Rabies Disease in Dogs: ఈ వ్యాధి వేడి రక్తం గల ప్రతి జంతువులలోను మరియు మనుషులలోను కలుగు అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి. ఈ వ్యాధిలో ప్రధానంగా మెదడు మరియు వెన్నుపాము కణాలు దెబ్బతినుట వలన నాడీ మండల వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు కలుగుతాయి. రేబిస్ను హైడ్రోఫోబియా, లీస్సా మరియు రేజ్ అని కుడా పిలుస్తారు. W.H.C వారి లెక్కల ప్రకారం ఈ వ్యాధి మూలంగా ప్రతి సంవత్సరం మన దేశంలో 5000 మంది చనిపోతున్నారు.
ఈ వ్యాధి Rabdo viridae జాతికి చెందిన లీస్సా వైరస్ వలన కలుగుతుంది. ఇది సింగిల్ స్టాండెర్డ్ RNA Virus. ఈ వైరస్ చుట్టూ ఎన్వలప్ ఉంటుంది. ఈ వైరస్ బుల్లెట్ ఆకారంలో వుండి, సుమారు 70-80mm పరిమాణంలో ఉంటుంది. సాధారణంగా జంతువులలో వ్యాధులను కలిగించే వ్యాధి కారక వైరస్ను స్ట్రీట్ వైరస్ అని, ప్రయోగశాలలో సిరియల్ పసాజ్ చేసిన వైరస్ను ఫిక్సిడ్ వైరస్ అంటారు.
పశువులు, గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు,కుక్కలు, పిల్లులు, తోడేలు, నక్క, ముంగిస, కోతులు, ఉడతలు వేడి రక్తం గల ప్రతి పశువులలోను మరియు మనుషులలో వచ్చే ఒక జూనోటిక్ వ్యాధి.ఈ వ్యాధి ముఖ్యంగా వ్యాధిగ్రస్త జీవి కరవడం వలన (కుక్కలు, నక్కలు, పిల్లులు, ముంగిసలు, గబ్బిళాలు), వ్యాధి బారిన పడిన పశువుల లాలాజలం, కంటి స్రావాలు చర్మ గాయాల పై పడినప్పుడు, కొన్ని సందర్భాలలో వ్యాధి బారిన పడిన పశువుల పాలు మరియు వ్యాధితో చనిపోయిన పశువుల మాంసం సరిగ్గా ఉడక బెట్టనట్లైతే కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ.
Also Read:కుక్కల గురించి ఈ నిజాలు మీకు తెలుసా?
సాధారణంగా రేబిస్లో ఇంక్యుబేషన్ పీరియడ్ 1 రోజు నుండి 60 రోజుల వరకు ఉంటుంది. ఇంక్యుబేషన్ పీరియడ్ వ్యాధి గ్రస్త జీవి కాటు వేసే లేదా గాయం చేసే ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది. మెడ లేదా తల దగ్గర కరిచినట్లైతే 1-2 నెలలోపు వ్యాధి లక్షణాలు బయట పడుతుంది. ఇతర శరీర భాగాలలో కరిచినట్లైతే 1-2 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం కూడా పడుతుంది. ఒక్కసారి రేబిస్ వ్యాధి లక్షణాలు బయట పడినట్లైతే 10 రోజుల లోపు ఆ పశువు చనిపోతుంది.
వ్యాధి వ్యాప్తి విందు విధానం:- వ్యాధి గ్రస్త జీవి కరవడం వలన ఈ వ్యాధికి సంబంధించిన వైరస్ అక్కడి కండరాలలో పెరిగి, తరువాత పెరిఫెరల్ నరాల ద్వారా సెంట్రీఫీటల్ పోర్సు ద్వారా వెన్నుపాము మరియు మెదడుకు చేరును. తరువాత సెంట్రిఫ్యూగల్ పొర్సు ద్వారా కపాల నాడులైన ఫేసియల్, గ్లాసోపేరంజియల్, జేమినల్, ఆల్ప్యాక్టీరి నరాల ద్వారా లాలాజల గ్రంథులు, థైమస్, లింఫ్ గ్రంథులలో వీరి లాలాజలం ద్వారా వైరస్ బయటకు వెలువడుతుంటుంది.
మెదడు మరియు వెన్ను పాముపై ప్రభావం చూపి ఎన్ సెఫలో మైలైటిస్ను కలిగిస్తుంది. ఫలితంగా ఆహారవాహిక, గ్రసని, స్వరపేటిక కండరాలు పాక్షిక పక్షవాతంకు గురి అగుట వలన కుక్కలు నీటిని త్రాగలేవు. ఫలితంగా కుక్కలకు నీటిని చూస్తే భయం. క్రమేపి పశువులలో అన్ని అవయవాలు పక్షవాతానికి గురై 10 రోజులలోపు వ్యాధి గ్రస్త జీవి మరణిస్తుంది.
Also Read: కుక్కలు ముద్దు పెడితే.. మన ప్రాణాలకు ప్రమాదమా?