National Honey Mission: భారత ప్రభుత్వం ఆత్మ నిర్బర్ భారత్ లో భాగంగా అనేకానేక రంగాలలో స్వయం ప్రత్యుత్పత్తి సాధించే విధంగా వివిధ పథకాలను రూపొందించింది. వీటిలో టెక్నాలజీ, సేవా రంగమే కాకుండా వ్యవసాయం, అనుబంధ రంగాలు కూడా ఉన్నాయి. అందులో తేనెటీగల పెంపకం మరియు తేనె ఉత్పత్తి, నాణ్యత నియంత్రణా, విదేశీ ఎగుమతులు తదితర అంశాల పైన సమగ్రంగా తయారు చేసినదే నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్.
Also Read: Honey Bee Farming: తేనె తెట్టె నుండి తేనె తీసే సమయం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
భారత ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ప్రతిష్టాత్మకంగా 3 సంవత్సరాల వ్యవధి కోసం 500 కోట్ల రూపాయలతో ఈ పథక ప్రణాలికను రచించింది. ఇది మన దేశంలో జరిగే తేనె సంబంధ పనులకు చేయూతను ఇవ్వడానికి, శాస్త్రీయ పరిజ్ఞానంతో తేనె ఉత్పత్తి చేయుట వంటి అంశాలను పరిగణిస్తుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం “స్వీట్ రెవల్యూషన్” సాధించుటగా ప్రభుత్వం అభివర్ణిస్తుంది.
ఈ మిషన్ కింద 3 మినీ మిషన్లను (MMలు)-MM-I, MM-II & MM-III దీని కింద తేనె రైతులకు తేనె సంబందించిన అవగాహన, సామర్థ్యంపై ద్రుష్టి, మహిళలపై దృష్టి, తేనెటీగల పెంపకం ద్వారా సాధికారత, ఏర్పాటుకు కావలిసిన సాంకేతిక సహాయం, ఇంటిగ్రేటెడ్ తేనెటీగల పెంపకం అభివృద్ధి కేంద్రాలు (IBDCలు), హనీబీస్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లు (తేనె తీగల రోగాలు గుర్తించే ల్యాబులు), హనీ టెస్టింగ్ సెట్టింగ్/అప్‌గ్రేడేషన్ ప్రయోగశాలలు, తేనెటీగల పెంపకం సామగ్రి తయారీ యూనిట్లు , కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ఎపీ థెరపీ కేంద్రాలు, నాణ్యమైన న్యూక్లియస్ స్టాక్ అభివృద్ధి కేంద్రాలు & తేనెటీగల పెంపకందారులు, మొదలైనవి, డిజిటలైజేషన్/ఆన్‌లైన్ నమోదు, మొదలైనవి MM-I కింద, ప్రాసెసింగ్, MM-II కింద అదనంగా, మార్కెట్ మద్దతు మొదలైనవి మరియు MM-III కింద R&D. కోసం రూ.145.00 కోట్లు NBHM కింద కేటాయించారు.
తేనెటీగల పెంపకం యొక్క ప్రాముఖ్యత
తేనెటీగల పెంపకం రైతులకు మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు, దేశ పర్యావరణానికి ఎనలేని మేలు చేస్తుంది.
1. పరాగసంపర్కంకి తోడ్పడుట ద్వారా పండ్లు, కూరగాయలు, నూనెగింజలు, పప్పులు మొదలైన ఆహార ఉత్పత్తుల పరిమాణాన్ని పెంచదమే కాకుండా నాణ్యతను పెంచడంలో కూడా తోడ్పడుతుంది.
2. ఇది పర్యావరణం మరియు వ్యవసాయం యొక్క స్థిరమైన అభివృద్ధికి సహాయపడుతుంది మరియు జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది.
3. వ్యవసాయంలో ముఖ్యమైన ఇన్‌పుట్ మరియు తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతిక పద్ధతి. ఇది జీవనోపాధికి ఆధారం మరియు దేశ ప్రజలకు ఉపాధిని సృష్టిస్తుంది.
4. ఆదాయాన్ని పెంచి రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
5. పర్యావరణానికి తేనెటీగలు చాలా ముఖ్యమైనవి, తేనెటీగలు లేకపోతే,మొక్కల మధ్య పరాగసంపర్కం జరగదు,మొక్కలలో సంపర్కం జరగక పోతే ఏ ఒక్క మొక్క పైన కూడా ఆహారం పుట్టదు. వ్యయసాయానికి, తేనెటీగలకు తరతరాలుగా అవినాభావ సంబంధం ఉంది.
Also Read: Honey Hive Management: వివిధ కాలాలలో తేనెటీగల యాజామాన్యం