Care Taken to Avoid Food Poisoning: ఇలా చేస్తే ఫుడ్ పాయిసనింగ్ జరగదు.!ఫుడ్ పాయిజనింగ్ అనేది చాలా సాధారణ వ్యాధి. చాలా మందికి ఇది సాధారణంగా తేలికపాటిది, అయితే ఫుడ్ పాయిజనింగ్ తీవ్రంగా ఉంటుంది మరియు కొంతమందికి ప్రాణాంతకం కూడా కావచ్చు.కలుషితమైన ఆహారం తినడం వలన లేదా కలుషితమైన నీరు తాగడం వల్ల ఫుడ్ పోయిజనింగ్ జరుగుతుంది. వంట సరిగ్గా చెయ్యనప్పుడు, ప్రాసెసింగ్, లేదా ప్యాకేజింగ్ లో లోపాల ఉన్నప్పుడు ఆహారాన్ని బ్యాక్టీరియా, వైరస్, లేదా ఇతర క్రీములు కలుషితం చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా బ్యాక్టీరియాలలో సాల్మోనెల్లా టైఫీ, విబ్రియో కలరా, క్లోస్ట్రిడియం డిఫెసిల్, స్టాఫైలోకోకస్ ఆరియస్ ఇంకా వైరస్లలో నోరో వైరస్ వంటివి ఆహారాన్ని కలుషితం చేస్తాయి. ఫుడ్ పోయిజనింగ్ వలన విరేచనాలు, జ్వరం, వాంతులు, కడుపు నొప్పి, ఆకలి తగ్గుదల వంటి లక్షణాలు కనిపిస్తాయి.మనం ఎల్లప్పుడూ ఫుడ్ పాయిజనింగ్ ను నిరోధించలేము, కానీ మనం చేయగలిగే కొన్ని మార్గాలతో ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఆ చిట్కాలను మనం తెలుసుకుందాం!
Also Read: Food Poisoning in Rainy Season: ఫుడ్ పాయిసనింగ్ గురించి ప్రతి ఒకరు తెలుసుకోవలసిన విషయాలు.!
- బాత్రూమ్‌ను ఉపయోగించిన తర్వాత, డైపర్‌లు మార్చిన తర్వాత లేదా జంతువులను తాకిన తర్వాత, ఆహారాన్ని తినే ముందు మరియు తర్వాత కనీసం 20 సెకన్ల పాటు సబ్బు మరియు వెచ్చని నీటితో చేతులను బాగా కడగాలి.
- ఇంపెటిగో (స్టెఫిలోకోకస్ బాక్టీరియా) వంటి స్కిన్ ఇన్ఫెక్షన్లు ఉన్నట్లయితే, మచ్చలు లేదా పుండ్లు ఉన్న సమయంలో ఇతరులకు ఆహారాన్ని సిద్ధం చేయవద్దు.
- తయారీ మరియు నిల్వ సమయంలో వేర్వేరు ఆహారాలు మరియు ఆహార రకాలను వేరుగా ఉంచాలి.
- ముడి ఆహారాలు మరియు వండిన ఆహారాలను వేరువేరుగా కోసి వండాలి.
- ఆహారాన్ని మళ్లీ వేడి చేస్తున్నప్పుడు, కనీసం 75°C ఉష్ణోగ్రత (170°F)కి చేరుకునే వరకు పూర్తిగా ఉడికించాలి. ఇలా చేయడం ద్వారా అన్ని విషాలను తొలగించలేము మరియు అన్ని బ్యాక్టీరియాలను చంపదు, కానీ కొన్ని సాధారణ రకాలను తొలగించేందుకు సహాయపడుతుంది.
- కొన్ని ఆహారాలు ఇతర పదార్థాల కన్నా ఎక్కువగా ఫుడ్ పాయిజనింగ్ కలిగించే అవకాశం ఉంది, అది తెలుసుకొని వాటిని మరింత జాగ్రత్తగా నిర్వహించాలి. ఉదాహరణకు, ఆకుపచ్చ కూరగాయలు మరియు క్యారెట్లు ఈ చేపలు, మాంసం, పౌల్ట్రీ, గుడ్లు మరియు పాల ఉత్పత్తులతో పోలుస్తే తక్కువ విషపూరితమైనవి.
- మాంసం వండే సమయంలో సిఫార్సు చేయబడిన అంతర్గత ఉష్ణోగ్రతలు చేరుకునేలా చూసుకొని పూర్తిగా ఉడికే అంత వరకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
- మిగిలిపోయిన ఆహారాన్ని నిల్వ చేయాలనుకుంటే ఒక గంట కంటే ఎక్కువసేపు బయట ఉంచకుండా వీలైనంత త్వరగా దాన్ని రిఫ్రిజిరేటర్ లో పెట్టాలి.
- గది ఉష్ణోగ్రత వద్ద ఆహారాన్ని కరిగించవద్దు, థావింగ్ కోసం రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. సాధారణంగా 2 రోజులు మించి ఉన్న ఆహారాన్ని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచకూడదు. చల్లని ఆహారాన్ని చల్లగా మరియు వేడి ఆహారాన్ని వేడిగా ఉంచాలి.
Also Read: High Density Planting in Cotton: అధిక సాంద్ర పద్దతిలో “తెల్ల బంగారం”సాగు