Mucosal Disease in Cattles: ఇది ఆవులలో కలుగు సాధారణమైన లేదా అతి తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధిలో జ్వరం మరియు డయేరియా ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. హిస్టోపాథాలాజికల్ గా ఈ వ్యాధిలో నోటిలో, ఆహారవాహికలో, రూమెన్, ఆబోమేజమ్ మరియు ప్రేగులలో అల్సర్లు ఏర్పడి ఉంటాయి. అందుకే ఈ వ్యాధిని మ్యూకోజల్ వ్యాధి అంటారు.
ఇది టోగా విరిడేకు చెందిన పెస్టివైరస్ వలన ఆవులలో కలుగుతుంది. ఇది ఒక Single Standard, RNA, Envoloped virus. ఇది సుమారు 30-40nm పరిమాణం కలిగి ఉంటుంది. 6 నెలలు పై బడిన ఆ వులలో వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా కలుగుతుంది. కొన్ని సందర్భాలలో గేదెలు మరియు పందులు కూడా ఈ వ్యాధి బారిన పడతాయి. వైరల్‌తో కలుషితమైన ఆహారం, నీరు లేదా కలుషితమైన వాటిని తాకుట ద్వారా ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న పశువులకు వ్యాపిస్తుంది.
వ్యాధి వ్యాప్తి చెందు విధానం:- పై మార్గాల ద్వారా వైరస్ శరీరంలో ప్రవేశించి, దగ్గరలో వుండే లింఫ్ గ్రంథులకు చేరి, అక్కడి నుండి రక్తంలో కలిసి, రక్తం ద్వారా పార్టీ ప్రేగులలోకి చేరి ఎంటిరైటిస్, గర్భాశయమునకు చేరి అబార్షన్‌ను మరియు సరిగ్గా అవయవాలు తయారు కాని దూడలు పుట్టేటట్లు చేస్తుంది. దూడలలో అయితే కేంద్రీయ నాడీ వ్యవస్థతో పాటు అన్ని అవయవాలు మీద ప్రభావం చూపుతుంది.
Also Read: Dairy Animals: పాడి పశువుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!
లక్షణాలు:- అధిక జ్వరం ఉంటుంది. నోటి నుండి భూమి వరకు నురగ తీగలుగా కారుతూ ఉం టుంది.కంటి నుండి ద్రవాలు కారుతుంటాయి.ముక్కు నుండి ద్రవాలు కారుతుంటాయి.
డయేరియా ఉంటుంది. పశువులు ఈసుకుపోతాయి.పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. బలహీనమైన దూడలు పుడతాయి.ఎముకల గూడు గల దూడలు పుడతాయి. మగ పశువులలో ఆర్కైటిస్ ఉంటుంది. పశువుల శరీరంలో వేడి ఒక చోట ఎక్కువగాను, మరొక చోట తక్కువగాను ఉంటుంది.
వ్యాధి కారక చిహ్నములు:- పొట్ట ప్రేగులలో అల్సర్స్ మరియు రక్తపు చారలు ఉంటాయి. శ్వాసనాళం, స్వరపేటిక, గ్రసని, ఆహారనాళం మరియు గర్భకోశంలో సురగతో కూడిన వ్యాధి కారక చిహ్నములు ఉంటాయి.
వ్యాధి నిర్ధారణ:- వ్యాధి చరిత్ర, లక్షణాలు, వ్యాధి కారక చిహ్నముల ఆధారంగా మరియు క్రింది ప్రయోగశాల పరీక్షల ఆధారంగా వ్యాధిని నిర్ధారించవచ్చు. అనిమల్ ఇనాక్యూలేషన్ పరీక్షలు, C.F.T. AGID, FAT, ELISA మొ.నవి. ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స లేదు.
చికిత్స:- విరోచనాలను తగ్గించుటకు అంటీడయేరియల్ ఔషధాలను, : జ్వరమును తగ్గించుటకు అంటి పైరెటిక్ ఔషధాలను, శోధమును తగ్గించుటకు అంటి ఇన్ ఫ్లమేటరీ ఔషధాలను ఇవ్వవలెను. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండుటకు క్లోరం ఫెనికాల్, క్లోరో టెట్రాసైక్లిన్ వంటివి లేదా ఇతర అంటీ బయోటిక్స్ ఇవ్వవలసి ఉంటుంది.
వ్యాధి నుండి త్వరగా కోలుకొనుటకు చేయు చికిత్స :- పశువు యొక్క స్థితిని బట్టి సెలైన్స్, విటమిన్స్, మినరల్స్ ఇంజక్షన్లు లేదా ద్రావణములు ఇవ్వాలి. పశువులకు తగినంత విశ్రాంతిని ఇవ్వాలి.
నివారణ:- ఈ వ్యాధికి ఎటువంటి టీకాలు లేవు. వ్యాధి వచ్చిన పశువులను మంద నుండి వేరుచేయాలి.
Also Read: Bovine Herpes Virus in Cattles: ఆవులలో బోవైన్ హెర్పిస్ వైరస్ వ్యాధి ఇలా వ్యాపిస్తుంది.!