Preparation of Sauce and Ketchup: సాస్ మరియు కెచప్ తయారీలో రెండింటిలో తేడా ఉండదు. కెచప్ కన్నా సాస్ పల్చగా ఉంటుంది. టమాట, ఆపిల్, బొప్పాయి, సోయబీన్, పుట్ట గొడుగులతో తయారు చేస్తారు.
సాస్ రెండు రకాలు
పల్చగా ఉండి తక్కువ సాంద్రత కలవి.
కొంచెం చిక్కగా ఉండి ఎక్కువ సాంద్రత కలివి.
సాస్ మరియు కెచప్ యొక్క తయారీలో చట్నీల మాదిరి గానే పదార్ధాలు వాడతారు. తేడా ఏంటి అంటే ఎక్కడ గుజ్జు, బాగా ఉడికించిన తర్వాత తోలు మరియు విత్తనం తొలగించబడును. పదార్ధం పసుపుగా ఉండును. పల్చగా మరియు జ్యూస్ ఎక్కువ సేపు ఉడికించబడుతుంది. సాస్ ని చిక్కపరచుటకు కొన్ని పదార్థాలు కలుపబడును.
Also Read: Benefits of Eating Radish: ముల్లంగి తినడం వల్ల ప్రయోజనాలు.!
సాస్ ను మనం మంచిగా పల్చగా ఉండికించాలి. సాస్ యొక్క రంగు కూడా సొంపుగా ఉండేలా చూడాలి.సాస్ చల్లార్చిన తర్వాత కొంచెం చిక్క గా తయారు అవుతుంది.సాస్ ను బాటిల్ లో నింపినప్పుడు పై నుండి 2 సేం. మీ. వదిలి నింపి మూత పెట్టాలి. ఈ బాటిల్ ను గాలి చొరబడకుండా ఉండాలి. బాటిల్ లోకి నింపిన తర్వాత పాశ్చరైజెషన్ చేయాలి. లేనిచో పదార్ధం మురిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టమాటో, మష్రూమ్ ఎక్కువ ఇతర సాస్ లు ఆమ్లం ఎక్కువగా ఉండడం వలన మురిగే అవకాశం తక్కువగా ఉంటుంది.
ఆపిల్ సాస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఆపిల్ గుజ్జు – 1 కేజీ
చక్కెర – 250 గ్రామ్స్.
ఉప్పు – 10 గ్రామ్.
ఉల్లి తురుము- 200 గ్రామ్స్.
అల్లం -100 గ్రామ్.
వెలుల్లి తురుము -50 గ్రామ్స్.
మిరప పొడి – 10 గ్రామ్స్.
లవంగాలు – 5 గ్రా.
దాల్చిన చెక్క -10 గ్రా.
వెనిగర్ 50 మ్. ల్
సోడియం బెంజొయెట్- 0.7 గ్రామ్ / కేజీ
ముందుగా ఆపిల్ ను శుభ్రం గా కడిగి తొక్క తీసి మరియు విత్తన మధ్య గింజలు తొలగించాలి. తర్వాత గుజ్జును తయారు చేసి రంగు కలపాలి. గుజ్జును 3 వంతు చెక్కర లో ఉడికించాలి.తర్వాత సుగంధ ద్రవ్యాలు అనగా లవంగాలు, దాల్చినా చెక్క,, వెల్లుల్లీ తురుము, మిరప పొడి మరియు అల్లం వేసి కలిపి ఉడికించాలి. తర్వాత చెక్కెర మరియు ఉప్పు కలిపి ఉడికించాలి. ఆఖరిలో వెనిగర్ కలిపి చల్లరినా తర్వాత బాటిల్ల్లో గట్టిగ మూత బిగించి నింపాలి. తర్వాత పాశ్చరైజేషన్ చేసి గదిలో భద్రపరచాలి.
Also Read: Jam and Halwa with Fruits: పండ్లతో జామ్, హల్వాలు.!