పశుపోషణమన వ్యవసాయం

Duck Management: బాతుల పెంపకంలో మెళకువలు.!

1
Duck Management
Duck Management

Duck Management: కోళ్ళ పెంపకం తరువాత బాతుల పెంపకం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ఇవి ఈస్ట్రన్ మరియు సదరన్ రాష్ట్రాలలో ఎక్కువగా పెంచడం జరుగుతుంది. 5 వ పంచవర్ష ప్రణాళికలో ICAR వారు with technical colaboration of U.K. నుండి సహాయం పొంది ఈ పెంపకాన్ని బెంగళూరు నందు చేపట్టారు.

వీటి పెంపకం వలన కలుగు లాభాలు:

· కోళ్ళ కన్నా ఎక్కువ గ్రుడ్లు పెట్టును మరియు గ్రుడ్లు పెద్దవిగా ఉంటాయి. ఇవి దాదాపు 95% గ్రుడ్లు పెడతాయి.

· వీటి యొక్క పెంపకంలో ఎక్కువ శ్రద్ధ అవసరం ఉండదు.

· ఇవి కొంచెం కఠినంగా వుంటాయి. వీటిని ఎలాంటి పరిస్థితులోనైనా పెంచవచ్చు.

· ఇవి మిగిలిన పౌల్ట్రీ జాతుల కన్నా తెలివైనవి. వీటిని నీళ్ళు బాగా వున్న ప్రదేశంలో పెంచవచ్చు. మాంసోత్పత్తి కోళ్ళ తరువాత ఇవి ప్రాముఖ స్థానాన్ని ఆక్రమించుకున్నాయి వీటికి వ్యాధులు తక్కువ.

Duck Management

Duck Management

Also Read: Diseases in Duck Rearing: బాతుల పెంపకంలో వచ్చు వ్యాధులు.!

బాతుల పెంపకంలో కొన్ని ముఖ్య విషయాలు:

బాతుల పెంపకం గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నది. ఎందుకనగా సముద్ర ప్రాంత విస్తీర్ణం ఎక్కువగా ఉన్నది. అది ఇంగ్లాండ్ వాటర్ Arey, Duck పెంపకానికి అనుకూలంగా ఉంది. సాధారణంగా బాతులు 10 సంవత్సరాల వరకు బ్రతకగలవు. గ్రుడ్లు ఉత్పదన “4” సంవత్సరాల వరకు బాగా ఉంటాయి.ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ (Integrated Farming) కు బాతులు చాలా లాభదాయకంగా ఉంటాయి . ఒక హెక్టారుకు చేపలతో పాటు 200-300 బాతులను పెంచవచ్చు. ఇవి కోళ్ళ కన్నా తక్కువ రోగములకు గురి అగును.

వీటికి అంతర పరాన్న జీవులు కోళ్ళ కన్నా తక్కువ స్థాయిలో ఉంటాయి. వీటికి Leucosis, Marek’s, CRD వ్యాధులు రావు. కోళ్ళ కంటే వీటిలో లింగ నిర్ధారణ చాలా సులభం. వీటి ఈకలు pillows తయారీలోను మరియు Winter clothing liningలకు ఉపయోగపడుతాయి. మాంసోత్పత్తిలో White Peckin చాలా ప్రసిద్ధి గాంచినది. 42 రోజులలో ఒక బాతు 2.2-2.5 కే.జీల బరువు తూగు తాయి. వీటికి 2.5 కేజీల మాంసోత్పత్తికి 3.25 కేజీల దాణా అవసరం. గ్రుడ్లు ఉత్పాదనలో Kakhicampbell పేరు గాంచినది. ఒక బాతు రోజుకు 1 గ్రుడ్డు పెట్టు సామర్థ్యం కలిగి ఉంది. సగటున 300 గ్రుడ్లలను ఒక సంవత్సరంలో పెట్టుతాయి. వీటి గుడ్ల పరిమాణం పెద్దగా మరియు 65-75 గ్రాముల బరువు ఉంటాయి.

ఇంక్యుటేషన్ :

1. ఇంక్యుటేషన్కు ఉష్ణోగ్రత 37 37.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి.

2. తారతమ్య ఆర్ద్రత 70-75 శాతం ఉండాలి.

3. పొదిగించుటకు ఉపయోగించు గ్రుడు యెక్క 70-75 గ్రాములు ఉండాలి.

4. రెండవ వారంలో ఇంక్యుబేటర్లో వున్న గ్రుడ్లు పైన నీరు చెల్లాలి. 150 డిగ్రీల కోణంలో గ్రుడ్లను తిప్పాలి. 5. ఇంక్యుబేషన్ పీరియడ్ సాధారణంగా 28 రోజులు అయితే మస్ కావీ జాతి బాతులలో ఇంక్యుటేషన్ పీరియడ్ 32-35 రోజులు Hatchability సాధారణంగా కోళ్ళు కన్నా తక్కువ.

బ్రూడింగ్ :

గ్రుడ్లు పెట్టు జాతులకు 3 నుండి 4 వారాలు బ్రూడింగ్ అవసరం. మాంసం జాతులకు 2 నుండి 3 వారాలు బ్రూడింగ్ అవసరం. మొదటి వారం 29–32° సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండాలి. తరువాత ప్రతి వారము 3° సెంటిగ్రేడ్ల చొప్పున 0 తగిస్తూ ఉండాలి. 4 వ వారానికి 20 సెంటిగ్రేడ్ ఉండాలి.90-100 sq.cm కలిగిన hover ను ఏర్పాటు చేయాలి. బాతు పిల్లలకు ఫైర్ ఫ్లోర్ లిట్టర్ లేదా రేంజ్ పద్ధతిలో బ్రూడింగ్ చేయవచ్చు. వైర్ ఫ్లోర్ లిట్టర్ నందు ప్రతి ఒక దానికి 1/2 చదరపు అడుగుల స్థలం ఉండాలి. సాలిడ్ ఫ్లోర్ నందు ఒక దానికి 1 చదరపు అడుగుల స్థలం వుండేలా చూడాలి. నీటి స్థలం ఒక దానికి 5-7 సెంటిమీటర్లు సరిపోతుంది.

Also Read: Raising Ducks: అదనపు ఆదాయం పొందే బాతుల పెంపకం

Leave Your Comments

Heat Detection in Dairy Buffaloes: ఎదలో ఉన్న పాడి పశువులను ఎలా గుర్తిస్తారు.!

Previous article

Coleus Cultivation: పాషాణ భేది సాగులో మెళుకువలు.!

Next article

You may also like