వ్యవసాయ వాణిజ్యం

Beedi Leaves: టెండూ ఆకుల గురించి ఎప్పుడైనా విన్నారా ?

1
Beedi Leaves
Beedi Leaves

Beedi Leaves: మధ్యప్రదేశ్ భారతదేశంలో అతిపెద్ద టెండూ ఆకుల ( డయోస్పైరోస్ మెలోనోక్సిలాన్ ఆకులు ) ఉత్పత్తి చేస్తుంది. దేశంలో మొత్తం టెండు ఉత్పత్తిలో దాదాపు 25%. ఈ రాష్ట్ర సగటు వార్షిక ఉత్పత్తి సుమారు 25 లక్షల స్టాండర్డ్ బ్యాగ్‌లు. ఒక స్టాండర్డ్ బ్యాగ్ టెండూ లీవ్స్ లో 50 ఆకుల 1000 కట్టలు ఉంటాయి. డయోస్పైరోస్ మెలనోక్సిలోన్ ఆకును సులభంగా చుట్టవచ్చు, ఇది విస్తృతంగా లభ్యమవుతుంది, అందువలన దీనిని మంది బీడీ రేపర్‌గా పరిగణిస్తారు.

Beedi Leaves

Beedi Leaves

Also Read: Ecological Importance of Forests: అడవుల పర్యావరణ ప్రాముఖ్యత

బ్యూటీయా మోనోస్పెర్మా, షోరియా రోబస్టా మొదలైన అనేక ఇతర మొక్కల ఆకులు కూడా మన దేశంలోని వివిధ ప్రాంతాలలో బీడీ చుట్టలుగా ఉపయోగించబడుతున్నా, టెండు ఆకుల ఆకృతి, రుచి మరియు పని సామర్థ్యం సాటిలేనివి. ఈ ఆకులను విస్తృతంగా ఉపయోగించుటకు ప్రధానంగా వాటి అపారమైన ఉత్పత్తి, ఆమోదయోగ్యమైన రుచి, వశ్యత, కుళ్లిపోయే నిరోధకత మరియు మంటలను నిలుపుకునే సామర్థ్యం.
అన్ని కూలీ పనులకన్నా బీడీ చుట్టడం అనేది చాలా సులభమైన పని. ఇది ఎక్కడైనా ఎప్పుడైనా చేయవచ్చు. ఇప్పటికి మన దేశంలో లక్షలాది మంది పేద గ్రామీణ ప్రజలకు బీడీ పరిశ్రమ ఒక అనుబంధ వృత్తి. బీడీ ఆకుల సేకరణ, ఊర్లలో పనిలేని గడ్డు పరిస్థితులలో గ్రామీణ ప్రజలకు ఉపాధిని అందిస్తుంది. సహజంగానే, గ్రామీణ ప్రాంత సంక్షేమంలో మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంలో బీడీ పరిశ్రమకు కీలక పాత్ర ఉంది.

Beedi Leaves Making Process

Beedi Leaves Making Process

టెండు ఆకుల సేకరణ మరియు ప్రాసెసింగ్ ప్రక్రియ అన్ని చోట్లా అదే విధానం ప్రకారంగా ఉంటుంది. దాదాపుగా ఇది ప్రమాణీకరించబడింది అలాగే అన్ని చోట్ల ఒకే విధంగా ఉపయోగించబడుతుంది. టెండు మొక్కలను ఫిబ్రవరి, మార్చి నెలల్లో కత్తిరించి దాదాపు 45 రోజుల తర్వాత పండిన ఆకులను సేకరిస్తారు. ఆకులను 50 నుండి 100 ఆకులు గల కట్టలుగా కడతారు. కట్టలను ఒక వారం పాటు సూర్యరశ్మిలో ఎండబెట్టి, ఎండిన ఆకులను మృదువుగా చేయడానికి నీటితో చల్లి, ఆపై గొనె సంచులలో గట్టిగా నింపి 2 రోజుల పాటు ఎండలో ఉంచుతారు. ఈ విధంగా ప్యాక్ చేసి క్యూర్ చేసిన బ్యాగులను, బీడీ తయారీలో ఉపయోగించే వరకు నిల్వ చేస్తారు.

టెండు ఆకుల సేకరణ అనేది ప్రాథమిక సహకార సంఘాల ద్వారా జరుగుతుంది. ఇది సుమారు 6 వారాల పాటు కొనసాగుతుంది. జిల్లాల భౌగోళిక పరిస్థితుల ఆధారంగా, ఏప్రిల్ మధ్య నుండి మే రెండవ వారం వరకు ఎప్పుడైనా సీజన్ ప్రారంభమవుతుంది. వర్షాకాల ప్రారంభానికి పది నుండి పదిహేను రోజుల ముందు సేకరణ ముగుస్తుంది. సంచులలో ఉంచి గోడౌన్‌లకు సురక్షితంగా రవాణా చేయవచ్చు.

Also Read: Value Addition to Fruits: పండ్లలో విలువ జోడించిన ఉత్పత్తులు.!

Leave Your Comments

Ecological Importance of Forests: అడవుల పర్యావరణ ప్రాముఖ్యత

Previous article

Healthy Chemical Preservatives: మన ఆరోగ్యానికి ఎటువంటి కెమికల్ ప్రిజర్వేటివ్స్ మంచివి?

Next article

You may also like