Aster Amellus Cultivation: ఆకర్షణీయమైన నీలి రంగు పూలతో ఉండే డేసీ పూకాడలను ఈ మధ్య బొకేల తయారీలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. తెలుపు, గులాబీ, నీలి రంగు రకాలను పూల తోటలలో నాటుటకు కూడా అనువుగా ఉంటుంది.
నేలలు: నీరు ఇంకే అన్ని రకాల నేలలు సాగుకు అనుకూలం, సంవత్సరం పొడవునా నాటవచ్చు. అయితే జూన్-జూలై మాసాలు అనుకూలo.
రకాలు: ముదురు నీలం రంగులో ఉన్న డబుల్ రకం వాణిజ్య సరళిలో సాగుకు అనుకూలం.
ప్రవర్ధనం: బహువార్షికం, ఈ రకాలలో వచ్చే ప్రక్క పిలకలు ఎంపిక చేసుకుని 30×30 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. ఎకరాకు షుమారు 44,000 మొక్కల సాంద్రత ఉండే విధంగా బోదెలపై నాటుకోవాలి.
Also Read: Tinospora Cordifolia: తిప్పతీగలోని ఔషధ గుణాలు.!
ఎరువులు: ఎకరాకు సుమారు 8 టన్నుల పశువుల ఎరువు, 30 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం మరియు 24 కిలోల పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. మిగతా భాగం నత్రజనిని నాటిన 3 మరియు 6 నెలలకు పైపాటిగా వేయాలి.
అంతరకృషి మరియు నీటి యాజమాన్యం: మొక్కలు పెరిగే 2-3 నెలల వరకు కలుపు లేకుండా చూడాలి. నేల స్వభావం మరియు వాతావరణ పరిస్థితులను బట్టి వారానికి ఒకటి లేదా రెండు సార్లు నీటి తడులివ్వాలి. పొడవైన పూకాడలు 150 పి.పి.యం. జిబ్బరిల్లిక్ ఆమ్లం మొక్కలపై పిచికారి చేయాలి.
కోత మరియు దిగుబడి: మొక్కలు నాటిన 2 నెలల నుండి పూత ప్రారంభమవుతుంది. పూకాడలలో 75% పూలు విచ్చుకున్నప్పుడు కాడలతో కోయాలి. కోసిన వెంటనే కాడలను నీటిలో ఉంచాలి. 10-20 పూకాడలను కట్టలు కట్టి పేపరులో చుట్టి మార్కెట్కి తరలించాలి. ఎకరాకు 2-2.5 లక్షల పూకాడలు వస్తాయి.
Also Read: Heliconias Cultivation:హెలికోనియా సాగు కు అనువైన రకాలు.!