటి వ్యాధుల నుండి కాపాడి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల అనేక విధాలుగా కాలేయం దెబ్బతింటుంది, అలాంటప్పుడు గుడుచి సత్వాలు కాలేయానికి టానిక్ లా పనిచేస్తాయి. గిలోయ్ దాని కషాయ (ఆస్ట్రింజెంట్) మరియు రోపన్ (వైద్యం) స్వభావం కారణంగా మండుతున్న అనుభూతి, ఎరుపు మరియు దురద వంటి కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Also Read: Medicinal Uses of Neem: వేపలోని దివ్యమైన ఔషధ గుణాలు!
గిలోయ్ కు బరువును తగ్గించే సామర్థ్యం ఉంది. దీని కోసం, 1 టీస్పూన్ తేనె మరియు గిలోయ్ రసం కలిపి ప్రతి రోజు వాడకం ద్వారా ఊబకాయం అధిగమించబడుతుంది. గిలోయ్ దాని ఘాటు మరియు కషాయ (ఆస్ట్రింజెంట్) స్వభావం కారణంగా జుట్టు రాలడం మరియు చుండ్రును నియంత్రించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ఈ తిప్పతీగ, ఇప్పుడున్న ఉరుకుపరుగుల కాలంలో వచ్చే మానసిక ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించాడనికి ఎంతో సహాయపడుతుంది. ఒక వ్యక్తి రోజుకు రెండుసార్లు ఉదయం 20 మిల్లీలీటర్ల రసాన్ని తాగితే ఎర్ర, తెల్లరక్తకణాలు లోపించడం, జీర్ణక్రియ సమస్యను అధిగమించవచ్చు. క్యాన్సర్ కు చికిత్స పొందుతూ, రేడియోథెరపీ మరియు కీమోథెరపీ యొక్క దుష్ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
చాలా మంది పెద్దవారికి తిప్పతీగ యొక్క ప్రయోజనాలు తెలుసు, కానీ ఎలాంటి పరిస్థితులలో ఎంత మోతాదులో తీసుకోవాలో, వినియోగ విధానం తెలియదు. సాధారణంగా, తిప్పతీగను గిలోయ్ కషాయం, గిలోయ్ జ్యూస్ మరియు గిలోయ్ పౌడర్ లాగా మూడు రూపాల్లో ఉపయోగించవచ్చు. ఈ రోజుల్లో, గిలోయ్ సారం మరియు గిలోయ్ రసం మార్కెట్లో సులభంగా లభిస్తాయి. ఇంట్లో గిలోయ్ జ్యూస్ తయారు చేయడం సులభం. కాండాన్ని కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని, వాటిని రోటిలో చూర్ణం చేయండి, తరువాత గ్రైండర్‌లో వేసి, నీటిని జోడిరచి గ్రైండ్ చేసాక తడి గుడ్డ సహాయంతో వడకట్టగా వచ్చిన రసాన్ని వాడుకోవచ్చు.
సన్నని మంటపై ఒక పాత్రలో చెంచాడు కాండం పొడిని మరిగించి, ఈ మిశ్రమాన్ని ఒక కప్పుకు సగానికి తగ్గించేంత వరకు కలిపి అందులో సుమారు 2-3 పొడవైన మిరియాల ముక్కలను జోడిరచి బాగా కలపండి, రుచి మరీ చేదుగా ఉంటే తేనెను జోడిరచుకోవచ్చు. భవిష్యత్తు ఉపయోగం కొరకు గాలి చొరబడని సీసాలో కూడా నిల్వ చేయవచ్చు.
ఈ రెండు ప్రక్రియల ద్వారా గిలోయ్ కషాయం తయారు చేసుకునే విధానం: కొన్ని తాజా గిలోయ్ ఆకులు లేదా కాండం తీసుకొని వాటిని నీటిలో (400 మి.లీ), నీరు నాలుగింట ఒక వంతుకు తగ్గే వరకు మరిగించి, వచ్చిన ద్రవాన్ని చల్లబరుచి వడకట్టాలి. ఒకవేళ తాజా గిలోయ్ ఆకులు లేదా కాండం లభ్యం కానట్లయితే, ఏదైనా ఆయుర్వేద దుకాణం నుండి గిలోయ్ పొడిని కొనుగోలు చేయవచ్చు, ఇది ఆయుర్వేద దుకాణాలలో లభ్యమవుతుంది. 1 టేబుల్ స్పూన్ పొడిని ఉపయోగించి 2 కప్పుల నీటిలో ఘనపరిమాణం నాలుగో వంతుకు తగ్గేంత వరకు మరిగించి, వడకడితే కషాయం తయారైనట్లే. ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించడానికి గిలోయ్ యొక్క తాజా ఆకులను కూడా ప్రతిరోజూ నమలవచ్చు.
గిలోయ్ యొక్క రోజువారీ మోతాదులు:
గిలోయ్ జ్యూస్ : 2-3 టీస్పూన్ల జ్యూస్, రోజుకు ఒకటి లేదా రెండుసార్లు.
గిలోయ్ చూర్ణ: రోజుకు రెండుసార్లు 1/4-1/2 టీస్పూన్.
గిలోయ్ కషాయం: దీనిని రోజుకు రెండుసార్లు త్రాగాలి (భోజనం మరియు విందుకు ముందు లేదా తరువాత).
గిలోయ్ టాబ్లెట్: రోజుకు రెండుసార్లు 1-2 మాత్రలు.
గిలోయ్ క్యాప్సూల్: రోజుకు రెండుసార్లు 1-2 క్యాప్సూల్స్.
-(ప్రణయ్ కుమార్ కడారి, అజయ్ గుంటి, రాజు కచ్చు)
Also Read: Medicinal Plant: సుగంధ తైల మొక్కల ప్రాముఖ్యత.!
Must Watch: