Canine Distemper in Dogs: ఇది కుక్కలలో కలిగే అతి ప్రాణాంతకమైన అంటు వ్యాధి. ఈ వ్యాధిలో ప్రధానంగా జ్వరం వస్తూపోతూ, పొట్ట ప్రేగులకు మరియు శ్వాస కోశ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులతో పాటు, నాడీ కణ వ్యవస్థ ఇబ్బందులు అధికంగా ఉండి కుక్కలు చనిపోవడం జరుగుతుంటుంది. ఈ వ్యాధి పారామిక్సో విరిడి కుటుంబానికి చెందిన మార్చిల్లి వైరస్ ద్వారా కలుగుతుంది. ఈ వైరస్ Single standard. RNA virus. ఈ వైరస్ యొక్క కణం చుట్టూ ఏస్వలాప్ ఉంటుంది. ఈ వైరస్ ముసర వ్యాధి, పి.పి.ఆర్ వ్యాధి వైరస్ను పోలి ఉంటుంది.
6 నెలల నుండి 2 సంవత్సరాల యుక్త వయస్సు గల కుక్కలలో అత్యంత ప్రాణాంతకం కాగా, పెద్ద కుక్కలలో వెనుక కాళ్ల పక్షవాత లక్షణాలు అధికంగా ఉంటూ, కొన్ని సందర్భాలలో మరణాలు సంభవిస్తుంటాయి.వ్యాధి సోకిన కుక్క విసర్జించు వివిధ వ్యర్ధ పదార్థాల ద్వారా ఈ వైరస్ వాతావరణంలోకి చేరి, గాలి ద్వారా ఆరోగ్యంగా ఉన్న కుక్కలకు వ్యాపిస్తుంటుంది. కొన్నిసార్లు కలుషితమైన ఆహారం, నీరు వలన కూడా ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న కుక్కలకు వ్యాపిస్తుంటుంది.
వ్యాధి వ్యాపి:- వ్యాధి కారక వైరస్లో కలుషితమైన గాలిని ఆరోగ్యంగా ఉన్న కుక్కలు పీల్చుట వలన ఈ వైరస్ వాటి శ్వాసకోశ వ్యవస్థలోని టాన్సిల్స్ ద్వారా, ఊపిరితిత్తులలోకి చేరి న్యూమోనియాను కలుగజేస్తుంది. లింఫాటిక్ సర్కులేషన్ ద్వారా ఈ వైరస్ రక్తంలోకి చేరి, తద్వారా కంటిలోనికి పోయి కంటి శోధమును (పింక్ eyesను), పొట్ట ప్రేగులలోనికి పోయి ఎంటిరైటిస్ను కలుగజేయుట ద్వారా డయేరియాను, కీళ్ళలోనికి పోయి కీళ్ళవాపును, ఫుట్ పాడ్స్ లోనికి పోయి హార్డ్ పాడ్ డిసీజ్ను మరియు కేంద్రియ నాడీ వ్యవస్థ మీద పనిచేసి మెదడును ప్రభావితం చేస్తుంది. ఫలితంగా వెనుక కాళ్ళు పక్షవాతంతో పడిపోతాయి. ఈ వ్యాధి ఫలితంగా సెకండరీ బ్యాక్టీరియాలైన ఖార్డిటేల్లా బ్రాంక్సెప్టికా మరియు సాల్మోనెల్లా వంటి క్రిములు చేరి న్యూమోనియా మరియు డయేరియా లక్షణాలు మరింత అధికం అయ్యే ప్రమాదం కలదు.
Also Read: Quality Milk Production: నాణ్యమైన పాల ఉత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!
వ్యాధి లక్షణాలు:- ఈ వ్యాధిలో ఇంక్యుబేషన్ పీరియడ్ 7-8 రోజులు వుండును. వ్యాధి మొదటి దశలో అతి తీవ్రమైన జ్వరం ఉంటుంది. తరువాత జ్వరం వస్తూపోతూ ఉంటుంది. దీనినే బై ఫేజిక్ రైజ్ ఆఫ్ ఫీవర్ అని అంటారు. క్రింది పాదాలు గట్టిగా తయారు అయి వుంటాయి. కళ్ళు పింక్ రుంగులోకి మారి, కళ్ల నుండి నీరు కారుతూ ఉంటుంది. ఊపిరి తిత్తులలో న్యూమోనియా వుండుట వలన ముక్కు నుండి నీరు కారుతూ ఉంటుంది. తొలిదశలో శ్వాస ఎక్కువగా తీసుకుంటూ క్రమంగా శ్వాస తీసుకోవడం కష్టంగా వుండి, చివరకు కుక్కలు చనిపోతూ ఉంటాయి. వెనుకకాళ్ళు పక్షవాతంకు గురి అయ్యే అవకాశం కలదు. వ్యాధి చరిత్ర, వ్యాధి లక్షణాలు, వ్యాధి కారక చిహ్నములు మరియు ఈ క్రింది ప్రయోగశాల పరీక్షల ద్వారా కూడా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. ELISA, VNT.
చికిత్స:- ఈ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స లేదు. కాని సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షను రాకుండా ఏదేని ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటిబయోటికున్న 3-5 రోజులు ఇవ్వవలెను.జ్వరం తగ్గడానికి అంటి పైరిటిక్స్ ఔషధములను, విరోచనాలు కలగకుండా వుండుటకు అంటి డయేరియల్ ఔషధములను, నరాల బలహీనతకు బి1, బి6, బి12 కలిగిన న్యూరోటానిక్స్ ఔషధములను మరియు ఇన్ఫ్లమేషన్ను తగ్గించుటకు ఆంటి ఇన్ మెటరీ ఔషధములను ఇవ్వవలెను.వ్యాధి బారిన పడిన కుక్కల యొక్క స్థితిని చూసి, వాటికి తగినంత విశ్రాంతిని ఇవ్వాలి మరియు గంజి వంటి పదార్థాలు కాచిపెట్టాలి.
అవసరమైన యెడల సెలైన్స్, విటమిన్స్, మినరల్స్ కలిగిన ఇంజక్షన్లు లేదా సెలైన్ ద్రావణములను ఇవ్వవలసి ఉంటుంది. వ్యాది గ్రస్త కుక్కలను వేరుచేయాలి. ఈ వ్యాధి నిరోధక టీకాను మొదటి నెలలో మొదటి మోతాదును వేసి, 2వ నెలలో బూస్టర్ డోస్ ఇవ్వాలి. తిరిగి ప్రతి సంవత్సరంకు ఒక్కసారి ఈ టీకాను వేస్తువుండాలి. సహజంగా ఈ వ్యాధి నిరోధక టీకా ఇతర వ్యాధులైన పార్వో, ఐ.సి.హెచ్, లెప్టోస్టెరా వ్యాధులతో కలిసి ఉంటుంది. ఇది మార్కెట్లో మెగావాక్ -6, పెంటాడాగ్ రూపాలలో దొరుకుతుంది.
Also Read: Rabies Disease in Dogs: పెంపుడు కుక్కలలో రేబిస్ వ్యాధి ఎలా వస్తుంది.!