Infectious Anaemia in Chicken: యుక్త వయసు కోళ్ళలో సిర్కో వైరస్ వలన కలిగి, తీవ్రమైన అనీమియా, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వంటి లక్షణాలతో, ఇతర వ్యాధుల బారిన పడి కోళ్ళు చనిపోవడం జరుగుతుంటుంది.
ఈ వ్యాధి సిర్కో విరిడే కుటుంబానికి చెందిన సిర్కో వైరస్ వలన కలుగుతుంది. ఇది ఒక డి.ఎన్.ఎ. వైరస్. ఈ వైరస్ సాధారణంగా ఉపయోగించే డిస్ఇన్ఫెక్టెంట్స్కు మరియు ఉష్ణోగ్రతకు కూడా తట్టుకొని చాలా రోజుల వరకు పౌల్ట్రీ ఫారములలో జీవిస్తుంది. ఫలితంగా ఒక సారి వ్యాధి వచ్చిన ఫారములలో ఈ వ్యాధి తిరిగి అప్పుడప్పుడు కలుగుతుండుటను గమనించవచ్చు.ఈ వ్యాధిని ఇప్పటి వరకు కోళ్ళలో మాత్రమే గుర్తించుట జరిగిoది. ఇతర కోళ్ళలో ఈ వ్యాధి చిహ్నములను ఇప్పటి వరకు గుర్తింపలేదు.ఈ వ్యాధి వర్టికల్ గాను (బ్రీడర్స్ నుండి పుట్టే పిల్లలకు) మరియు హరీజెంటల్ ను, కలుషితమైన ఆహారము, గాలి ద్వారా కూడా ఆరోగ్యంగా ఉండే కోళ్ళకు వ్యాప్తి చెందుతుంటుంది. ఈ ఇంక్యుబేషన్ పిరియడ్ సుమారు 10-14 రోజులు వరకు ఉంటుంది.
వ్యాధి వ్యాప్తి: వ్యాధి కారక వైరస్ ఆరోగ్యంగా ఉండే కోళ్ళలో ప్రవేశించిన తరువాత, అది శరీరంలోని అన్ని లింఫాయిడ్ అవయవాలైన థైమస్, ప్లీహము, సికల్ టాన్సిల్స్, బర్సా వంటి అవయవాలలో పెరిగి, వాటిలోని లింఫాయిడ్ కణాలను విచ్చిన్నం చేస్తుంది. తదుపరి ఈ వ్యాధి కారకం ఎముక మజ్జలోనికి ప్రవేశించి, ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేయు కణాలను తీవ్రంగా విచ్చిన్నం చేస్తుంది. ఫలితంగా కోళ్ళ శరీరంలో ఎర్ర రక్తకణాల సంఖ్య తీవ్రంగా తగ్గిపోవుట వలన, తీవ్రమైన అనీమియా కలుగుతుంది. అందుకే ఈ వ్యాధిని చికెన్ ఇన్ఫెక్ష్యూయస్ అనీమియా పిలుస్తారు.
వ్యాధి లక్షణాలు: ఈ వ్యాధిలో ప్రధానంగా తీవ్రమైన అనీమియా ఉండుట చేత, కోడి శరీరంలోని అన్ని అవయవాలు పాలిపోయినట్లు తెల్లగా, చాలా బలహీనంగా ఉంటాయి. కోడి శరీరంలో రక్తం పూర్తిగా తగ్గిపోవుట వలన చర్మం క్రింద రక్తం కారిన చారలు కనిపిస్తుంటాయి. వ్యాధి నిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోవుట వలన, ఈ వ్యాధి బారిన పడిన కోళ్ళు ఇతర వ్యాధుల బారిన సులువుగా పడుతుంటాయి. ఫలితంగా కోళ్ళు చనిపోవుట జరుగుతుంటుంది. ఈ వ్యాధిలో మోర్టాలిటీ సుమారు 10-60 శాతం వరకు ఉంటుంది. వ్యాధి వచ్చి కోలుకున్న కోళ్ళు చాలా బలహీనంగా ఉంటాయి. పెరుగుదల లోపం ఉంటుంది.థైమస్ మరియు ఎముక మజ్జ పూర్తిగా కుషించుకొని పోయి ఉంటుంది. బర్బా అవయవము కూడా కుషించుకొనిపోయి ఉంటుంది. కాలేయం వాచిపోయి ఉంటుంది. ప్రావెంట్రి క్యూలస్లో రక్తపు చారలను గమనించవచ్చును. చర్మం క్రింద హిమారేజెస్ ను గమనించవచ్చు.
రైతు తెలిపే వ్యాధి చరిత్ర, పైన వివరించిన వ్యాధి లక్షణాలు మరియు వ్యాధి కారక చిహ్నముల మూలంగా ఈ వ్యాధిని కొంత వరకు ఊహించవచ్చు. ఈ వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారించుకొనుటకు ఏలిపా లేదా పి.సి.ఆర్ టెక్నిక్ పరీక్షలు ఉపయోగకరంగా ఉంటాయి.ఈ వ్యాధిని మారెక్స్ వ్యాధి, ఐ.టి.డి వ్యాధి, ఎరిట్రోబ్లాస్టోన్స్, ఐ.పి.హెచ్, మైకోటాక్సికోసిస్, సల్ఫనమైడ్ ఇస్టాక్సికేషన్ వంటి వ్యాధులతో సరిపోల్చుకొని మానుకొనవలసి ఉంటుంది. బయోస్ క్యూరిటీ పద్ధతులను ఖచ్చితంగా పాటించాలి. వ్యాధిలేని బ్రీడరు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని దేశాలలో ఈ వ్యాధికి టీకాను ఉపయోగిస్తున్నప్పటికీ, ఫీల్డ్ స్థాయిలో ఇంకా దీని పనితనమును ఖచ్చిత్తంగా నిర్ధారించవలసి ఉంది.
Also Read: Infectious Bursal Disease in Chickens: కోళ్ళలో గంబోరో వ్యాధి ని ఎలా నివారించాలి.!