Paddy Cultivation: తెలంగాణ జిల్లాలలో సుమారుగా 44 లక్షల ఎకరాలలో సాగవుతున్న ప్రధాన ఆహారపు పంట వరి. ఇటీవలి కాలంలో వస్తున్న వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు, ఆలస్యంగా కురిసే వర్షాల వలన వరి విస్తీర్ణం క్రమంగా తగ్గుతున్నది. రానురాను వ్యవసాయ కార్మికుల సమస్య, నీటి కొరత, చీడపీడల వలన వరి పంట సాగు సంక్షోభంలో పడుతుంది. దీనికి తోడు చౌడు మరియు యాసంగిలో చలి వలన రైతులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. సాగు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. చౌడును తట్టుకొను వికాస్, సస్యశ్రీ, సియస్ఆర్ 13 వంటి రకాలను ఎన్నుకోవాలి.
నారుమడి యాజమాన్యము : చౌడు సమస్య ఉన్నప్పుడు సాధారణ పద్ధతిలో నారు పెంచినట్లయితే నారుమడి సరిగ్గా రాదు. కావున రైతులు ఈ చౌడు పొలాల్లో వీలైనంత ఎక్కువగా సేంద్రియ ఎరువులు వేయాలి. నారుమడిలో వేయవలసిన ఎరువుల మోతాదును పెంచి వేసుకోవాలి. ముఖ్యంగా భాస్వరం ఎరువును సిఫారుసు మోతాదు కంటే రెట్టింపు చేయాలి. నారుమడిలో జింకు లోపము వచ్చే అవకాశము ఉన్నందున, ఎకరాకు సరిపోవు నారుమడికి తప్పనిసరిగా 1 కిలో జింకు సల్ఫేట్ వేసుకోవాలి. నారు పెరిగే సమయంలో పశువుల ఎరువును గాని, గొర్రె ఎరువును గాని పొడిచేసి లేదా వర్మికంపోస్టును గాని నారు మడిలో వలుచగా ఒక పొరలాగా చల్లుకోవాలి. అంతేకాకుండా, ఎల్లప్పుడు పలుచగా నారుమడిలో నీరు పెడుతూ తీసివేస్తూ ఉండాలి.
Also Read: Varieties Of Paddy: 5 కొత్త వరి వంగడాలు సిద్ధం
ప్రధాన పొలం యాజమాన్యం
ప్రధాన పొలంలో చౌడు. తీవ్రతలను తగ్గించుటకు ప్రతి వంటకు తప్పనిసరిగా పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగ, పెసర మరియు పిల్లిపిసర లాంటి పంటలను వేసి పూత సమయంలో పొలంలో బాగా కలియదున్నాలి. చౌడు పొలాలను బాగా దమ్ము చేసి, నీరు తీసివేయాలి. తప్పనిసరిగా 3-4 మొక్కలు నాటాలి.
చౌడు పొలాల్లో లేత నారు నాటడము మరియు పైపైన నాట్లు వేయడము వలన లవణాల ప్రభావముతో వారు చనిపోయే అవకాశం ఉన్నది. కావున చవుడు ఉన్నప్పుడు కొద్దిగా మట్ట ముదిరిన నారును నాటు దూరము తగ్గించి కొంచెం లోతుగా నాట్లు వేసుకోవాలి. పొలంలో చౌడు ఉన్నప్పుడు నీటి యాజమాన్యములో కూడా మార్పులు 2 లోపాల వలన చేసుకోవాలి. పొలంలో నీరు నిలువ ఉంచుతూ, తీసివేస్తూ క్రొత్త నీరు పెట్టడము వలన, లవణాల సాంద్రత పెరగకుండా నిరోధించవచ్చు.
సేంద్రియ ఎరువులు ఎక్కువగా వేయడము వలన, దౌడు ప్రభావాన్ని మొక్కలపై కొంతవరకు తగ్గించవచ్చు. చౌడు పొలాల్లో అంతరకృషి వేయటానికి చేయడము లేదా కోనోవీడర్ గాని పవర్ వీడర్ గాని త్రిప్పడము వలన చెడు ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. వర్షపు నీరు వలన పొలంలో లవణాల సాంద్రత తగ్గి చౌడు ప్రభావం చాలావరకు తగ్గుతుంది. కాబట్టి వర్షాకాలము కన్నా యాసంగిలో చౌడు పొలాల్లో ఎక్కువ లవణాల ప్రభావము ఉంటుంది.
శాశ్వత చౌడు వరకూ ఆరగ నివారణకు గాను రైతులు ఎప్పటికప్పుడు పచ్చిరొట్ట పైర్లను క్రమంగా సలై సాగుచేయడము, సేంద్రియ ఎరువులు అధికంగా వాడడము సల్ఫేట్ వంటి మరియు భూసార పరీక్షననుసరించి జివ్సం లాంటి రసాయనాలను భూమిలో వేసి బాగా నీరు పెట్టి కలియదున్ని, నీటిని తీసివేయడము వలన పొలంలో లవణాల సాంద్రతను తగ్గించి చౌడును నివారించుకొనే అవకాశం ఉన్నది.
Also Read: Paddy planting by machine: యంత్రాలతో వరి నాటడం