ఆరోగ్యం / జీవన విధానం

Benefits of Eating Radish: ముల్లంగి తినడం వల్ల ప్రయోజనాలు.!

1
Benefits of Eating Radish
Benefits of Eating Radish

Benefits of Eating Radish: ముల్లంగి లో తెల్ల రంగు మరియు గులాబీ రంగులో లభిస్తుంది. మనం ఎక్కువగా తెల్ల ముల్లంగి ని వాడతాం. దీని వాసన అభ్యంతరకరంగా ఉన్న కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ముల్లంగి ని చాలా మంది ఆహారానికి దూరంగా పెట్టేస్తారు. ముల్లంగి లో మేలు చేసే ఔషధ గుణాలెన్నో పుష్కలం గా ఉన్నాయి.

లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ముల్లంగి ముఖ్యంగా జాడిస్ లేదా కామెర్లు వ్యాధి బారిన పడిన వారు తరచు ముల్లంగి తింటే లేదా రాసాన్ని త్రాగితే శరీరంలో నీరు నిలిచే చేస్తుంది.

  • పైల్స్ వ్యాధిగ్రస్తులకు ముల్లంగి చక్కని ఔషదం.
  • మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచడమే కాక శరీర బరువును తగ్గించేందుకు ముల్లంగి ఎంత గానో ఉపయోగపడుతుంది.
  • సి – విటమిన్,ఫోలిక్ ఆసిడ్, యంధోసియానిక్ లు ముల్లంగిలో ఉన్నందున తరచు తింటే క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.
  • పురుగు కాటు, తేనీటిగా కాటు నుంచి వచ్చే నొప్పిని తగ్గిస్తుంది.
  • విటమిన్ -సి, ఫాస్పారస్, జింక్, విటమిన్ – బి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
Benefits of Eating Radish

Benefits of Eating Radish

Also Read: Radish cultivation:ముల్లంగి సాగుకు అనువైన రకాలు

  • ముల్లంగి గుజ్జు ముఖానికి మంచి తేజస్సును ఇస్తుంది.
  • వ్యాధి నిరోధక గుణం చాలా రకాల చర్మ వ్యాధులను రాకుండా తట్టుకుంటుంది.
  • ముల్లంగి రసంతో నల్ల ఉప్పును కలుపుకొని తాగితే ఇన్ఫెక్షన్ తీసి వేస్తుంది.
  • వీటితో పాటు ముల్లంగి ఆకలిని వృద్ధి చేస్తుంది.
  • అలాగే నోటి శ్వాసను తాజాగా ఉంచుతుంది.
  • రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది.
  • కడుపులో మంట తలనొప్పి, దగ్గుని తగ్గిస్తుంది.
  • ఎర్ర రక్త కణాలకు ఆక్సిజన్‌ అందిస్తుంది.
  • ముల్లంగి విషలను నెట్టేసే గుణం ఉంటుంది. జీర్ణ క్రియ బాగుంటుంది.
  • బరువు తగ్గలి అనుకునే వారు ముల్లంగిని తినవచ్చు.
    మనం రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే చక్కని ఆరోగ్యం మీ సొతం అవుతుంది.

Also Read: Radish Health Benefits: ముల్లంగి తినడానికి సరైన సమయం తెలుసుకోండి

Leave Your Comments

Sunlight Uses: సౌర శక్తి- మొక్కలకు ఎలా ఉపయోగపడుతుంది.!

Previous article

Preparation of Sauce and Ketchup: సాస్ మరియు కెచప్ తయారీ.!

Next article

You may also like