చీడపీడల యాజమాన్యం

Managing Bird Damage in Crops: వివిధ పంటలలో పక్షుల వలన కలిగే నష్టం మరియు వాటి యాజమాన్యం.!

1
Managing Bird Damage in Agriculture
Managing Bird Damage in Agriculture

Managing Bird Damage in Crops: చాలా రకాలైన పక్షులు వివిధ ఆహార పంటలలో కంకులను, గింజలను తిని నష్టం కలిగిస్తాయి. వీటితో బాటు పండ్లు, కూరగాయ పంటలకు కూడా నష్టం చేస్తాయి. అవి ఆహారంగా తిన్నదానికంటే ఎక్కువ పరిమాణంలో నష్టం కల్గిస్తాయి.

వివిధ పంటలకు నష్టం కలిగించే పక్షులు:

కాకి – కార్వస్ జాతులు : ఇవి సర్వ భక్షకులు. గోధుమ, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, అత్తిపండు, మల్బరి పండ్లు, మిరపకాయలకు నష్టం కల్గిస్తాయి.

చిలుక – సిట్టాక్యులా సైనోసెఫాలిస్ : ఇవి సాధారణంగా పండ్లని తింటాయి. కానీ మొక్కజొన్న, జొన్న, సజ్జ, గోధుమ, బార్లీ గింజలను కూడా తింటాయి. వెన్నులను కత్తిరించుకొని పోతాయి.

పిచ్చుక – పాసర్ డొమెస్టికస్: ఇవి జొన్న. మొక్కజొన్న, సజ్జ గింజలను మెత్తటి పండ్లను, ఆకుకూరలను తింటాయి.

పావురం కొలంబ లివియా: చాలా రకాల పంటల గింజలను తింటాయి.పసుపు రంగు మెడ కలిగిన పిచ్చుక ఎక్కువగా గోధుమ, బార్లీ పంటలకు నష్టం చేస్తుంది.

మైనా – ఎక్రిడోథెరస్ ట్రిస్టిస్: ఇవి గింజలను, పండ్లను, కూరగాయలను తింటుంది. గోరింక (Rosy Pastor) – స్టర్ఫస్ రోజియస్ ఇవి ధాన్యపు గింజలను తింటాయి.

బాయా (లేదా) వీవర్ పక్షి (గిజ్జిగాడు) ప్లాసియస్ ఫిలిప్పైనస్ ఇవి ధాన్యపు గింజలను తింటాయి. పక్షులు పంటలకు వివిధ దశలలో నష్టం కలుగజేస్తాయి. ముఖ్యముగా విత్తిన వెంటనే విత్తనాలను తినివేస్తాయి, నారు మొక్కలను పెకలించి వేస్తాయి. పాలు పోసుకొనే దశలోను మరియు పక్వ దశలో గింజలను తింటాయి.విత్తిన వెంటనే నీటిలో వానిన మొలకెత్తుతున్న విత్తనాలను కూడా ఏరుకుని తింటాయి.

Also Read: Mungi Insect in Rice: వరి పంటకు నష్టం కలిగిస్తున్న మొగిపురుగు ను ఇలా నివారించండి.! 

Managing Bird Damage in Crops

Managing Bird Damage in Crops

చిలుకలు మొక్కజొన్నలో మగ పుష్పగుచ్చంలోని కేశాలు, పుప్పొడిని తిని నష్టపరుస్తాయి. అలాగే లేత కండెలపై నుండే పొరలను తొలగించి లోపలి గింజలను తింటాయి. చిలుకలు ప్రొద్దుతిరుగుడు పువ్వులోని లేత గింజలకు విపరీతంగా నష్టం కలిస్తాయి.

యాజమాన్యం: ఒక పద్ధతిని మాత్రమే ఉపయోగించి పక్షులను నివారించలేము, అందుబాటులో అన్ని పద్ధతులని మేళవించి మాత్రమే వాటి నష్టాన్ని తగ్గించాలి.పంటల పొలాల చుట్టు పక్షులకు ఆవాసయోగ్యం కాకుండా పరిసరాలను ఉంచినట్లయితే ముఖ్యంగా వాటికి గూళ్ళు కట్టుకొనే అవకాశం లేకుండా, చెట్లను లేకుండా చూసుకున్నట్లయితే కొంతవరకు వీటి వలన నష్టాన్ని తగ్గించుకోవచ్చు.

యాజమాన్యం: ఒక పద్ధతిని మాత్రమే ఉపయోగించి పక్షులను నివారించలేము. అందుబాటులో అన్ని పద్ధతులని మేళవించి మాత్రమే వాటి నష్టాన్ని తగ్గించాలి.పంటల పొలాల చుట్టు పక్షులకు ఆవాసయోగ్యం కాకుండా పరిసరాలను ఉంచినట్లయితే ముఖ్యంగా వాటికి గూళ్ళు కట్టుకొనే అవకాశం లేకుండా, చెట్లను లేకుండా చూసుకున్నట్లయితే కొంతవరకు వీటి వలన నష్టాన్ని తగ్గించుకోవచ్చు. వీటిని పారద్రోలడానికి పలు విధాలైన పరికరాలను ముఖ్యముగా శబ్ధం చేసేవి, వాటి దృష్టిని ఇబ్బంది పెట్టేవి, కొన్ని రసాయనాలను ఉపయోగించి చేపట్టవచ్చు.

దృష్టిని ఇబ్బంది కలిగించే వాటిలో ముఖ్యమైనవి రిప్లక్టివ్ రిబ్బన్లు. వీటిని పంటపైన 1/2-1 మీటరు ఎత్తులో, మద్య మధ్యలో 30 మీటర్లకి ఒక మెలితిప్పి, అడ్డంగా సమాంతరముగా ప్రతి 3-5 మీటర్లకు అమర్చుకొన్నట్లయితే పక్షుల నుండి పంటను కాపాడవచ్చు.ఖాళీ డబ్బాలను రాళ్ళతో నింపి మ్రోగించటం ద్వారా గాని, నోటితో శబ్ధాలు చేయడం ద్వారా గాని, పక్షులను పారద్రోలటానికి ఉపయోగించే తుపాకీలను పేల్చటం ద్వారా గాని వీటినుండి పంటను కాపాడుకోవచ్చు.ప్రధాన పంటల చుట్టు పక్షులకు ప్రత్యామ్నాయ ఆహార పంటలను పెంచడం ద్వారా కూడా వాటివలన జరిగే నష్టాన్ని కొంతవరకు అరికట్టవచ్చు. ప్రధాన పంటను కొంత విస్తీర్ణంలో కాక ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేపట్టినట్లయితే వీటివలన జరిగే నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.

Also Read: Techniques in Paddy Drying: ధాన్యం ఆరబెట్టుటలో కొన్ని మెళుకువలు.!

Also Watch:

Must Watch:

Leave Your Comments

Mungi Insect in Rice: వరి పంటకు నష్టం కలిగిస్తున్న మొగిపురుగు ను ఇలా నివారించండి.! 

Previous article

African gall Sickness in Cattles: పశువులలో వచ్చే ఆనాప్లాస్మోసిస్ వ్యాధి ని ఇలా నయం చెయ్యండి.!

Next article

You may also like