Pests and Diseases – బూడిద తెగులు:- ఈ వ్యాధి పాలిగొని అను శీలింద్రము ద్వారా వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా పైరు పూత దశ చేరుకొనే సమయంలో ఈ తెగులు ఆరంభమవుతుంది. ఆకుల మీద తెల్లని బూడిద చల్లినట్లు చిన్న చిన్న మచ్చలు ఏర్పడి అవి క్రమేపి పెరిగి ఆకుబాగాన్నంత ఆక్రమిస్తాయి. వ్యాధి తీవ్రత పెరిగే కొలదీ ఆకు ఇరువైపులా బూడిదతో పూర్తిగా కప్పివేయబడును. ఆకులు పసుపు వర్ణనికి మారి ఎండి రాలిపోతాయి. కాయలు సంఖ్య తగ్గి కాయలు త్వరగా పక్వానికి వచ్చి గింజల పరిమాణం కూడా తగ్గుతుంది. ఈ తెగులు వ్యాప్తికి చల్లని పొడి వాతావరణము అనువైనది . గాలిద్వారా ఈ తెగులు ఒక మొక్కనుండి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందుతుంది.
నివారణ:-
ఈ తెగులు ఆశించిన వెంటనే, మరో 15 రోజుల వ్యవధిలో రెండవ సారి లీటరు నీటికి కార్బండిజం 1 గ్రా లేదా థయోఫినేట్ మిధైల్ 1 గ్రా లేదా ట్రైడిమార్ఫ్1. మి. లి. లేదా కెరాథేన్ 1 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
తెగులు తట్టుకొనే రకాలను విత్తుకోవాలి.
పెసర -జె. ఆర్. యు. ఎమ్.1, పూస 9072, డబ్ల్యూ. జి. జి 48,62, టి. ఎ. ఆర్. ఎమ్.1,
మినుము – కృష్ణయ్య, ఎల్.బి. జి 623, టి. ఎమ్.962
పల్లాకు తెగులు:- ఈ వ్యాధి ఎల్లో మొజాయిక్ వైరస్ ద్వారా వ్యాపిస్తుంది ఆకులపై కాంతివంతమైన పసుపు మరియు ముదురు ఆకుపచ్చ రంగుతో కలిసిన పొరలు లేక మచ్చలు ఆకుల ఉపరీతలం పై ఏర్పడి తర్వాత ఆకులు మెరుపుతో కూడిన కాంతివంతమైన పసుపు రంగుకు మారును. తెగుళు సోకిన మొక్కలు తక్కువ పూత కల్గి ఉండి తక్కువ కాయలను కల్గి ఉంటాయి. కాయలు కూడా పసుపు వర్ణంలోకి మారి గింజలు చిన్నవిగా ఉంటాయి. ఈ వైరస్ తెల్ల దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
నివారణ:-
ఈ వ్యాధి వ్యాప్తికి కారణమైన తెల్లదోమ నివారణకై డైమితోఏట్ లేక మోనోక్రోటో పాస్ లాంటి మందును పిచికారీ చేయవలెను.
ఈ వ్యాధి తట్టుకొనే రాకలైన
మినుము ఎల్. జి. జి.20, పి. యు 31, ఎల్. జి. జి.752, టి -9, టియు 94-2,
పెసర -ఎల్. జి. జి.407, ఎమ్. ఎల్.267, ఎల్. జి. జి.460, డబ్ల్యూజి. జి 37.
Also Read: Turmeric Cooking Precautions: పసుపు ఉడికించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వడలు తెగులు:- ఈ వ్యాధి ప్యుసేరియమ్ ఆక్సిస్పోరమ్ సైసరి అనే శీలింద్రం ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి శనగ పంట విత్తిన 3 వరాల తర్వాత కనిపించును. అకస్మాత్తుగా మొక్కలు వడలి పోయి వాడిపడిపోవడం ఈ వ్యాధి యొక్క ముఖ్యలక్షణము . ఈ దశలో మొక్కల ఆకులు ఆకుపచ్చ రంగుని కల్గియుండును. ఇటువంటి మొక్కలను పికి చూచినప్పుడు కాండము మరియు వేరు భాగములలో అసమానంగా కృశించి ఉండును. వీటి పై ఎలాంటి బాహ్య కృళ్లు లక్షణములు కనిపించవు.
కాండం మరియు వేరు భాగలను చీల్చి చూసినప్పుడు లోపల కణజలాలు నల్లగా మారి ఉండుటము మొక్కల వయస్సు 6 వరాలు పై బడిన తర్వాత ఈ వ్యాధి ఆశించినచో వడలు తెగులు లక్షణాలు నిర్ధస్టంగా ఆగుపించును. ఆకులు పసుపు రంగుకు మారి క్రిందకి వ్రేలాడబడి వుండును. తర్వాత ఇవి ఎండుగడ్డి వర్ణనికి మారి మొక్క అంతా ఎండిపోవును. ఈ ఎండిన ఆకులు చెట్టునంటుకొని రాలిపోకుండా ఉండును. కాండం మరియు వేరు భాగాలు కృశించి లోపలి కణజలాలు నల్లగా మరుచు. ఈ దశలో కూడా బాహ్యంగా ఎలాంటి కూళ్లు తెగులు కనపడవు. ఈ శీలింద్రము విత్తనాలలో నెలలో మరియు పంట అవశేషాల్లో జీవిస్తుంది.
నివారణ:-
పంట మార్పిడి చేయవలెను
ఎక్కువ సేంద్రియపు ఎరువులను వాడవలయును.
కార్బండిజం 2.5 గ్రా / బెనలెట్ 1.5 గ్రా ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి.
ప్రవాహముద్వారా నీటితడువిచ్చు పద్దతిని అనసరించరాదు.
వ్యాధి నిరోధిక రాకలైన ఎస్.-26, జి -24, బిజీ -244, పూస -212, అవరోధి , జెబి 315 వంటి వాటిని సాగుచేయాలి.
ఉష్ణగ్రత్త ఎక్కువ ఉన్నప్పుడు పంట విత్తకూడదు.
Also Read: Coriander Crop Cultivation: ధనియాల పంట సాగు