పశుపోషణ

Theileriosis in cattle: పశువులలో వచ్చే థైలేరియాసిస్ వ్యాధి.!

0
Theileriosis in cattle
Theileriosis in cattle

Theileriosis in cattle : ఈ వ్యాధి పరాన్న జీవుల వలన పశువులలో కలుగు ఒక అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి. ఈ జీవి తన జీవిత క్రమంలో పశువుల రక్తంలో ఎరిత్రోసైటిక్ దశలో గోళాకారంగా ఎర్ర రక్తకణాలలో ఉంటుంది. కైజాంట్ దశలో ఉన్నప్పుడు పశువుల లింపోసైట్స్, మోనోసైట్స్ మరియు లింఫ్ గ్రంథులలో ఉంటుంది. ఈ దశలోని జీవిని జీమ్సా స్టెయిన్ వర్ణకము చేసి మైక్రోస్కోప్ తో పరిశీలించినప్పుడు నీలిరంగులో ఇవి కనబడుతాయి. వీటినే కాక్స్ బ్లూ బాడిస్ అని అంటారు. ఈ వ్యాధిలో ప్రధానంగా జ్వరం, రక్తహీనత, లింఫ్ గ్రంథుల వాపు ఉంటుంది.

Theileriosis in cattle

Theileriosis in cattle

అధిక పాల దిగుబడినిచ్చే విదేశీ మరియు సంకరజాతి ఆవులలో ఈ వ్యాధి అధికంగా కనబడుతుంటుంది. అన్ని వయస్సుల పశువులలో ఈ వ్యాధి వచ్చినప్పటికిని, పాలు ఇచ్చే పడి పశువులలో ఈ వ్యాధి ప్రభావం చాలా ఎక్కువ. ఎండాకాలం మరియు వర్షాకాలంలో ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

హైలోమా రకానికి చెందిన పిడుదుల ద్వారా ఈ వ్యాధి ఒక పశువు నుండి మరోక పశువుకు వ్యాపిస్తుంటుంది. కొన్ని సందర్భాలలో ఇంట్రా యుటరైన్ మార్గం ద్వారా కూడా ఈ వ్యాధి ఇతర పశువులకు వ్యాపించే అవకాశం కలదు.హైలోనూ రకానికి చెందిన పిడుదుల ద్వారా ఈ వ్యాధి ఒక పశువు నుండి మరోక పశువుకు వ్యాపిస్తుంటుంది. కొన్ని సందర్భాలలో ఇంట్రా యుటరైన్ మార్గం ద్వారా కూడా ఈ వ్యాధి ఇతర పశువులకు వ్యాపించే అవకాశం కలదు.

వ్యాధి వ్యాప్తి:- వ్యాధి గ్రస్త పశువులను టిక్స్ కుట్టినపుడు ‘స్పోరో జాయిట్స్’ వాటి లాలాజలంలోకి చేరి, అవి తిరిగి ఆరోగ్యవంతమైన పశువులను కుట్టినపుడు ఈ స్పోరో జాయిట్స్ వాటి రక్తంలో చేరి, ఎర్ర రక్తకణములలో పెరిగి, వాటిని విచ్చిన్నం చేసి, జాండిస్ లక్షణాలు కలిగిస్తుంది. ఫైజాంట్ దశలో ఉన్నప్పుడు టాన్సిల్స్, ప్లీహం మరియు అన్ని రకాల లింఫ్ గ్రంథులలోని లింఫోసైట్స్లో చేరి వాటిని నాశనం చేస్తుంది. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది.

Also Read: Lung Plague Disease in Cows: ఆవులలో కంటేజియస్ బొవైన్ ఫ్లూరో న్యూమోనియా ఎలా వ్యాపిస్తుంది.!

లక్షణాలు :- తీవ్రమైన జ్వరం (40.5-41-5°F), రక్తహీనత, జిగురు రక్తంతో కూడిన విరోచనాలు, వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. రూమెన్ కండరాల కదలిక తగ్గిపోతుంది. శరీరంలోని లింఫ్ గ్రంథులు వాచిపోయి వుంటాయి. ఆకలి ఉండదు, చికాకుగా ఉంటుంది. చర్మం పొడి బారి, వెంట్రుకలు ఊడిపోతుంటాయి. కళ్ళు గుండ్రంగా తిప్పుతూ కంటి నుండి నీరు కారుతుంటుంది. ఊపిరితిత్తులలో సిరి చేరి, న్యూమోనియా లక్షణాలుంటాయి. ముక్కు నుండి నీరు కారుతుంటుంది. బైలురుబిన్యూరియా మరియు జాండిస్ లక్షణాలుంటాయి. రోజులు గడచిన కొలది పశువులు చాలా వరకు బలహీనమై బక్క చిక్కి పోయి, చివరకు చనిపోతుంటాయి.భుజాల దగ్గర మరియు దవడ క్రింద వున్న లింఫ్ గ్రంథులు వారి వుంటాయి.  ఊపిరితిత్తులలో నీరు చేరి, న్యూమోనియా లీజస్సును గమనించవచ్చు.  ప్లీహం, కాలేయం పరిమాణం పెరిగి ఉంటుంది.

  వ్యాధి చరిత్ర ఆధారంగా, వ్యాధి లక్షణాలు ఆధారంగా, వ్యాధి కారక చిహ్నాలు మరియు ఈ క్రింది ప్రయోగశాల పరీక్షల ఆధారంగా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు (1) Lymphnade biopsy smear examination for koch blue bodies (2) H.IT test, IFT, CFT, AGID, FAT test B. పరీక్షల ద్వారా కూడా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.

చికిత్స :- వ్యాధి కారకము నిర్మూలించుటకు చేయు చికిత్స :- (1) Buparvoquine Dose 25mg 1kg b.w or Butalex -(zydus) -20ml ఇచ్చినట్లైతే వ్యాధి కారకాన్ని పూర్తిగా నిర్మూలించవచ్చును. ఈ ఔషధం ఒక మోతాదు సరిపోతుంది. బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆంటిబయోటిక్ ఔషధాలు టెట్రాసైక్లిన్స్, ఆక్సిటెట్రాసైక్లిన్స్ మరియు క్లోరో టెట్రాసైక్లిన్స్ వంటివి 3-5 రోజుల పాటు ఇచ్చినట్లైతే మంచి ఫలితం ఉంటుంది.జ్వరం తగ్గించుటకు అంటి పైరెటిక్స్ ఔషధాలను, డయేరియాను తగ్గించుటకు అంటే డయేరియల్స్ ఔషధాలను, ఇన్ఫ్లమేషన్ తీవ్రతను తగ్గించుటకు అంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధాలను ఇవ్వాలి. పశువు యొక్క స్థితిని బట్టి, అవసరం అయినటువంటి విటమిన్స్, మినరల్స్ మరియు సెలైన్ ద్రావణాలను ఇవ్వవలెను. మంచి పోషక పదార్థాలు గల ఆహారం ఇవ్వాలి. పశువులకు తగినంత విశ్రాంతి చాలా అవసరం.

Also Read: Candidiasis in Cows: పశువులలో కాండిడియోసిస్ వ్యాధినిఎలా నివారించాలి.!

Also Watch:

 -Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171

Leave Your Comments

Fowl Typhoid in Chickens: కోళ్ళలో ఫౌల్ టైఫాయిడ్ వ్యాధి.!

Previous article

Mungi Insect in Rice: వరి పంటకు నష్టం కలిగిస్తున్న మొగిపురుగు ను ఇలా నివారించండి.! 

Next article

You may also like