Jam and Halwa with Fruits: జామ్, హల్వాలు తయారీకి మంచిగా ఉన్న మామిడి, అరటి, పనస, అనాస, సపోటా, బొప్పాయి, ఆపిల్ వంటి పండ్ల అనుకూలంగా ఉంటాయి. మొదట పండ్లను బాగా గుజ్జు గా తయారు చేసుకోవాలి. ఆ తరువాత గుజ్జును అడుగు మాడకుండా ఉడికించాలి. గుజ్జుకు సమానంగా చెక్కెర వేసి, నెమ్మదిగా కలుపుతూ వేడిని పెంచి ఉడికిస్తే హల్వా పాకంలా జామ్ తయారు అవుతుంది. చివరి దశలో రుచి చూసి అవసరం అయితే తగినత నిమ్మ ఉప్పు ( సిట్రిక్ ఆసిడ్ )ను కొద్ధి నీటిలో ముందుగా కరిగించి జామ్ లో కలపాలి. పులుపు తక్కువగా ఉండే పండ్ల జామ్ ల తయారీలో కిలో జామ్ కి సుమారు 5గ్రా. నిమ్మ ఉప్పు కలపాలి.
Also Read: Anjeer Fruits Benefits: అంజీర్ పండ్లతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
ఉడికే జామ్ ను కొద్దిగా నీళ్లలో వేసినప్పుడు అది నీటిలో కరగకుండా కిందికి దిగిపొతే జామ్ తయారు అయ్యినట్లు గుర్తిచాలి. తయారు అయ్యిన జామ్ ను శుభ్రం అయిన సీసాలో నింపి గట్టిగ మూత పెడితే ఆరు మాసాలకు పైగా నిల్వ ఉంటుంది. రిఫ్రిజిరేటర్లల్లో ఇంకా ఎక్కువ కాలం ఉంటుంది. జామ్ వాడే సమయంలో బూజు పట్టకుండా కిలో జామ్ కు సుమారు పావు గ్రా. మీరా సోడియం బెంజాయట్ ని నీళ్లలో కరిగించి జామ్ ల్లో వేసి కలపాలి. పులుపు లేని అరటి, బొప్పాయి, పనస, సపోట, పండ్లు హల్వా తయారీకి బాగుంటాయి. జామ్ హాల్వాల తయారీ విధానాలలో వారి వారి రుచులను బట్టి యాలుకల పొడి, ఎండు ద్రాక్ష, బాదాం, జీడిపప్పు, పండ్ల హాల్వాల్లో తగు మాత్రం వేసుకోవచ్చు.
టమాటా లతో గుజ్జు తయారీ
మార్కెట్ లో టమాటాలకు ధర లభించినప్పుడు వాటిని గుజ్జు గా మార్చి నిల్వ చేసి అధిక ధర వచ్చే సమయాలలో విక్రయించి లాభాలు పొందవచ్చు. రైతులు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకొని తమ పొలాల్లోనే గుజ్జు తయ్యారి పరిశ్రమాలు తయారు చేసుకోవచ్చు. దీనికి ఎక్కవ పెట్టుబడి అవసరం ఉండదు కాయలను శుభ్రం చేసే వాషర్, కాయలను గుజ్జు గా మార్చే పల్పర్, గుజ్జును శుభ్రం చేసేందుకు మెషిన్ ఉంటే సరిపోతుంది. గుజ్జు ఎక్కువ కాలం నిల్వ ఉండేదుకు సిఫార్సు చేసిన మోతాదుల్లో సోడియం బేజొయిట్ కలపాలి. తయారు అయ్యిన గుజ్జును పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములో నిల్వ చేసి మార్కెట్ చేసే ముందు ప్యాకెట్ చేసే ముందు ప్యాకెట్ లల్లో నింపవచ్చు.
ఉల్లి ఒరుగుల తయారీ
ఉల్లి గడ్డను చిన్న చిన్న ముక్కలుగా చేసి అరబెట్టి ఒరుగు పొడిని చేసి నిల్వ చేసి వాడుకోవచ్చు. మార్కెట్ లో ధర లేనప్పుడు ఒరుగుల పొడిని సంవత్సరం పైగా నిల్వ చేసుకోవచ్చు. లీటర్ నీటికి 50గ్రా. ఉప్పు కలిపిన ద్రావణం ల్లో తరిగిన ఉల్లి ముక్కలను 10నిముషాలు పాటు ఉంచి, బయటకు తీసి 60-65డిగ్రీ సెం.గ్రే ఉష్ణోగ్రత 11-13గంటలపాటు ఆరబెట్టి ఇంట్లోనే ఒరుగులు చేసుకోవచ్చు.10 కిలో గడ్డలు ముక్కలు చేసి, ఎండబెడితే కిలో ఒరుగులు వస్తాయి.
మునగాకు పొడి తయారీ
మునగాకు కొమ్మలతో సహా సేకరించి, మంచి నీటితో శుభ్రం చేసి నీడలో ఆరబెట్టాలి. ఎండలో అరబెడితే కొన్ని పోషకాలు, విటమిన్లు నశించిపోతాయి. 4-6 రోజులు ఇవి ఎండిపోతాయి,10కిలోల తాజా ఆకులనుంచి ఒక కిలో ఎండిన పొడి వస్తుంది. తయారు చేసిన పోడిని ఒవేన్ ల్లో 50 డిగ్రీ. సెం.గ్రే వద్ద ఉంచి అందులో తేమ తగ్గించాలి. దీన్ని గాలి రాని డబ్బాలో పోసి వేడి, వెలుతురు, తేమ లేని ప్రదేశాలలో నిల్వ చెయ్యాలి. 6-12 నెలల వరకు ఈ పొడిని నిల్వ చేసుకోవచ్చు. తాజా మునగ ఆకులో కన్నా పొడిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఈ పొడిని చపాతీలు, ఇడ్లీ, దోస, సూపుల్లో, సలాడ్ ల్లో కలిపి తీసుకోవచ్చు. దీనితో ఒక రకమైన టీ కూడా చేస్తారు. ఔషధంగా పని చేస్తుంది. పోషక లోపంతో బాధపడుతున్న చిన్న పిల్లలకు మంచిది. రక్తహీనత తగ్గిచడంలో, బాలింతలకు పాలు ఎక్కువ గా రావడానికి ఇస్తారు. ఇళ్లలో ఈ పొడిని తయారు చేసుకోవచ్చు. రోజుకు 1-2 చెంచాలు పొడి చేసుకోవచ్చు. మార్కెట్ల్లో పొడిగా రూపంలో లభిస్తుంది. ఒక గ్రాము మునగాకు పొడిలో పాలకూరలో కన్నా 25 రెట్లు ఇనుము,3 రెట్లు అదిక విటమిన్ ఉంటుంది. అలాగే అరటి పండులో కన్నా 15 రెట్లు, పొటాషియం పాలలో కన్నా 12 రెట్లు కాలుష్యం, క్యారెట్ లో కన్నా 10రెట్లు విటమిన్ ఏ, గుడ్లలో కన్నా 9రెట్లు మాంసకృత్తులు కన్నా అధికంగా ఉంటాయి.
Also Read: Jamun Fruit: యూరోపియన్ మార్కెట్లలో జామున్ ఫ్రూట్ కి విపరీతమైన డిమాండ్