Taiwan Guava Cultivation (PART I) : భారతదేశం పండ్ల సాగుకి ప్రఖ్యాతి చెందింది. పండ్లలో చాలా రకాలు వేరే దేశం నుండి వచ్చినవి కూడా శాస్త్రీయంగా సాగు చేసి అధిక లాభాలు పొందుతున్నారు. అందులో ప్రత్యేకంగా చెప్ప్పుకోదగినది టైవాన్ జామ. నేటి కాలంలో ఈ పండ్ల సాగు ఆదాయం మంచి లాభదాయకంగా ఉండడం చాలా మంది రైతుల ద్రుష్టి ఆకట్టుకుంటుంది.
తెలుపు,గులాబీ రంగు జామ రకాలు, అద్భు తమైన దిగుబడితో పాటు మంచి రుచిని కలిగి ఉండడం,అధిక డిమాండ్ సాగు వైపు ఆకర్షిస్తుంది.
తైవాన్ జామ, ఏడాది పొడవునా పండ్లను ఉత్పత్తి చేయగలదు.ఈ జామ రకాలు తెలుపు, ఎరుపు/గులాబీ లేదా పసుపు రంగు మాంసం కలిగి ఉంటాయి. కానీ, అన్నింటిలో అత్యధికం తెలుపు రంగు జాతులని సాగుచేస్తున్నారు.
ఈ రకం జామ ప్రజాదరణ పొందటానికి కారణం, ఇది మార్చి నుండి ఏప్రి ల్ నెల వరకు మొదటి
మరియు జూలై/ ఆగష్టులో రెండవ పంట అనగా సంవత్సరంలో రెండు పంటలు ఇవ్వడం వలన రైతులలో మంచి ఆదరణ పొందినది.
తైవాన్ జామ లక్షణాలు:
తైవాన్ వెరైటీలు తీపి,సువాసన,రుచి, మృ దువైన ఆకృ తి ఉండడం వలన వినియోగదారుల మన్ననలు పొందాయి. తైవాన్ జామలో అధిక ఆస్కార్బిక్ ఆమ్ల పరిమాణం ఉంతుంది. ఒక్కో పండు 250 – 300 గ్రాముల బరువు ఉం టుం ది. పండు పక్వ సమయం వచ్చినపుడు కూడా లేత ఆకుపచ్చ రం గులో ఉండటం విశేషం. తైవాన్ జామ చెట్టు 2.0 నుం డి 2.5 మీటర్ల వ్యా సం కలిగి, సగటున 2.5 – 3.0 మీటర్ల ఎత్తుకు పెరుగుతుంది.
Also Read: జామలో పంట నియంత్రణ
తైవాన్ జామ బరువైన బంకమట్టి నుండి చాలా తేలికైన ఇసుక నెలల వరకు విస్తారమైన భూములలో పెంచవచ్చు. అధిక దిగుబడి కోసం నీరు నిలవని లోమీ నెలలు అనుకూలం. నీరు నిలవడం వలన వేరుకుళ్ళు వ్యాధి సోకడానికి అవకాశం ఉంటుంది. నేల pH 4.5 నుం డి 7.0 వరకు అనుకూలం.
తైవాన్ జామ తోటల కోసం భూమి తయారీ:
నాటడానికి ముందు భూమిని లోతుగా దున్ని చదును చేయాలి.కలుపు మొక్కలను తొలగించి మురుగు నీరు పోయే సౌకర్యం కల్పించాలి.అందులో పొలం ఎరువు (FMY)ని బాగా కలపాలి. ఇది భూమిని తయారుచేసే సమయం వేయడం మంచిది. 1 మీ x 1 మీ x 1 మీ గొయ్యి తవ్వి FMY లేదా 25 కిలోల కంపోస్ట్ ను మట్టితో కలిపి గుంటలను నింపుకోవాలి. పూరిం చండి .
ప్లాస్టిక్ మల్చ్ ఫిల్మ్ ఉపయోగించి మట్టిని శుద్ధి చేయాలి.
తైవాన్ జామ నాటడం :
భారతదేశంలో రుతుపవనాల ప్రారంభానికి ముందు అనగా జూన్ జులై లో నాటుకోవచ్చు. నీటిపారుదల అందుబాటులో ఉన్న ప్రాంతాలలో సంవత్సరం పొడవునా నాటుకోవాచ్చు.
మొక్కల ప్రవర్తనం:
తైవాన్ జామను విత్తనము, కోత, గాలిలో అంటుకట్టుట ద్వారా ప్రవర్తనం చేయవచ్చు విత్తన ప్రవర్తం ఎక్కువ సమయం తీసుకుంటుంది.
అన్నింటిలో అనుకూలమైనది అంటుకట్టుట ( ఎయిర్ లేయరింగ్ )
వర్షాకాలం ప్రా రంభ సమయంలో, చతురస్రాకారంలో మొక్కలు నాటుకోవాలి. వాణిజ్య పరంగా సాగు చేసేవారు తప్పనిసరిగా 5
మీటర్ల నుం డి 8 మీటర్ల దూరం పాటిస్తుంటారు.సాధారణంగా, 5-మీటర్లు x 5 మీటర్లు లేదా 6-మీటర్లు x 6 మీటర్ల దూరంలో మొక్కలు నాటుకోవచ్చు. అధిక సాంద్రత పాటించినపుడు మొక్కల మధ్య అంతరం తక్కువగా ఉండాలి. సాధారణం గా, అధిక సాంద్ర పద్దతిలో
వరుసల మధ్య 6 అడుగులు మొక్కల మధ్య 4 అడుగుల దూరం పాటించాలి.
తైవాన్ జామ నీటి యాజమాన్యం:
తైవాన్ జామ పంటకు వర్షాకాలంలో నీరు అవసరం ఉండదు. మొక్కలు పొలంలో నాటిన వెంటనే మొదటి నీటితడి ఇవ్వాలి. సగటున, రోజుకు 15- 30 లీటర్లు నీరు ఖర్చు అవుతుంది. బిం దు సేద్యం ద్వారా సాగు చేయడం నీటి ఆదా సాధించవచ్చు.
Also Read: జామ పండ్లే కాదండోయ్.. జామ ఆకులు ఆరోగ్యానికే మేలే