ఆంధ్రప్రదేశ్తెలంగాణనేలల పరిరక్షణ

Role of Calcium in Plants: మొక్కల ఎదుగుదలలో కాల్షియం పాత్ర.!

0
Role of Calcium in Plants
Role of Calcium in Plants

Role of Calcium in Plants: మొక్క నేల నుండి కాల్షియంను అయాన్ల రూపంలో అనగా (Ca2+)గా గ్రహించబడుతుంది.
1. ఆకులలో గల కణాల చుట్టూ ఉండే కణ కవచము కాల్షియం రూపమైన కాల్షియం పెక్టేట్ తో ఏర్పడుతుంది. ఇది లేకపోతే కణానికి ఒక ప్రత్యేకమైన రూపం ఉండదు. కణ కవచము మొక్కలకు విషపూరితం కాని పోషకాలను మాత్రమే మొక్క తీసుకునే విధంగా నియంత్రిస్తుంది. విత్తనాలలో, కాల్షియం, కాల్షియం ఫైటేట్‌గా ఉంటుంది.
2. కొత్త వేరు పెరుగుదల, కణ విభజనకు సహాయపడే మెరిస్టెమాటిక్ కణజాల కార్యకలాపాలకు కాల్షియం చాలా అవసరం.

Role of Calcium in Plants

Role of Calcium in Plants

Also Read: Sulphur Deficiency in Plants: మొక్కల ఎదుగుదలలో సల్ఫర్ ప్రాముఖ్యత.!

3. మొక్కలలో వివిధ ప్రక్రియలో తయారయే సేంద్రీయ ఆమ్లాలు మరియు ఇతర విషపదార్ధాల (అల్ వంటి) తటస్థీకరణకు కాల్షియం తప్పనిసరి.
4. ఇది మైటోసిస్ (కణ విభజన)లో పాత్ర పోషిస్తుంది అలాగే క్రోమోజోమ్ తయారీకి, దాని పాత్రను నిర్వహించడానికి సహాయపడుతుంది.
5. ఎసెన్షియల్ కో-ఫాక్టర్ లేదా హైడ్రోలేస్‌ల వంటి అనేక ఎంజైమ్‌లను యాక్టివేట్ చేయడానికి అవసరం. ఫాస్ఫోలిపేస్, అర్గ్నైన్ కినేస్, అమైలేస్ మరియు అడెనోసిన్ ట్రై ఫాస్ఫేటేస్ (ATPase) ఎంజైములను కూడా కాల్షియం యాక్టివేట్ చేస్తుంది.
6.నేల నుండి సంగ్రహించిన నత్రజనిని ప్రోటీన్‌లుగా సమీకరించడాన్ని కాల్షియం ప్రోత్సహిస్తుంది.
మొక్కలలో Ca యొక్క లోపం లక్షణాలు
1. కాల్షియం మట్టిలో ఉత్సాహంగా కదిలినప్పటికీ, మొక్కల వ్యవస్థలో ఇది స్థిరమైన పోషకం. ఒక మొక్క భాగం నుండి మరొక భాగానికి అంత చురుకుగా ప్రయాణించలేదు. అందువల్ల లోప లక్షణాలు లేత రెమ్మలు మరియు చిన్న మొలకల, పెరుగుతున్నఆకుల వద్ద కనిపిస్తాయి. కాల్షియం లోపం మెరిస్టెమాటిక్ కణజాలంలో తగ్గుదల ద్వారా వర్గీకరించబడుతుంది.
2. టెర్మినల్ బడ్(కోసం కొమ్మల)పెరుగుదల వైఫల్యం లేదా ఊర్తిగా ఎండిపోవడం.
3. లేత ఆకులు ఎండిపోవడం (క్లోరోసిస్) తర్వాత కాండం యొక్క పెరుగుతున్న భాగాలు ఎండిపోతాయి. .
4. Ca లోపం వల్ల టొమాటోలో మొగ్గ తెగులు వస్తుంది
5. పండ్ల చెట్లలో, పెరుగుతున్న భాగాలు ఎండిపోయి కొద్దిరోజులకు చనిపోతుంది.
6. ఆపిల్‌లో, పండ్ల కండ యొక్క రంగు మారడం, పరిస్థితిని “బిట్టర్ పిట్”గా పిలుస్తారు.
7. జామలో, పాత ఆకులు ఎరుపు గోధుమ రంగు మచ్చలతో క్లోరోటిక్‌గా ఉంటాయి.
8.కాలిఫ్లవర్ జాతిలో,కొత్త ఆకులలో రంగు తీవ్రంగా కోల్పోవడం, చివరి మొగ్గ వద్ద ఆకులు మెలితిరిగి, ఆకులు కప్పు ఆకారంలో మారతాయి. చివరి మొగ్గ విచ్ఛిన్నం కారణంగా పాత ఆకులు రాలిపోతాయి.
9. మొక్కజొన్నలో కొత్త ఆకులు విప్పకుండా, అంచులు రంగులేనివిగా, జిగట వంటి జిలాటినస్ పదార్థంతో కప్పబడి ఉంటాయి.

నివారణ చర్యలు
 కాల్షియం కార్బోనేట్ లేదా సల్ఫేట్ @ 2 – 4 q ఒక హెక్టార్ కు నేలలో వేసినట్లయితే దిగుబడిని 48% పెంచవచ్చు.

Also Read: Zinc Deficiency in Crops: వివిధ పంటలలో జింక్ లోపం సవరణ.!

Leave Your Comments

Humus Importance in Soil: నేలలో హ్యూమస్ ప్రాముఖ్యత.!

Previous article

Jamun Cultivation: నేరేడు సాగుతో అన్నదాతలకు లక్షల్లో ఆదాయం.!

Next article

You may also like