Coriander Health Benefits: చక్కని సువాసన, కమ్మని రుచి కొత్తిమీర మీ సొంతం. మనం తినే ఆహార పదార్ధాల రుచిని ఇది రెట్టింపు చేస్తుంది.దీన్ని ఆహారంతో తీసుకోవడంతో పాటు జ్యూస్ గా తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని మీకు తెలుసా? ఇందులో విటమిన్ ఎ,సి, ఇ, కె లతో పాటు అనేక రకాలు అయినా పోషకాలు ఉన్నాయి.ప్రతి రోజు కొత్తిమీరా ను ఆహారం గా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!
కొత్తి మీర లో పీచు శాతం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆహారం లో తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే హాని కరమైన కొవ్వును తగ్గిస్తుంది.జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.శరీరంలో ఏర్పడే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే కాల్షియమ్ ఎముకలను దృఢ పరుస్తుంది.
కొత్తి మీరను తరచుగా తీసుకోవడం వల్ల కంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.ఒత్తిళ్లు మరియు మానసిక ఆందోళన ను తగ్గిస్తుంది.నిద్ర లేమి సమస్య లను కూడా దూరం చేస్తుంది. అంతే కాకుండా నోటిలో ఏర్పడే పూతనుమరియు పుండ్లను నివారిస్తుంది.నోటిలో హాని కరమైన క్రీములను నాశనం చేస్తుంది.చిగుళ్ల సమస్యలను నివారిస్తుంది.
Also Read: Mint Leaves Uses: పుదీనా వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు.!
నోటిలో ఏర్పడే అల్సర్లు ను కూడా తగ్గిస్తుంది. శరీరంలోని బ్యాడ్ కొలేస్ట్రాల్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో శరీరానికి అవసరమయ్యే ఆయిల్స్ రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుతుంది.షుగర్ వ్యాధితో బాధ పడే వారు కొత్తి మీర ను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఆకస్మాతుగా వచ్చే గుండె నొప్పులను అరికడుతుంది.
గుండె జబ్బులు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అధిక రక్త పోటును నివారిస్తుంది.దీన్ని తరచుగా తీసుకోవడం వల్ల కడుపులో ఏర్పడే వికారం మరియు వంతుల సమస్య నుండి కాపాడుతుంది. అంతే కాకుండా కడుపులో ఏర్పడే సమస్యలను నివారిస్తుంది.కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా కొత్తి మీర డయేరియా ను తగ్గిస్తుంది.ఆకలిని పెంచుతుంది. కాలేయ తీరును మెరుగుపరుస్తుంది. స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలు తగ్గిస్తుంది.ఇందులో ఉండే యాంటీ ఇన్ ప్లమెటరీ గుణాలు కిళ్ల నొప్పులను తగ్గిస్తుంది.
Also Read: Bottle Gourd Juice: అనేక వ్యాధులను దూరం చేసే సొరకాయ జ్యూస్.!