Mango cultivation: మామిడి రాష్ట్రoలోని అన్ని ప్రాంతాలలో పండించినప్పటికీ, ముఖ్యంగా ఖమ్మం, కరీంనగర్ మెదక్ (మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట) రంగారెడ్డి (రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్) ఆదిలాబాద్ (ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమరంభీమ్) మరియు నల్గొండ (నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి) జిల్లాలలో సాగుచేస్తున్నారు.మామిడి సాగుకు మన రాష్ట్రంలోని వాతావరణము చాలా అనుకూలంగా ఉండి మంచి నాణ్యమైన దిగుబడి ని ఇస్తుంది. రాష్ట్రoలో పండించే మామిడి పండ్లు మన దేశంలోనే కాక ఇతర దేశాల వారు కూడా దిగుమతి చేసుకొని ఇష్టంగా తింటున్నారు.
దిగుబడి క్షీణతకు గల ప్రధాన కారణాలు : తోటను వేసుకునే ముందు నాణ్యమైన మొక్కలను ఎంచుకోకపోవడం అధికశాతo తోటలలో, ఎత్తు ఎక్కువ పెరిగే రకాలను సాగుచేయటంతో కొమ్మ కత్తిరింపులు చేయలేకపోవడం.సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించకపోవడం,సూక్ష్మ పోషక యాజమాన్యం పాటించకపోవడం,క్రమం తప్పిన నీటియాజమాన్యం,సరియైన సమయములో చీడపీడలను నివారించక పోవడo,వయస్సు పైబడిన మామిడి తోటలుకోతకు ముందు మరియు కోతకు తరువాత సరైన పద్ధతులను పాటించకపోవడం మొదలగునవి.
పునరుద్దరణ: మనరాష్ట్రంలో మామిడి తోటలు అధిక శాతం లేత తోటలు (10 నుండి 20 సం॥ల వయస్సు) ఉన్నప్పటికీ ముదురు మామిడి తోటలు (25 నుండి 30 సం||ల) కూడా ఎక్కువ శాతంలో ఉన్నాయి. ముదురు మామిడి తోటలలో ఉత్పాదకత ప్రతి సంవత్సరం గణనీయంగా తగ్గుతూ వస్తుంది. ముదురు మామిడి తోటలలో దిగుబడి, కాయ నాణ్యత తగ్గిపోవుటకు గల ముఖ్య కారణాలు.చెట్ల పాదుల్లో, చెట్లు మొదలుపై సూర్యరశ్మి పడకపోవటం వలన చీడపీడలు ఆశించి ఫలసాయం తగ్గుతుంది, మామిడి తోటల్లో చెట్లు ఏటవాలుగా, నిటారుగా పెరగటం వలన సస్యరక్షణ యాజమాన్యం కష్టసాధ్యం కావడం ఇటువంటి ముదురు తోటలను పునరుద్ధరణ ప్రక్రియ ద్వారా అధిక దిగుబడులు పొందేటట్లు సాంకేతిక యాజమాన్య పరిజ్ఞానం ద్వారా మరల నూతన మొక్కలవలే అధిక దిగుబడులు లభిస్థాయి.
చెట్టు మొదలు భాగం నుండి 4 m ఎత్తులో మొత్తం కొమ్మలను కత్తిరింపులు చేయాలి. చెట్టు ప్రధాన కాండంపైన 3 నుండి 4 ద్వితీయ క్రమ కాండములను ఎంపిక చేసుకొని, చెట్టు ఆకృతి మారకుండ కత్తిరింపులు చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న కొమ్మలను కత్తిరింపులు చేయునపుడు బెరడు, కొయ్య చీలకుండా ముందుగా కొమ్మ అడుగు భాగం 10 నుండి 20 cm లోతు కోసి తర్వాత పై భాగం కొయ్యాలి. దీనికి సరైన సమయం నవంబర్ నుండి డిసెంబర్. ఈ విధంగా కత్తిరించిన చెట్టకు కొత్త రెమ్మలు, కొమ్మలు తొడిగి, కొమ్మలు ముదిరి కాపు వచ్చుటకు 2 నుండి 3 సంవత్సరాలలో అధిక దిగుబడులు లభిస్థాయి.
Also Read: Mango Pest Control: మామిడిలో చీడపీడల నివారణ చర్యలు.!
మామిడిలో లాభాలు రెట్టింపు చేయుటకు తీసుకోవల్సిన చర్యలు: మామిడిలో లేత తోటలు వేసుకునేటప్పుడు అధిక సాంధ్రతలో (5మీ×5మీ) 160 మొక్కల ఎకరానికి ఉండేటట్లుగా వేసుకోవాలి. దీని వలన ఉత్పాదకత పెరుగుతుంది మరియు లాభాలు రెట్టింపు అవుతాయి.మొక్కలకు నీరును డ్రిప్ పద్ధతి ద్వారా ఇచ్చుకుంటు చెట్ల పాదులు మల్చింగ్ చేయడం ద్వారా దిగుబడులు పెరుగుతాయి.
పైన పేర్కొనబడిన రెండు పద్ధతులను ఆచరించడం ద్వారా దిగుబడులు పెరిగి ఆదాయం రెట్టింపు అవుతుంది.క్రమం తప్పకుండ కత్తిరింపులను జూన్ – జులై మాసంలో చేసుకోవాలి.సిఫారసు చేసిన ఎరువులను క్రమం తప్పకుండ ప్రతి సంవత్సరం వాడాలి.సూక్ష్మధాతు లోప నివారణకు జింక్ మరియు బోరాన్ ప్రత్యేకంగా సంవత్సరంలో 3, 4 సార్లు సిఫారసు మేరకు పిచికారి చేసుకోవాలి.పొటాషియం నైట్రేట్ 10గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పూతకు ముందు మరియు పిందెలు గోళీకాయ సైజులో ఉన్నపుడు క్రమం తప్పకుండా ప్రతి యేట పిచికారి చేసుకోవాలి..
కాయ పెరుగుదల దశలో తప్పని సరిగా డ్రిప్ పద్ధతి ద్వారా చెట్టుకు సిఫారసు మేరకు నీరు అందించాలి.తోటల యాజమాన్యం ఎగుమతులకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులు (పురుగు మందుల పిచికారి, కాయ కోత) పాటించాలి.
-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171
Also Read: Mango Ripening: మామిడికాయలు మాగబెట్టడానికి కాల్షియం కార్బైడ్ వాడకం అనర్ధo
Must Watch: