తెలంగాణ సేద్యం

తోటకూర సాగు -యాజమాన్య పద్ధతులు

0

తెలంగాణలో సుమారుగా 12173 హెక్టార్లలో ఆకు కూర పంటలు  సాగవుతున్నాయి. సాలీన 1,21,730 టన్నుల దిగుబడి భిస్తున్నది. భారతీయ భోజనంలో ఏ ప్రాంతం వారైనా అత్యధిక పోషక విలువలు  కలిగిన తోటకూరను తప్పని సరిగా వినియోగిస్తారు. సమీకృత పోషకాహారంలో భాగమైన లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు లభిస్తాయి. రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో విస్తారంగా తోటకూరను సాగుచేస్తారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని గోదావరి నదికి ఇరువైపులా సుమారు 13 మండలాల్లోని అనేక హెక్టార్లలో ఆకు కూరలు  ముఖ్యంగా తోటకూర సాగవుతుంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలు, కోస్తా జిల్లాల్లోని సముద్రతీరపు గరువు నేలల్లో రుచికరమైన తోటకూర భిస్తుంది.

వాతావరణం :

వివిధ శీతోష్ణస్థితుల్లో పెంచడానికి అనువైనది. నీటి అవసరం పరిమితంగా ఉంటుంది. శీతాకాంలో మాత్రం 150 సెల్సియస్‌ ఉష్ణోగ్రత లోపు పెరుగుద సరిగా ఉండదు.

నేలలు    :

ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలం  పిహెచ్‌ 6 0 -7 0 మధ్య ఉన్న నేలలు సాగుకు అనుకూలం. బంక మట్టి నేలలు, ఇసుక నేలలు పనికి రావు. వర్షాకాంలో జూన్‌ నుండి డిసెంబరు వరకు, వేసవికాలంలో జనవరి నుండి మే వరకు సాగు చేసుకోవచ్చు.

రకాలు :

సాధారణంగా కోస్తా జిల్లాలో తీర ప్రాంతంలో పండిరచే తోటకూర బాగా ఎత్తుగా ఎదిగి కాండంను కూడా కూరకు వినియోగించుకోవచ్చు. తోటకూర కాడలుగా పేరొందిన ఈ రకం ఇక్కడ విస్తారంగా సాగు చేస్తారు. ఆకుతోపాటు ఎత్తుగా ఎదిగిన కాడను వివిధ రకాలుగా మేళవించి వంటలు చేస్తారు. ఇక సాంప్రదాయకంగా దొరికే చిలకతోటకూర, కొయ్యతోటకూర ఒక సందర్భంలో ఎక్కడపడితే అక్కడ దొరుకుతుంది. వాణిజ్య పద్ధతిలో సాగుచేయడానికి అనేక హైబ్రీడ్‌ రకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

ఆర్‌ఎన్‌ఎ 1 :

ఈ రకంలో ఆకులు మరియు కాండం లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీనిలో విటమిన్‌ ఎ.సి లు  అధికంగా ఉండడమే కాకుండా కాండం కూడా పీచు లేకుండా మృదువుగా ఉండి రుచికరంగా ఉంటుంది. నెల రోజుల్లో ఒక ఎకరాకు 6.7 టన్నుల  దిగుబడిని ఇస్తుంది. మొదటికోత విత్తిన 15 -20 రోజులకు వస్తుంది. కోసిన తరువాత శాఖలు  బాగా విస్తరిస్తాయి. నీటి ఎద్దడి, తెల్ల  ఆకుమచ్చ తెగులును తట్టుకుని అధిక దిగుబడిని ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లో  ఖరీఫ్‌ మరియు వేసవికాంలో పండించేందుకు  అనువైనది.

కో 01- 02 :

కో 01లో ఆకు మరియు కాండం లావుగా ఉండి ఎకరానికి 3 నుండి 5 టన్నుల  దిగుబడిని 25 రోజుల్లో  ఇస్తుంది. ఆకు వెడల్పుగా ముదురు ఆకుపచ్చ రంగుతో ఉంటాయి. విత్తనాలు  చిన్నవిగా నల్లగా ఉంటాయి.  ఆకులు  కోలగా ముదురు ఆకుపచ్చ రంగులో పొడవుగా ఉంటాయి. కాండం కూడా కూరకు పనికి వస్తుంది. ఎకరాకు 4.5 టన్నుల వరకు దిగుబడినిస్తుంది.

పూసాచోటి చౌలై : మొక్కలు పొట్టిగా, ఆకు చిన్నవిగా ఉంటాయి. కోత రకం.

పూసాబడి చౌలై : మొక్కలు పొడవుగా, కాండం లావుగా లేతగా ఉండి, ఆకు పెద్దవిగా ఉంటాయి.

సిరికూర : మొక్కలు పొట్టిగా, ఆకు చిన్నవిగా ఉంటాయి. కాండం కూడా కూరకు పనికి వస్తుంది. ఎకరానికి 4 – 5 టన్నుల  దిగుబడి వస్తుంది.

నేల తయారీ :

నాలు గైదు సార్లు దుక్కి దున్నాలి. ఎకరాకు 10 టన్నుల  పశువు ఎరువును వేయాలి. మడులను బాగా చదును చేసుకోవాలి.

విత్తనాలు  వేసే విధానం :

2×1.5 మీటర్లు మడులో పలచగా విత్తుకోవాలి. ఎకరాకు 800 గ్రా. విత్తనం అవసరమవుతుంది. విత్తనంతో పాటు 10 రెట్లు సన్నటి ఇసుకను కలిపి వేయాలి. నారుమడిలో పోసుకుని 20×20 సెం.మీ దూరంలో నాటుకోవచ్చు. ఈ విధంగా చేస్తే ఎకరాకు ఒక కిలో విత్తనం సరిపోతుంది. విత్తనం వెదజల్లితే రెండు కిలోలు  కావాలి.

నీటి యాజమాన్యం :

భూమిలోని తేమను బట్టి 7-10 రోజుల  వ్యవధితో నీరు కట్టాలి. వేసవిలో ప్రతి 5 -6 రోజుకు ఒక తడిని ఇవ్వాలి. కోస్తా జిల్లాలో నీరు భూమి ఉపరితలం  పైననే తక్కువ లోతులో లభించడంతో నీటిని బుడ్లు (మట్టి కుండల)తో  వెదజల్లుతారు. ఈ తరహా నీటి యాజమాన్యం వల్ల   మొక్క మొలచిన నాటినుండి పంట కోతకు వచ్చే వరకు మొక్క ఏపుగా ఎదుగుతుంది.

దిగుబడి :

తోటకూర రెండు రకాలుగా సాగు చేస్తారు. అవి 1. కోతరకం, 2. వేళ్ళతో సహా పీకే రకం. కోత రకాల్లో  విత్తిన 25 రోజులకు మొదటిసారిగా కోసుకోవచ్చు. తరువాత 7 లేక 15 రోజులకు ఒక కోత చొప్పున 90 రోజుల వరకు 4.5 టన్ను దిగుబడి తీసుకోవచ్చు. మొక్కను వేర్లతో సహా పీకి కట్టకట్టే  రకాల్లో  మూడు టన్నుల  వరకు దిగుబడి వస్తుంది.

అంతర పంటగా :

గరువు నేలల్లో వేసే వరి పంటలో తోటకూరను వరుస మధ్యలోనూ, గట్లపైన వేస్తారు. అదేవిధంగా వేరుశెనగ పైరులో కూడా అంతర పంటగా సాగు చేస్తారు. పెరటిదొడ్లో రసాయన ఎరువులు లేకుండా తోటకూరను విత్తుకొని, పశువుల ఎరువు, సేంద్రియ ఎరువు, బయోఉత్పత్తుల  సహాయంతో ఇంటికి కావలసిన ఆరోగ్యకరమైన, రుచికరమైన తోటకూరను పండిరచుకోవచ్చు.

సస్యరక్షణ : తోటకూరకు ప్రధానంగా రెండు తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది. అవి..

  1. తెల్ల మచ్చ తెగులు , 2. ఆకు తినే గొంగళి పురుగు

తెల్ల మచ్చ తెగులు :

ఆకు అడుగుభాగానతెల్లటి బుడిపెలు  వంటివి ఏర్పడతాయి. ఆకు పై భాగాన లేత పసుపురంగు మచ్చలు ఏర్పడి పండుబారి పోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రా. కాపర్‌ఆక్సీక్లోరైడ్‌ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్‌ మందును కలిపి పిచికారి చేయాలి. ఆకు అడుగు భాగం  తడిచేలా చూడాలి. ఆకును తినే గొంగళి పురుగు, చిన్న, పెద్దవి ఆకును తినివేసి చిల్లులు  చేస్తాయి. అందువల్ల  మార్కెట్‌లో సరైన రేటురాదు. వీటి నివారణకు మలాథియాన్‌ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. చేసిన తరువాత కనీసం 10 రోజుల తరువాత ఆకును కోసుకోవాలి.

ఆకు తినే గొంగళి పురుగు :

చిన్న, పెద్ద పురుగు, ఆకును కొరికి వేయడం వల్ల  ఆకు పనికి రాకుండా పోవడమేకాక మార్కెట్లో సరైన రేటు రాదు. వీటి నివారణకు మలాథియాన్‌ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పిచికారి చేసిన తరువాత కనీసం 10 రోజుల  వ్యవధి ఇచ్చి ఆకు కోయాలి.

Leave Your Comments

వంగ పంటను ఆశించే పురుగులు-నివారణ పద్ధతులు

Previous article

సిరులు కురిపిస్తున్న కనకాంబరం సాగు

Next article

You may also like