Techniques in Fishing: సరియైన ఏర్పాట్లు చేసుకొనక పట్టుబడి అయిన చేపలను ఎక్కువసేపు ఎండలో కుప్పలుగా పోసి వుంచడం, సరిపడే ఐస్ లేక లేదా ప్యాకింగ్ సిబ్బంది లేక ఆలస్యంగా ప్యాకింగ్ చేయడం వల్ల చేపల నాణ్యత దెబ్బతింటుంది. పట్టుబడి అయిన చేపలను మంచినీటితో శుభ్రపరచక పోవడం, నేలపై ఇష్టం వచ్చినట్లు విసిరివేయడం, గాయపరచడం, గ్రేడింగ్ చేయకపోవడం, సరిపడా బస్‌లో పెట్టకపోవడం వల్ల కూడా చేపల నాణ్యత తగ్గిపోతుంది. ఫలితంగా గిట్టుబాటు ధర లభించక నష్టాలబారిన పదాల్సి వస్తుంది. కావున చేపల పట్టుబడిలో ఈ క్రింది అంశాలను విధిగా పాటించాల్సి వుంటుంది.
పెట్టుబడి ముందు: చేపలు పట్టుబడికి ముందు AMA ఒక రూపొందించుకోవాలి. అన్నింటిని సమకూర్చుకున్న తర్వాతనే పట్టుబడిని ప్రారంభించాలి. చేపలు పట్టే ఒక రోజు ముందు కావాల్సిన వలలు, సరిపడా మనుషులు, తగినంత ఐస్, ప్లాస్టిక్ ట్రేలు, థర్మాకోల్ బాక్సులు, టార్పాలిన్, షీట్స్, టెంట్ వగైరా వంటి వాటిని సమకూర్చుకోవాలి.
పట్టుబడిలో: చేపలు అధిక ఉష్ణోగ్రతల్లో త్వరగా పాడైపోతాయి. కాబట్టి వీలైనంత వరకు చేపల పట్టుబడిని చల్లటి వేళలో అంటే ఉష్ణోగ్రత తక్కువగా వుండే ఉదయం లేదా సాయంత్ర వేళలో చేయాలి. సత్వర పట్టుబడికిగాను తగినంత కూలీలను వినియోగించుకోవాలి. పట్టుబడి ఆలస్యమైతే తర్వాతి ప్రక్రియ కూడా ఆలస్యమై అస్తవ్యస్తమవుతుంది. కావున పట్టుబడి సకాలంలో జరగాలి.
పట్టుబడి తర్వాత: పట్టుబడి అయిన చేపలను మంచినీటిలో శుభ్రపరచి, టార్పాలిన్ కవర్‌పై మట్టి తగలకుండా పోయాలి. దీనిపై పట్టుబడి ఎండ తగలకుండా టెంట్ వేయాలి. చేపల ప్యాకింగ్ పట్టుబడి అలస్యం అయ్యేలా వుంటే చేపలపై బస్ చల్లాలి. వీటిపై నష్టాలను ఇంకో కవర్‌ను కప్పాలి.చేపలు పట్టే చెరువు దగ్గరకు చేపలను రవాణా చేసే పెద్ద వాహనాలు దారి సరిగాలేక రానట్లయితే, పట్టుబడి అయిన చేపలను ట్రాక్టర్ల సహాయంతో లేదా చిన్న చిన్న ట్రాలీ ఆటోలతో పెద్ద వాహనాల దగ్గరకు చేర్చాలి. ఈ రవాణాలో కూడా చేపలను తక్కువ పరిమాణం గల ఐస్ చల్లి తీసుకెళ్ళడం అన్ని విధాల శ్రేయస్కరం.
పట్టుబడి అయిన చేపలను సైజుల వారీగా గ్రేడింగ్ చేసుకొని త్వరత్వరగా తూకం చేసి, ట్రేలలో సరిపడే ఐస్ వేసి ప్యాకింగ్ చేయాలి. గాయపడిన చేపలను మంచిగా వున్న చేపల నుంచి వేరు చేసి వీటిని విడిగా ప్యాక్ చేయడం మంచిది.సుమారు 20 గంటల్లోగా మార్కెటింగ్ చేసే చేపలను ప్లాస్టిక్ ట్రేలల్లో మరియు 30 గంటల్లో లేదా ఆపైన మార్కెటింగ్ చేసే చేపలను థర్మాకోల్ బాక్సుల్లో ప్యాక్ చేయాలి.చేపల ప్యాకింగ్‌లో పొడి (క్రషర్) చేసిన ఐస్‌ను వాడటం మంచిది. ట్రేలలో చేపలను, ఐస్‌ను 1:1 నిష్పత్తిలో వేయాలి. అంటే ఒక ట్రేలో 50 కిలోల చేపలకు 50 కిలోల బస్‌ను వేయాలి.ఐస్ మరియు చేపలను బాక్స్/ట్రేలలో ఒక వరసలో వేయాలి. అనగా మొదటి వరుస ఐస్ దానిపై చేపల వరస * బస్ వరస (లేయర్) + చేపలు + ఐస్ వరసగా వేసి ప్యాక్ చేయాలి.సేవల ప్యాకింగ్ ను చెట్టు నీడలో లేదా టెంట్ నీడలో చేయాలి. ప్యాక్ చేసిన చేపల ట్రేలను లేదా బాక్సులను వాహనంలోకి సరిపడినన్ని వరుస క్రమంలో ఎక్కించాలి.
Also Read: Fish Farming: చేపల ఉత్పత్తిని పెంచేందుకు జార్ఖండ్ ప్రభుత్వం ప్రణాళికలు
Musta Watch:
-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171