Rice Grain Moisture Content: కొన్ని పైర్లకు పంట కోత పక్వ లక్షణాలు:
వరి: గింజలు గట్టి పడి బీజ కవచం లేత పసుపు లేక లేత ఎరుపు రంగులోకి మారుతుంది.
వేరుశెనగ: కాయలు లోపలి భాగం నలుపు రంగు మచ్చలు ఏర్పడి గింజలు గులాబీ లేదా ఎరుపు రంగు కు మారి, గింజ నొక్కినపుడు నూనె వచ్చిన పంట కోత కు వచ్చి నట్లు గమనిం చాలి.
చెరకు: ఆకులు పసుపు పచ్చ గా మారుట, సుక్రోజు 10 శాతం కన్నా ఎక్కువ , మరియు బ్రిక్స్ రీడింగ్ 18 శాతం పైన ఉన్నపుడు నరకాలి.
పైరు కోత సమయం పంట కాలం, శీతోష్ణస్థితి, నత్రజని ఎరువుల వాడకం మొదలైన వాటిపై ఆధారపడుతుంది.
పంట కోత పద్ధతులు:
ఇవి రెండు రకాలు:
· మనుషులతో కోత
· యంత్రాలతో కోత
మనుష్యులతో (మానవ శక్తి) పంట కోయుటకు ముఖ్యమైన పరికరo కొడవలి. ఇది వంపు తిరిగి పదునైన రంపపు పల్ల అంచులను కలిగి ఉంటుంది. దీనిని ఉపయోగించి నేలకు దగ్గరగా కాండపు భాగము కొంత వదిలి (మోడు) కోస్తారు. ఈ పద్ధతి పంట పక్వత కు ఒకే సారి వచ్చు పంటలకు పాటిస్తారు. ఒకేసారి పక్వానికి రాకుండా పెరుగుదల గల పైర్లు(indeterminate) వాటి ఉత్పత్తుల పక్వ దశ కు వచ్చినపుడు వేరు వేరు సమయాల్లో కోయాలి. ఉదా: ప్రత్తి కపాస్ బాగా విచ్చుకున్నప్పుడు తీయాలి.
పెసర, మినుము, కాయ పక్వతకు రాగానే కోయాలి. అంటే 2-3 కోతలు కోయవచ్చు.కూలీల లోటు వలన, మరియు కోత ఒకేసారి వచ్చినపుడు, లేక కోత త్వరవ పూర్తి చేయుటకు యాంత్రిక పద్ధతిని ఆచరించాలి.
Also Read: Paddy Crop Protection: వరి పంటలో వచ్చే వివిధ రకాల దోమ రోగాలు మరియు వాటి నివారణ చర్యలు
వరి కోత యంత్రం: వరి ని కోసి పనలను ఒక క్రమం లో వేస్తుంది.
కంట్రీస్ హార్వెస్టర్ ఈ యంత్రంతో కోత, నూర్పు, తూర్పార బోయడం, జల్లించడం పూర్తయి సంచి లోకి ధాన్యంపడతాయి.
మినీ రైస్ కంటైన్: పరిశోధనా స్థానాల్లో చిన్న ప్లాటు లలో వేసే పైరును కోత, నూర్పు, విత్తనం సేకరణ కు ఉపయోగపడుతుంది.
సూర్పిడి మరియు తూర్పార బట్టుట:
మొక్కలు నుండి గింజలను / విత్తనాలను వేరు చేయుటను నూర్పిడి అంటారు. ధాన్యపు పంటలలో గింజలను మరియు గడ్డి ని వేరు చేస్తారు అపరాల పంటలలో కాయల నుండి గింజలను వేరు చేస్తారు. నూర్పిడి ని మనుష్యులతో, పశువులతో, ట్రాక్టర్ తో చేయవచ్చు.
తూర్పార బట్టుట
దాప్(పొల్లు, తాలు) నుండి గింజలను / విత్తనాలను వేరు చేసే ప్రక్రియ ను తూర్పార పోయడం అంటారు. దీనిని చాటతో గాలివాలు ని అనుసరించి ఎత్తు నుండి క్రిందకు ఎగర బోస్తారు. పొల్లు గింజలు తేలిక గా ఉండడం వల్ల గాలికి దూరం గా పడతాయి. గట్టి గింజలు దగ్గర లో రాశి గా పడతాయి.
ధాన్యం ఆరబెట్టుట
పైరు ల కోత సమయంలో తేమ 18 ఉండవలసిన తేమ శాతం 14% – 20 శాతం వరకు ఉంటుంది. చాలా పైరులకు చాలా కాలం నిల్వ చేయుటకు గింజలలో నిల్వ సామర్ధ్యం పెంచుటకు తేమను తగ్గించే ప్రక్రియను “ఆరబెట్టుట” అంటారు.
గింజలలో గల తేమ శాతం తగ్గించుట
ఆరబెట్టుట సూర్య రశ్మి తో లేక కృత్రిమంగా ఉష్ణ శక్తి ని ఉపయోగించి చేయవచ్చు. సాధారణంగా పే డ తో అలికిన నేలపై లేదా సిమెంట్ గచ్చు పై ఆరబోసి ప్రతి రెండు గంటల కొకసారి కలియబెట్టిన సమానం గా మరియు తొందరగా ఆరుతుంది. సాధారణంగా వివిధ పంటల ఉత్పత్తులను సురక్షిత తేమ స్థాయి కి తీసుకురావడానికి 4 – 5 రోజులు పట్టవచ్చు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత ల వల్ల 1 – 2 రోజులు పట్టవచ్చు.
వర్షాకాలం లో అధిక వర్షాల వల్ల, మరియు ఎక్కువ ఆర్ద్రత పరిస్థితుల్లో వరి ధాన్యం ను ఎండ బెట్టుట కష్టం. అటువంటి పరిస్థితుల్లో ప్రతి వంద కిలోల ధాన్యo కు పొడి చేసిన ఐదు కిలోల ఉప్పును కలిపితే ఉప్పు గింజల లోని తేమను శోషించి, ఉప్పు ద్రావణం గా రాశి బయటకు పోతుంది.కృత్రిమంగా ఉత్పత్తులను ఆరబెట్టుట కు నీటి ఆవిరి ని ఉపయోగిస్తారు. దీనిని సంవత్సరంలో ఏ సమయంలో నైనా చేయవచ్చు. కానీ ఈ పద్ధతి ఖరీదైనది.
Also Read: Paddy Gall Midge: వరిలో ఉల్లి కోడును ఎలా గుర్తించాలి.!