మత్స్య పరిశ్రమ

Techniques In Fish Farming : చేపల పరిరక్షణలో మెళుకువలు.!

0
Fish Farming
Fish Farming

Techniques In Fish Farmingమన రాష్ట్రంలో మత్స్య సంపద సహజనీటి వనరుల ద్వారా, కృత్రిమ పెంపకం ద్వారా లభిస్తోంది. నదులు, బ్యాక్ వాటర్స్ కెనాల్స్ రిజర్వాయర్లు, సముద్రతీర ప్రాంతం సహజ వనరులు కాగా, చెరువులు, కుంటలు కృత్రిమ పెంపక వనరులు. అనాదిగా మత్స్య సంపద మనుషుల ఆహార అవసరాలను తీర్చుతోంది. మత్స్య సంపద ద్వారా మానవాళికి ఎంతో విలువైన పోషకాలు చౌకగా లభిస్తున్నాయి. అంతేగాక ఇది ఎంతో మందికి జీవనోపాధిని కూడా కలిగిస్తోంది.

Techniques In Fish Farming

Techniques In Fish Farming

క్షీణతకు కారణాలు: సహజనీటి వనరుల్లో మత్స్య సంపద రోజురోజుకు గణనీయంగా తగ్గిపోతోంది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నా అందులో ప్రధానమైన కారణాలు మూడు.
అవి :
1. మితిమీరి అన్ని సైజుల చేపలను విచ్చలవిడిగా, విచక్షణ రహితంగా పట్టుకోవడం.
2. సంవత్సరం పొడవునా చేపల వేటను నిరంతరంకొనసాగించడం.
3. చేపల వేటలో అతి చిన్న రంధ్రాలుండే వలలను, నిషేధించిన వలలను విరివిగా ఉపయోగించడం.

చేపల వేట సమయంలో చిన్నా, చితక చేపల్ని పట్టేయడం వల్ల ముందుముందు అవి పెరిగి సంతానాభివృద్ధి చెందడానికి అవకాశం లేకుండా పోతుంది. అంతేగాక చేపలన్నిటినీ తుడిచినట్టు పట్టడం వల్ల కూడా తరతరాలుగా దేవలు పట్టి బతికే కుటుంబాలకు, ముందుముందు చేపలు లేకుండాబోయే ప్రమాదం ఏర్పడవచ్చు. కాబట్టి వీటి పరిరక్షణ ఎంతో ముఖ్యం.

పరిరక్షణకు సూచనలు: వేపల వేటలో మరీ సన్నటి రంధ్రాలు గల వలలనూ, లాగుడు వలలనూ, ఇరగ వలలనూ ఎట్టి పరిస్థితిలోను ఉపయోగించకూడదు (పటం. 1) ఎందుకంటే వీటిలో మరీ చిన్న సైజు చేపలు పడతాయి. కాబట్టి వీలైనంత వరకు నిశ్చల వలలనూ, పెద్ద రంధ్రాలుగల వలలను మాత్రమే వాడాలి.ఈ చేపల వేటలో చేపపిల్లల్నిగాని, చిన్నసైజు చేపలనుగాని ఎట్టి పరిస్థితిలోనూ పట్టరాదు. వీలైనంతవరకు పెద్దసైజు చేపలను మాత్రమే పట్టుకోవాలి (పటం. 2). ఈనాటి పిల్ల చేపే రేపటి పెద్ద చేప అనే విషయాన్ని మత్స్యకారులందరూ గుర్తుంచుకొని మెలగాలి.ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు మాసాల్లో చేపల వేట చేయరాదు.

Fish Breading in July and August

Fish Breading in July and August

Also Read: Procedures for Fish Storing: చేపలను పట్టుబడి చేసిన తరువాత నిల్వ చేయు విధానాలు.!

ఎందుకంటే ఈ మాసాల్లో చేపలు బ్రీడింగ్ చేస్తాయి. ఈ సమయంలో చేపలవేట చేస్తే బ్రీడింగ్కు విఘాతం కలుగుతుంది. తత్ఫలితంగా చేపల సహజ ఉత్పత్తి ఆగిపోయి సహజవనరుల్లో చేపల ఆటోస్టాకింగ్ ప్రక్రియ ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ మాసాలను క్లోజింగ్ సీజన్ గా పరిగణించి చేపల వేటను నిషేధించాలి.

ప్రభుత్వం నిషేధించిన వల(అల్వి)లతో ఎట్టి పరిస్థితిలోను చేపల వేట చేయరాదు. ఇది చట్టవిరుద్ధం అనే విషయాన్ని అందరూ గ్రహించాలి. నిషిద్ద వలల వేట తాత్కాలికంగా లాభం కలిగించినా భవిష్యత్తును అంధకారం చేస్తుందన్న వాస్తవాన్ని అందరూ తప్పక గుర్తించాలి. సహజ వనరుల్లో చేపల వేట చేసే మత్స్యకారులందరూ, మత్స్యశాఖ అధికారులు చేసిన సూచనలను విధిగా పాటించాలి. అప్పుడే మత్స్య సంపదకు ఎలాంటి కొరత ఏర్పడక, చేపల వేట లాభదాయకంగా ఉంటుంది. మన చేపలే మన సంపద అనే విషయాన్ని మత్స్యకారులందరూ. విధిగా గ్రహించి, సహజ వనరుల్లో అంతరించి పోతున్న మత్స్య సంపదను పరిరక్షించాలి. భావితరాలవారికి ఈ మత్స్య సంపదను అందించవలసిన ఆవశ్యకత మనపైన ఉంది. కాబట్టి తాత్కాలిక ప్రయోజనాన్ని ఆశించకుండా, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి.

-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171

Also Read: Salt Water Fish Farming: ఉప్పు నీటిలో చేపల పెంపంకం.!

Also Watch: 

Leave Your Comments

Techniques in Fishing: చేపలు పట్టడం లో మెళుకువలు..!

Previous article

Health Benefits of Chicken: కోడి మాంసం తో ఎన్నో ఉపయోగాలు.!

Next article

You may also like