Dairy Animals: పాడి పశువులను కట్టించిన దినం నుండి 90 రోజులలో తప్పని సరిగా చూడి పరీక్ష చేయించి, చూడు నిర్ధారించుకోవాలి. చూడు తో ఉన్న పశువులను ఆఖరు నెలలో మంద నుండి వేరు చేసి ఈనుటకు వీలుగా వున్నటువంటి ప్రత్యేకమైన షెడ్జ్ లో గాని లేదా వేరే స్థలంలో గాని ఉంచవలెను. చూడి పశువులు ఎక్కువగా నడిపించరాదు. పరిగెత్తించ కూడదు. ఎగుడు దిగుడు ప్రాంతాలలో ఉంచరాదు. ఎత్తు ప్రదేశాలకు వెళ్లనివ్వకూడదు.
ఈ పశువులను భయపెట్టకూడదు. ఇతర పశువులతో పోట్లాడనివ్వకూడదు మరియు చూడి పశువులతో బరువులు మోయించడం కాని, ఇతర వ్యవసాయ పనులు కానీ చేయించరాదు. పశువులు నిండు చూలుతో ఉన్నప్పుడు బయటకు పంపించకూడదు. ఈ స్థితిలో ఆంబోతు పశువులు ఎక్కకుండా జాగ్రత పడాలి.
చూడి పశువులకు 3 మరియు 6 మసాల సమయంలో నట్టల మందులు త్రాగించాలి. చూడి పిండం పై ప్రభావం చూపని ఔషదాలను ఉపయోగించాలి లేదా చూడికి ప్రమాదం కలిగిన పశువులు ఈసుకుపోయే ప్రమాదం కలదు. ఈనడానికి రెండు మూడు నెలల ముందు నుండి కాల్షియం పాస్పరస్ గల ఔషదాలను ఇచ్చుట ద్వారా, పశువులు ఈనిన తర్వాత పాల జ్వరం రాకుండా చూడవచ్చు. ఈనే సమయాన్ని గమనించి తెలుసుకోవలెను.
Also Read: Bovine Herpes Virus in Cattles: ఆవులలో బోవైన్ హెర్పిస్ వైరస్ వ్యాధి ఇలా వ్యాపిస్తుంది.!
చూడి పశువులు ఈనే రెండు నెలల ముందు పాలు పితుకుట ఆపి వేయవలెను. దీనినే యింగ్ ఆఫ్ అనిమల్ అని అంటారు. దీనిని 3 విధాలుగా చేయవచ్చు. చూడితో పాటు పాల ఉత్పత్తి సహజంగా తగ్గిపోతూ 2-3 నెలల ముందు పూర్తిగా ఆగిపోవును. లేని యెడల ఒక పూట పాలు పిండి, ఒక పూట పిండకూడదు లేదా పాలు సంపూర్తిగా పిండక కొద్దిగానే పిండి, కొద్ది పాలు పొదుగులోనే వదిలివేయ్యాలి లేదా 10 నెలల తరువాత సంపూర్ణంగా పిండక పోవడం వంటి చర్యల ద్వారా పాలు పిండుట ఆపి వేయవలెను.
పాడి పశువుల్లో చూడి కాలంలో డ్రైయింగ్ చేయుట వలన చూడి పశువుల యొక్క గర్భం విశ్రాంతి పొంది, గర్భంలోని పిండం యొక్క అవయవాలు బాగా అభివృద్ధి చెంది, ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈనిన తర్వాత పాడి పశువుల పాల సామర్థ్యం కూడా ముందు ఈత కంటే పెరిగే అవకాశం కలదు.
అధిక పాల దిగుబడి గల పాడి పశువులలో పశువుల ఈసే ఒకటి రెండు రోజుల ముందు అంటిబయోటిక్ ఔషధములను పొదుగులోనికి ఎక్కించినట్లైతే, పశువులు ఈనిన తర్వాత పొదుగు వాపు రాకుండా నివారించవచ్చు.
Also Read: Buffalo Types: గేదెల రకాలు మరియు వాటి లక్షణాలు.!