పశుపోషణ

Rhinosporidiasis in Cattle: పశువులలో రైనోస్పోరిడియోసిస్ వ్యాధి ఎలా సోకుతుంది.!

0
Rhinosporidiasis
Rhinosporidiasis

Rhinosporidiasis in Cattle: ఈ వ్యాధి రైనోస్పోరిడియోసిస్ ప్రజాతికి చెందిన శీలింధ్రాల వలన అన్ని రకాల పశువులలో ఆవులు, మేకలు, గుర్రాలు, గాడిదలు మరియు మనుషులకు కలుగు ఒక దీర్ఘకాలిక అంటువ్యాధి. ఈ వ్యాధిలో ప్రధానంగా ముక్కు రంధ్రాలలో గడ్డలు ఏర్పడి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులుంటాయి.వ్యాధి కారకం ఉన్న కుంటలలో, చెరువులలో ఈదడం వలన పశువులకు లేదా మనుషులకు నేరుగా ఈ వ్యాధి సోకుతుంది.

లక్షణాలు:-  ఈ వ్యాధి సుమారు 2-3 సంవత్సరాల వరకు పశువులకు అంటి పెట్టుకొని అలాగే ఉంటుంది. ముక్కు నుండి నీరు, చీము, జిగటగా ద్రవాలు కారుతూ ఉంటాయి. కొన్ని సార్లు ముక్కు నుండి రక్తంతో కూడిన నీరు కారుతుంటుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. గురక శబ్దం వినిపిస్తుంటుంది. ముక్కు రంధ్రాలలో పెసర గింజ ఆక్రుతిలో, వివిధ పరిమాణంలో గడ్డలు కనిపిస్తుంటాయి. ముక్కు రంధ్రాలలో పెసర గింజ ఆకారంలో ఉన్న బొబ్బలు లేదా గడ్డలు చూడవచ్చు.

Also Read: Diarrhea in Chickens: కోడి పిల్లలలో పుల్లోరం వ్యాధి ఎలా వస్తుంది.!

Rhinosporidiasis in Cattle

Rhinosporidiasis in Cattle

వ్యాధి నిర్ధారణ, చికిత్స:- పైన వివరించిన వ్యాధి లక్షణాలు, వ్యాధి కారక చిహ్నముల ఆధారంగా మరియు రైతు తెలిపే వ్యాధి చరిత్ర ఆధారంగా మరియు ప్రయోగశాల పరీక్షల ఆధారంగా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. ఈ వ్యాధిని ప్రధానంగా నాసల్ సిస్టోసోమియాసిస్, వీలర్జిక్ రైనైటిస్ వంటి వ్యాధులతో పోల్చి చూసుకోవలసి ఉంటుంది. ఈ వ్యాధిని ఔషదాల ద్వారా తగ్గించలేము. గడ్డలు లేదా బొబ్బలను శస్త్ర చికిత్స ద్వారా తొలగించాలి.

పశువులకు ఉపశమనం కలిగించుటకు అంటి ఇన్ ఫ్లమేటరీ ఔషదాలు ఇవ్వాలి. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు ఎదేని ఒక ఆంటిబయోటిక్ ఔషదాలు ఇవ్వవలసి ఉంటుంది.పశువులను కుంటల్లో, చెరువుల్లో ఈదకుండా చూడాలి. వ్యాధి వచ్చిన పశువులను మంద నుండి వేరు చెయ్యాలి.

Also Read: Vitamins and Minerals: జీవాల్లో విటమిన్ లు మరియు ఖనిజ లవణాల ప్రాముఖ్యత.!

Leave Your Comments

Diarrhea in Chickens: కోడి పిల్లలలో పుల్లోరం వ్యాధి ఎలా వస్తుంది.!

Previous article

Citrus Canker Disease: నిమ్మలో గజ్జి తెగులు.!

Next article

You may also like