ఉద్యానశోభమన వ్యవసాయం

Soil and Irrigation Water Tests: భూసార, సాగునీటి పరీక్షలు.!

0
Irrigation Water Tests
Irrigation Water Tests

Soil and Irrigation Water Tests: రెండేళ్లకొకసారి భూసార పరీక్షలు చేయించాలి. వీటి వల్ల నత్రజని ,భాస్వరం, పొటాష్ల స్థాయి తెలుస్తుంది. సూక్ష్మపోషకాలైన జింక్, ఇనుము, మాంగనీసు, రాగి పొలంలో ఏయే మొతదుల్లో ఉన్నాయో ఆటమిక్ మీటరు ద్వారా తెలుసుకొని వివిధ పంటలకు వెయ్యాల్సిన మోతాదును తెలుసుకోవచ్చు. నేలలోని చౌడు, సున్నం, కాలుష్యం స్థాయిలను తెలుసుకోవడానికి భూసార పంటలు చేయడానికి ఉపయోగపడుతుంది.

మట్టి నమూనాల సేకరణ
నమూన తీసే చోట నేలపైనున్న గడ్డి, చెత్త, కలుపు మొదలగు వాటిని తీసివేయాలి. అగర్ / పర /తాపీతో మట్టి నమూనాను సేకరించి v ఆకారంల్లో 15 సెంటీమీటర్లు లోతు వరకు గొయ్యి తీసి దానిలో పక్కాగా అంగుళం మందాన గొయ్యి అడుగు అంచుల వరకు మట్టి తియ్యాలి. ఇదే విధంగా 8-10 చోట్ల సేకరించి మట్టి నమూనాలను ఒక శుభ్రమైన గోనే పట్ట మీద వేసి కలపాలి. మట్టి అనేది తడిగా ఉంటే ఆరబెట్టాలి.

ఆరబెట్టడం వలన శాంపిల్ అనేది ఈజీ గా తీసుకోవచ్చు. తర్వాత మట్టిని వృత్తకారంగా చదును చేసి నాలుగు సమాన భాగాలుగా చెయ్యాలి. ఎదురుఎదురుగ ఉన్న బాగాలమట్టిని తీసుకుని మిగిలిన మట్టిని తీసివేయాలి. దీనినే క్వార్డరింగ్ అని కూడా అంటారు. ఈ విధంగా అరకిలో మట్టి నమూనా వచ్చేవరకు చేసి శుభ్రమైన గుడ్డసచ్చిలో వేసి రైతు వివరాలు రాసి, భూసారా పరీక్ష కేంద్రానికి పంపాలి. భూసార పరీక్షను అనుసరించి ఎరువులను వాడితే ఖర్చు తగ్గించుకోవచ్చు.

Soil and Irrigation Water Tests

Soil and Irrigation Water Tests

Also Read: Agricultural Waste Benefits: వ్యవసాయ వ్యర్థాలతో ఎన్నో లాభాలు.!

జాగ్రత్తలు
మాగాణి నేలలో నీరు పెట్టకముందే నమూనాలను తియ్యాలి. చెట్ల క్రింద, గట్ల పక్కన, కాలిబాటలో తియ్యకూడదు. పైపైన వేర్లు ఉండే వరి, ఇతర ధాన్య పంటలకు 6-9 అంగులాల లోతులో, ప్రత్తి, కంది లాంటి వేర్లు లోతుగా వెళ్లి పంటలకు 12-18 అoగుళాలు, పండ్ల తోటలకు 3-6అడుగుల లోతులో నమూనా సేకరించాలి. చౌడు భూముల్లో 0-15సేo. మి,15-30సెం. మి లోతులో రెండు నమూనాలను విడిగా తియ్యాలి. రసాయన ఎరువులు వేసిన 3నేలల లోపు నమూనాను తీయకూడదు.

సాగు నీటి పరీక్ష
సాగు నీటి పరీక్ష కోసం కనీసం అరలీటర్ నీటిని సేకరించి శుభ్రమైన గాజు లేదా ప్లాస్టిక్ సీసా ఉపయోగించాలి గట్టిగ మూత పెట్టాలి. సీసాను రెండు లేదా మూడు సార్లు నీటిగా కడగాలి. ట్యూబ్వెల్స్, బోరెవెల్స్, నుంచి నీరు సేకరించాల్సినప్పుడు సుమారు 10నిముషాలు వదిలిన తరువాత తీసుకొని ఉపయోగించాలి. చేదబావి నుంచి 4-5 బకెట్ నీరు తోడిన తరువాత తీసుకొని వాడలి. కాలువలు, వాగులు, నదుల్లో, గట్టుకు దగ్గరగా కాకుండా కొంచెం లోపలికి వెళ్లి తీయ్యాలి. నమూనా సేకరించిన వెంటనే దానికి సంబందించిన అన్ని వివరాలు రాసి భూసారా పరీక్ష కేంద్రానికి పంపాలి. అక్కడ పరీక్ష చేసి సాగు నీటిని విభజిస్తారు.

మొదటి తరగతి: చాలా మంచి నీరు. ఇది అన్ని భూములకు పనికి వస్తుంది.
రెండో తరగతి: మంచి నీరు. యాజమాన్య పద్ధతులలో జాగ్రత్తగా వాడలి
మూడో తరగతి: మురుగు వసతి కలిపించి తట్టుకోగల పైర్లకు సాగు చేయాలి.
నాలుగు తరగతి: ఇది పనికి రాని నీరు. పైర్ల సాగుకు కూడా పనికి రాదు. పండ్ల మొక్కలకు, పంట మొక్కలకు, ఆకులను పరీక్ష చేసి కూడా పోషక లోపాలను గుర్తించి నివారించవచ్చు.

Also Read: Effects and Management of Parthenium Hysterophorus: వయ్యారి భామ (కలుపు మొక్క)ను ఎలా వదిలించుకోవాలి? 

Leave Your Comments

Agricultural Waste Benefits: వ్యవసాయ వ్యర్థాలతో ఎన్నో లాభాలు.!

Previous article

Silent Heat Detection in Buffaloes: గేదెలలో మూగ ఎద లక్షణాలను ఎలా గుర్తించాలి.!

Next article

You may also like