నేలల పరిరక్షణ

Eutrophication Losses: యూట్రోఫికేషన్ గురించి ప్రతి రైతు తెలుసుకోవలసిన విషయాలు.!

1
Eutrophication Losses

Eutrophication Losses: యూట్రోఫికేషన్ అనేది అకర్బన మొక్కల పోషకాల ద్వారా నీటి ప్రవాహాలు లేదా ఉపరితల నీటి వనరులను అవసరం లేని హానికర పదార్థాలను పెంచే ప్రక్రియను సూచిస్తుంది. ఉపరితల జలాల్లోకి వ్యవసాయ భూముల నుండి ప్రవేశించే నత్రజని యూట్రోఫికేషన్‌ను ప్రేరేపించడంలో ముఖ్య కారణం. ఈ అవసరం లేని పదార్థాలలో ముఖ్యంగా N మరియు P రెండూ జీవులకు, వ్యవసాయానికి, నెలకు హానికరమైనవి. ఈ కృత్రిమ యూట్రోఫికేషన్ ఇప్పటికే భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో జరిగింది మరియు ఇప్పటికి జరుగుతున్నది. యూట్రోఫికేషన్‌కు కారణాలు మట్టి నుండి పోషకాలు సహజంగా బయటకు రావడం మరియు నెలలో రాళ్ల వాతావరణం, వ్యవసాయ భూముల నుండి అకర్బన ఎరువులు & నైట్రేట్లు మరియు ఫాస్ఫేట్‌లు ఉండడం, వర్షాలు ఎక్కువగా ఉన్నపుడు వేగవంతమైన ప్రవాహం, మైనింగ్, నిర్మాణ పనులు లేదా భూమి వినియోగం తక్కువగా ఉండటం, గృహ వ్యర్థ జలాల ద్వారా డిటర్జెంట్లు (ఫాస్ఫేట్లను కలిగి ఉంటాయి)విడుదల చేయడం చెప్పుకోదగ్గ ప్రక్రియలు.

Eutrophication Losses

Eutrophication Losses

Also Read: Deep Soils Management: దున్నే అపుడు మీ ట్రాక్టర్ ఎందుకు కూరుకుపోతుందో కారణం తెలుసుకోండి.!

యూట్రోఫికేషన్ యొక్క దుష్ప్ప్రభావాలు
• ఫైటోప్లాంక్టన్ మరియు ఫిలమెంటస్ ఆల్గే యొక్క అధిక పెరుగుదల
• జల మొక్కల జీవనంలో పెరుగుదల
• నీటి నాణ్యతను నష్టపరిచి మేఘావృతంగా తయారవడానికి కారణమవును.
• నీటిలో చేరే ఇతర పదార్థాలు రేటు పెరుగుదల
• ప్రాణవాయువు కొరత ఉన్న పరిస్థితుల అభివృద్ధి (తక్కువ ఆక్సిజన్ స్థాయిలు)
• ఆల్గే బ్లూమ్స్(నాచు లేదా ఆల్గే) యొక్క పెరుగుదల ఆక్సిజన్ కొరత మరియు చేప జాతుల కూర్పులో మార్పుకు కారణమవుతుంది. ఇది జల చరాల పెరుగుదలకు ప్రతిబంధకంగా తయారవుతుంది.

కృత్రిమ యూట్రోఫికేషన్‌ను తగ్గించే చర్యలు
• డిటర్జెంట్లలో బిల్డర్లుగా ఫాస్ఫేట్ వాడకాన్ని నిషేధించడం లేదా తగ్గించడం.
• నైట్రేట్ పదార్థాలు ఉండే ఎరువులు వాడకాన్ని తగ్గించడం అనగా నత్రజని ఎరువులకు తగినట్టుగా వాడడం.
• ప్రసరించే నీటిని నదులు మరియు లోక్‌లలోకి విడుదల చేసే ముందు ఫాస్ఫేట్ మరియు నైట్రేట్‌లను తొలగించడానికి మురుగునీటి శుద్ధి చేసే సామర్థ్యం గల పద్ధతులను ఉపయోగించడం ఉత్తమమైనది.
• వ్యర్థ జలాలను సరస్సుల నుండి సురక్షితంగా చేయడానికి శుద్ధి చేసే ప్రాంతాలకు లేదా వాటిని నేలలోకి ఇంకే విధంగా చేసే ప్రదేశాలకు మళ్లించడం.
• ముఖ్యంగా ఆల్గల్ పుష్పించే సమయంలో ఆక్సిజన్ క్షీణతను నివారించడానికి సరస్సులు మరియు రిజర్వాయర్‌లను గాలిని నింపడం
• ప్రభావిత సరస్సుల నుండి ఫాస్ఫేట్ ను అధికంగా మొక్కల దాచుకునే మొక్కలను పెంచి హానికర పదార్థాన్ని తొలగించడం చేయవచ్చు.
• డ్రెడ్జింగ్(ముంపు ప్రాంత నేలను శుభ్రపరచుట ద్వారా ఫాస్ఫేట్ అధికంగా ఉన్ననెలలో వాటి అవక్షేపాలను తొలగించడం కూడా చేయవచ్చు. కానీ ఈ ప్రత్యేకమైన పద్ధతి ఖర్చుతో కూడుకున్న పద్ధతి.

Also Read: Citrus Gummosis Managment: నిమ్మ బంకకారు తెగులు “గమ్మోసిస్” నిర్వహణ.!

Leave Your Comments

Deep Soils Management: దున్నే అపుడు మీ ట్రాక్టర్ ఎందుకు కూరుకుపోతుందో కారణం తెలుసుకోండి.!

Previous article

How Methane Released in Farming: మీథేన్ భూమి నుండి ఎలా వస్తుంది, ఏ విధంగా హాని చేస్తుంది?

Next article

You may also like